తిరుపతి
| ?తిరుపతి మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | తిరుపతి |
| జిల్లా(లు) | చిత్తూరు |
| గ్రామాలు | 3 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
3,09,435 (2001) • 158717 • 150718 • 82.19 • 89.54 • 74.46 |
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఏకైక నగరము, అదే జిల్లాకు చెందిన ఒక మండలం. మరియు ఆంధ్ర ప్రదేశ్ లో4 వ అతిపెద్ధ నగరం .తిరుపతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుపతి నగరానికి దగ్గరలో రేణిగుంట వధ్ద అంతర్జాతీయ విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న తిరుపతికి ఏ దేశం నుంచైన నేరుగా చేరుకోవచ్చు.తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్తాయి కి తీర్ఛిదిద్దాలని భారత ప్రభుత్వం సంకల్పించింది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి.
విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతి వేంకటేశ్వరస్వామిని చాలా మార్లు దర్శించుకొని కానుకలు సమర్పించాడు. చంద్రగిరి కోట నుంచి తిరుమల గిరుల పైకి చేరుకోవటానికి అతి సమీప కాలి మార్గమైన శ్రీ వారి మెట్టు ద్వారా శ్రీ కృష్ణదేవ రాయలు తరచూ స్వామి దర్శనమునకు డోలీపై వెళ్ళేవాడు. 9వ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు, ఆ తరువాతి శతాబ్దపు తంజావూరు చోళులు, మదురైని పరిపాలించిన పాండ్యులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, సామంతులు ఈ వేంకటేశ్వరస్వామి భక్తులై కొలిచారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయనిర్వహణకు, సేవలకు దానధర్మాలు చేశారు.
విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది. శ్రీ కృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను, తన విగ్రహాన్ని, ఆలయ మండపం పై ప్రతిష్టింపజేశాడు. ప్రధాన ఆలయంలో వేంకటపతి రాయల విగ్రహం కూడా ఉంది.
విజయనగర సామ్రాజ్య పతనం తరువాత, దేశం నలుమూలల ఉన్న చాలామంది చిన్న నాయకులు, ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు. మరాఠీ సేనాని, రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజా నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు. ఈయన వేంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని, విలువైన వజ్రవైఢూర్యాలను బహూకరించాడు. ఆ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది. ఆ తరువాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు మరియు గద్వాల పాలకులు చెప్పుకోదగినవారు.
హిందూ సామ్రాజ్యాల తరువాత, పాలన కర్ణాటక ముస్లిం పాలకుల చేతిలోకి, ఆ తరువాత బ్రిటీషు వారికి వెళ్లింది. తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందికి వచ్చింది.
1843 లో ఈస్టిండియా కంపెనీ క్రైస్తవేతర, స్థానికుల ప్రార్ధనా స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది. వేంకటేశ్వరస్వామి ఆలయం, జాగీర్ల నిర్వహణ తిరుమలలోని హాథీరాంజీ మఠానికి చెందిన సేవదాస్‌జీకి అప్పగించారు. 1933 వరకు ఒక శతాబ్దం పాటు ఆలయ నిర్వహణ మహంతుల చేతిలో ఉంది.
1933 లో, మద్రాసు శాసన సభ ఆలయనిర్వహణ, నియంత్రణ బాధ్యతలను "తిరుమల తిరుపతి దేవస్థానములు" (టి.టి.డి) అనే సంస్థకి అప్పగిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ అధ్యక్షుడిని మద్రాసు ప్రభుత్వం నియమించేది. 1951లో ఈ చట్టాన్ని మార్చి టి.టి.డి నిర్వహణను ఒక ధర్మకర్తల సంఘానికి అప్పగించి, నిర్వహణాధికారిని ప్రభుత్వం నియమించేలా ఇంకొక చట్టం చేసింది.
[మార్చు] గంగమ్మ జాతర
- ప్రధాన వ్యాసం: తిరుపతి గంగమ్మ జాతర
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది.
అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- తిరుమల
- తిరుపతి
[మార్చు] మండలంలోని గ్రామాలు
[మార్చు] తిరుపతి లోని గుడులు
- గోవిందరాజ స్వామి దేవాలయం: తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత రాజగోపురంతో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. క్రీ.శ. 1130లో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ రాజగోపురాన్ని 1624లో స్వామిభక్తుడు మట్లి అనంతరాజు నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది శ్రీకృష్ణ ఆలయం అయినా, నాటి మూలవిరాట్ అయిన శ్రీకృష్ణుని మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని వేంకటేశ్వరుని పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం!
- కోదండ రామాలయం: ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే, సీతమ్మతల్లి రాములవారికి కుడివైపున ఉండటం! ఇది వైఖానసశాస్త్ర సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
- కపిలతీర్థం:కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. టిటిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడ చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం మరియు ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది.
- వరదరాజ స్వామి దేవాలయం:ఇది కపిల తీర్థం రోడ్డు లేదా కే టీ రోడ్డు లో ఉన్నది.
- జీవకోన:
- ఇస్కాన్ దేవాలయం: ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల ( అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది.
[మార్చు] తిరుపతి చుట్టుపక్కల గుడులు
- శ్రీనివాస మంగాపురం: తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం. ఇది ఆ శ్రీనివాసుడు విశ్రమించిన చోటు. నారాయణవనంలో పద్మావతీదేవిని వివాహమాడిన వేంకటేశ్వరుడు, తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడు నిలువెత్తుగా, బహు సుందరమూర్తిగా దర్శనం ఇస్తాడు.
-
- అలివేలు మంగాపురం లేదా తిరుచానూరు : తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొన్న భక్తులు- కొండ దిగి ముందుగా చేయాల్సిన పని తిరుచానూర్(దీన్నే అలివేలుమంగాపురం అంటారు)లోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవటమే! అయితే స్వామివారికన్నాముందే, అమ్మవారిని దర్శించాలని చాలామంది అంటారు. తిరుచానూర్, తిరుపతికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్తీకమాసంలో తిరుచానూర్ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలూ బహువైభవంగా జరుగుతాయి. స్వామికిలాగే, అమ్మవారికీ నిత్య కళ్యాణమే.
- ముక్కోటి: ఈ అలయము స్వర్నమరియు కల్యని నదుల ప్రవాహ వడ్డున నిర్మిమ్పబడింది.ప్రసిద్ది గాంచినది, మరియు కచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయము.చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం, ఈ శివాలయం.
[మార్చు] ముఖ్యమైన ప్రదేశాలు
- శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
- కపిలతీర్థం
- తిరుచానూరు
- గోవిందరాజస్వామి ఆలయం
- శ్రీనివాస మంగాపురం
- జూపార్కు
[మార్చు] తిరుపతి చుట్టుపక్కల చూడదగిన విశేషాలు
- చంద్రగిరి కోట: తిరుపతికీ చంద్రగిరి పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి చంద్రగిరి వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్ అండ్ సౌండ్ షోకు వెళ్ళాల్సిందే.
- హార్స్‌లీహిల్స్: తిరుపతికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో హార్స్‌లీహిల్స్ ఉంది. అంత ఎత్తున విడిదిగృహాన్ని కట్టించుకున్న అప్పటి కడపజిల్లా కలెక్టర్ డబ్ల్యు.డి.హార్స్‌లీ పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రా ఊటీగా పేరుపొందింది.
- తలకోన: పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
- కళ్యాణీ డ్యాం :
- కాణిపాకం : తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
అలపిరి దగ్గరున్న మెట్ల దారిలో వున్న తల తాకుడు గుండు:---దీన్నె తలయేరు గుండు అని కూడ అంటారు.- గతంలో అంటరాని వారు కొండ పైకి వెళ్ళే వారు కాదు. వారు ఈ గుండుకు తమ తలను తాకించి ఇక్కడి నుండే వారు తిరిగి వెనక్కి వెళ్ళే వారు. ఏడు కొండలపై తమ పాదాలను సైతం ఉంచ రాదు అని అనుకునె వారు. అందు చేత ఈగుండుకు రంద్రాలున్నాయి. ఇంకో కధనం ప్రకారం ఈ తలయేరు గుండు నుండి మెట్ల దారి అతి కష్టం వుంటుండి. దీనిని మోకాళ్ల మెట్ల దారి అంటారు. తమ మోకాళ్ల నెప్పులు తగ్గాలంటే ఈ గుండుకు తమ మోకాళ్లను తాకించి నడిస్తే మోకాళ్లు నెప్పులు వుండవని భక్తుల నమ్మిక. కారణం ఏదైతేనేమి తల తాకించినా, మోకాలు తాకించినా ఆ గుండుకు అనేక గుంటలు పడి వున్నాయి. గత కాలానికి దర్పణంగా ఈగుండును ఇప్పటికి చూడవచ్చు
ఇక్కడే శ్రీ వారి పాదాల మండపం వున్నది. ఇక్కడ శ్రీవారి పాదుకలు, వెండివి వున్నాయి. వాటిని భక్తులు కొంత రుసుం చెల్లించి తమ నెత్తిన పెట్టుకొని ఇస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శ్రీక్రిష్టదేవ రాయలచే నిర్మితం అయిన పెద్ద గోపురం కలదు.
[మార్చు] ఇంకా చూడండి
[మార్చు] బయటి లింకులు
|
|||||||
|
||||||||||||||||||||||||||||||||