భారతి (మాస పత్రిక)

వికీపీడియా నుండి

భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో, మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడ స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది.


సాహిత్య, భాషా పరిశోధనా పత్రాలకీ, కవిత్వానికి పెద్ద పీట వేసిన ఈ పత్రిక నాణ్యమైన కథలనీ, వ్యాసాలనీ కూడ ప్రచురించేది. భారతిలో పేరు చూసుకోవటమే ఒక గర్వకారణంగా ఉండేది ఆ రోజుల్లో.

భారతి పత్రికకు గన్నవరపు సుబ్బరామయ్య సంపాదకులుగా ఉన్నారు.

నాగేశ్వరరావు అనంతరం అతని అల్లుడు శంభుప్రసాద్, ఆ తరువాత అతని కుమారుడు శివలెంక రాధాకృష్ణ భారతిని నిర్వహించారు.

భారతి తొలి సంచికలో మంగిపూడి వేంకటశర్మ రచించిన గాంధీ శతకము ప్రచురణ ప్రారంభించారు.

భారతిలో పనిచేసిన వారిలో తిరుమల రామచంద్ర, విద్వాన్ విశ్వం మొదలైన వారు ఉన్నారు. ఈ పత్రికలో మరొక ఆకర్షణ తలిశెట్టి రామారావు కార్టూనులు.

భారతి పత్రిక 1949లో రజతోత్సవం మరియు 1984లో వజ్రోత్సవం జరుపున్నది.

భారతిలో కథ పడటమే తమ సాహిత్య ప్రక్రియకు గీటురాయి అని అప్పట్లో రచయితలు అనుకునేవారట. తెలుగుసాహిత్య రంగంలో ఉన్న ఉద్దందులందరి కథలూ భారతిలో ప్రరుఛిరించబడ్డాయి. అందరికంటే ఎక్కువ కథలు భారతిలో ప్రచురించబడిన రచయిత చిదంబరం. ఆయన గురించిన వివరాలు అందుబాటులో లేవు.


వ్యాపార పక్షంగా లాభదాయకంగా లేక పోయినా సాహితీ ప్రియులకి ఇది ఒక అభిమాన పత్రిక.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె