తిరుక్కడిగై

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తిరుక్కడిగై
Sholingur Temple midway of climb.jpg
తిరుక్కడిగై is located in Tamil Nadu
తిరుక్కడిగై
భౌగోళికాంశాలు : 13°04′N 79°15′E / 13.07°N 79.25°E / 13.07; 79.25Coordinates: 13°04′N 79°15′E / 13.07°N 79.25°E / 13.07; 79.25
ప్రదేశము
దేశము: భారత దేశము
రాష్ట్రం: తమిళనాడు
జిల్లా: వెల్లూరు
ప్రదేశము: తమిళనాడు, భారత దేశము
ఆలయం యొక్క వివరాలు
ప్రధాన దైవం: భక్తవత్సల పెరుమాల్
ప్రధాన దేవత: అమృతవల్లి
దిశ మరియు స్థానం: తూర్పుముఖము
పుష్కరిణి: తిరుక్కావేరి
విమానం: సింహకోష్ట విమానము
కవులు: పేయాళ్వార్
ప్రత్యక్షం: ఆంజనేయస్వామి
నిర్మాణ శైలి మరియు సంస్కృతి
వాస్తు శిల్ప శైలి : ద్రవిడ శిల్పకళ

తిరుక్కడిగై ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఇవి దక్షిణాదిన ప్రసిద్ధిచెందిన 108 వైష్ణవ దివ్యదేశాలు లో ఒకటి. దీనిని చోళసింహపురము అని మరియు చోళంగిపురము అని కూడా పిలుస్తారు. ఇది తిరుత్తణి నుండి 30 కి.మీ. దూరములో కలదు.

వివరణ[మార్చు]

యోగ నరసింహ స్వామి (అక్కారక్కన్) అమృతవల్లి త్తాయార్. అమృత తీర్థము - సింహకోష్ట విమానము - తూర్పుముఖము - కూర్చున్నసేవ - ఆంజనేయస్వామికి ప్రత్యక్షము - కలియన్; పేయాళ్వార్ కీర్తించినది.

విశేషాలు[మార్చు]

ఇది చోళ సింహపురమునకు 3 కి.మీ. దూరములో కొండపాలెము కలదు. ఇచట పెద్దకొండపై నృసింహస్వామి, అమృతవల్లి తాయార్ల సన్నిధి కలదు. ప్రతి శుక్రవారము స్వామికి విశేషముగా తిరుమంజనము జరుగును. చిన్నకొండపై ఆంజనేయస్వామి వేంచేసియున్నారు. ఇచట ఆంజనేయ స్వామివారు చతుర్భుజములతో శంఖచక్రములతో యోగముద్రలో వేంచేసి యుండుట విశేషము. ఈ క్షేత్రము విశేష ప్రార్ధనా స్థలము. దీర్ఘవ్యాధులు కలవారు, గ్రహ పీడితులు, మానసిక రోగులు వేలాదిగా వచ్చి ప్రార్ధనలు చేతురు. చోళసింహపురములో భక్తవత్సలన్ (ఉత్సవమూర్తి) వేంచేసియున్నారు. వీరి సన్నిధి వెనుక ఆదికేశవర్ వేంచేసి యున్నారు. ఎఱుంచి అప్పా అవతార స్థలమైన ఎరుంబి అగ్రహారము ఈ క్షేత్రమునకు సమీపముననే కలదు. ఈ క్షేత్రమునకు పడ శ్రీరంగమనియు ఇక్కడి పుష్కరిణికి తిరుక్కావేరి అని తిరునామముంచిరి.

సాహిత్యంలో తిరుక్కడిగై[మార్చు]

శ్లోకము :

చోళ సింహపురే యోగ సింహనామా విరాజతే |
అమృతాహ్వయ తీర్థాడ్యే సింహకోష్ట విమానగః ||
దేవీమమృత వల్ల్యాఖ్యా మాశ్రిత ప్రాజ్ముఖాసనః |
ప్రత్యక్షో మారుతై శార్జ్గ నందకాంశ మునిస్తుతః ||

పాశురము :

మిక్కానై మఱైయాయ్ విరిన్ద విళక్కై ; ఎన్నుళ్
పుక్కానై ప్పుగ శేర్ పొలిగిన్ఱ పొన్ మలై యై ;
తక్కానై క్కడిగై త్తడజ్ణ్కన్ఱిన్ మిశైయిరున్ద ;
అక్కారక్కనియై ; అడై న్దుయ్‌న్దు పోనేనే. - తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొల్ 8-9-4.

బయటి లింకులు[మార్చు]