అయోధ్య

వికీపీడియా నుండి
  ?అయోధ్య
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°48′N 82°12′E / 26.8, 82.2
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
10.24 కి.మీ² (4 sq mi)
• 93 మీ (305 అడుగులు)
జిల్లా(లు) ఫైజాబాద్ జిల్లా
జనాభా
జనసాంద్రత
75,000 (2001)
• 7,324/కి.మీ² (18,969/చ.మై)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 224123
• +05278
• UP-42


అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరము. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.

[మార్చు] వారసత్వం మరియు ప్రాముఖ్యత

అయోధ్య అత్యంత ప్రాచీనమైన, పెద్దదైన, అత్యద్భుతమైన నగరము. హిందూ పురాణాల ప్రకారం ఇది 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండేది. సూర్యవంశానికి చెందిన 63 వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యాయాలలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించడం జరిగింది.

జైన మతానికి చెందిన ఐదుగురు తీర్థంకరులు కూడా ఇక్కడే జన్మించారు. జైన మతానికి ఆధ్యుడైన శ్రీ రిషబదేవుడు కూడా ఇక్కడే జన్మించాడు. భగవాన్ స్వామి నారాయణ్ కూడా తన బాల్యం ఇక్కడే గడిపాడు. ఆయన భారతదేశం అంతటా ఏడు సంవత్సరాలు పర్యటించినపుడు ఆ యాత్రను ఇక్కడ నుంచే ప్రారంభించాడు. తులసీదాసు కూడా తానురచించిన రామచరిత మానస్ గ్రంథాన్ని క్రీ.శ. 1574 లో ఇక్కడ నుంచే ప్రారంభించాడు. తమిళనాడుకు చెందిన చాలామంది ఆళ్వార్లు కూడా అయోధ్య నగరాన్ని గురించి తమ రచనల్లో ప్రస్తావించారు.

[మార్చు] అయోధ్య వివాదం

మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదు ను నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992 వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పి.వి. నరసింహారావు. దీన్ని నివారించలేక పోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చ లా మిగిలిపోయింది.

"http://te.wikipedia.org/w/index.php?title=అయోధ్య&oldid=675702" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు