విద్వాన్ విశ్వం

వికీపీడియా నుండి

విద్వాన్ విశ్వం గా చిరపరచితుడైన మీసరగండ విశ్వం విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం . 1915, అక్టోబర్ 21అనంతపురం జిల్లా లో తరిమెల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. ప్రజాహిత కార్యాలను నిర్వహిస్తూ సారస్వత సేవకులుగా ప్రసిద్ధిపొందినవారు.

"మీజాన్" పత్రికలో రచనావ్యాసాంగం, "ప్రజాశక్తి"లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయారు. 1952 లో ఆనాటి ప్రముఖ తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" సంపాదకీయునిగా "మాణిక్యవీణ"ను వారంవారం రసరమ్యధ్వనుల్ని మీటారు. ఆ తర్వాత, తిరుమల-తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగానికి ప్రధానసంపాదకునిగా కార్యభారాన్ని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించారు.

పిల్లల పత్రిక "చందమామ"లో ద్విపద కావ్యం రూపంలో వచ్చిన పంచతంత్ర కథలను వ్రాసింది కూడా ఈయనే.

[మార్చు] రచనలు

  • ఆత్మసాక్షి (కవిత్వం).
  • మాణిక్యవీణ.
  • ప్రేమించాను(నవల).
  • పెన్నేటిపాట
  • నాహృదయం (కావ్యాలు)


[మార్చు] అనువాదాలు

  • కధాసరిత్సాగరం కధాలహరిని 12 సంపుటాల్లో ఆంధ్రీకరణం చేశారు.
  • కాదంబరి (కాళిదాసు)
  • కిరాతార్జునీయం (కాళిదాసు)
  • దశకుమారచరిత్ర (కాళిదాసు)
  • మేఘసందేశం (కాళిదాసు)

[మార్చు] మూలాలు

http://www.telugujournal.com/ShowNews.asp?NewsID=11973&NewsType=sams

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె