కేరళ

వికీపీడియా నుండి

కేరళ
Map of India with the location of కేరళ highlighted.
రాజధాని
 - Coordinates
తిరువనంతపురం
 - 8.47° ఉ 76.95° తూ
పెద్ద నగరము తిరువనంతపురం
జనాభా (2001)
 - జనసాంద్రత
31,838,619 (12వ)
 - 819/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
38,863 చ.కి.మీ (21వ)
 - 14
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
నవంబర్ 1, 1956
 - ఆర్.ఎల్.భాటియా
 - వి.ఎస్.అచ్యుతానందన్
 - ఒకే సభ (141)
అధికార బాష (లు) మలయాళం
పొడిపదం (ISO) IN-KL
వెబ్‌సైటు: www.kerala.gov.in

కేరళ రాజముద్ర


కేరళ భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. కేరళ సరిహద్దులలో తూర్పు మరియు ఈశాన్య దిక్కులలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో కేరళ ఒకటి.

క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యం లో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరి ల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి 1956 నవంబర్ 1 న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు సంస్థానాలు చేపట్టిన సామాజ్క సంస్కరణలు స్వాతంత్ర్యం తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించారు. అందువలన మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. అయితే, ఆత్మహత్యలు,నిరుద్యోగం, నేరాలు భారత్‌లో కేల్లా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి.[1]

కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళం గా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

[మార్చు] ప్రాచీనం

కేరళ మరయూర్ ప్రాంతంలో క్రొత్తరాతియుగం జనులు నిర్మించిన పెద్ద రాతి సమాధులు - వీటిని మునియారాలంటారు
కేరళ మరయూర్ ప్రాంతంలో క్రొత్తరాతియుగం జనులు నిర్మించిన పెద్ద రాతి సమాధులు - వీటిని మునియారాలంటారు
అగస్త్య‌ మహర్షి పేరుమీద ప్రసిద్ధమైన అగస్త్యమలై -ఒక యాత్రాస్థలం -  తిరువనంతపురం జిల్లా పడమటి కనుమలలో ఉన్నది - అగస్త్యుడు వైదిక హిందూమతాన్ని దక్షిణభారతానికి తెచ్చాడని చెబుతారు.
అగస్త్య‌ మహర్షి పేరుమీద ప్రసిద్ధమైన అగస్త్యమలై -ఒక యాత్రాస్థలం - తిరువనంతపురం జిల్లా పడమటి కనుమలలో ఉన్నది - అగస్త్యుడు వైదిక హిందూమతాన్ని దక్షిణభారతానికి తెచ్చాడని చెబుతారు.

పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి, కేరళను వెలికితీసాడని పురాణ గాథ.[2][3] కొత్త రాతియుగం కాలంలో ఇక్కడి వర్షాటవులు మలేరియాకు ఆలవాలమై ఉండడంతో కేరళ ప్రాంతంలో మానవ నివాసాలు ఉండేవి కావు. అంచేత క్రీ.పూ.10వ శతాబ్దం నాటి కుండపెంకులు, సమాధులే ప్రజల నివాసానికి సంబంధించి ఇక్కడ లభించిన మొదటి దాఖలాలు.[2] ప్రాచీన తమిళం మాట్లాడే ప్రజలు వీటిని నిర్మించారు. దీన్ని బట్టి, ప్రాచీన కాలంలో కేరళ, తమిళనాడు ప్రాంతాలు (తమిళకం లోని భాగం) ఒకే భాష, జాతి, సంస్కృతికి చెందిన వారని తెలుస్తూంది. 14 వ శతాబ్దపు తొలినాళ్ళకు, భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం - చేర వంశీకులు - వంచి రాజధానిగా కేరళను పాలించారు. పల్లవుల తో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. ఆదే సమయంలో కేరళీయులు తమిళప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు ఏర్పడింది.


లిఖితంగా కేరళ గురించిన ప్రస్తావన సంస్కృత ఇతిహాసం ఐతరేయారణ్యకంలో మొదటిగా లభిస్తున్నది. తరువాత కాత్యాయనుడు, పతంజలి, పెద్దప్లినీ (Pliny the Elder) [4] ల వ్రాతలలోనూ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ (Periplus of the Erythraean Sea) గ్రంధంలోనూ కేరళ ప్రస్తావనలున్నాయి.

[మార్చు] మధ్యకాలం

కేరళలో థామస్ అపోస్తలునిచే ప్రతిష్టింపబడినవని చెప్పబడే సిలువ గుర్తులలో ఒకటి.
కేరళలో థామస్ అపోస్తలునిచే ప్రతిష్టింపబడినవని చెప్పబడే సిలువ గుర్తులలో ఒకటి.

చేర రాజులు వర్తకంమీద ఆధారపడినందున పశ్చిమ ఆసియా వర్తకులు క్రమంగా వ్యాపారస్థావరాలు ఏర్పరచుకొన్నారు.[5] ఇంకా తమ దేశాలలో తమపై జరుగుతున్న అత్యాచారాలనుండి తప్పించుకోవడానికి యూదులు, క్రైస్తవులు వంటివారు ఇక్కడికి వలస వచ్చారు. అలా సిరియన్ మలబార్ క్రైస్తవ సమాజం, [6], మప్పిల ముస్లిమ్ సమాజం వంటివి రూపు దిద్దుకొన్నాయి. యూదులు క్రీ.పూ. 573లో ఇక్కడకి వచ్చి ఉండవచ్చునని అంచనా.[7][8] అపోస్తలు థామస్ క్రీ.శ. 52లో కేరళలోని ముజిరిస్కు వచ్చి అక్కడి యూదులలో క్రైస్తవబోధనలు ఆరంభించాడని తెలుస్తున్నది. [9]


కాని షుమారు క్రీ.శ.345 లో యూదుల వలసకు (నస్రాని-యూదులు) ఖచ్చితమైన ఆధారం క్నాయి తోమా (Knai Thoma) రాక. 8వ శతాబ్దంలో ముస్లిం మతస్తులు కేరళలో స్థిరపడ్డారు. 1498లో వాస్కో డ గామా వచ్చిన తరువాత లాభసాటి సుగంధ ద్రవ్యాల వర్తకంలో ఆధిపత్యంకోసం పోర్చుగీసువారు స్థానికులను, వారి వర్తకాన్ని అదుపుచేయడానికి ప్రయత్నించారు.


[మార్చు] బ్రిటష్ కాలం

డచ్చివారికి, పోర్చుగీసువారికి జరిగిన యుద్ధాలలో 1741లో డచ్చివారిది పైచేయి అయ్యింది. 1766లో మైసూరుకు చెందిన హైదర్ ఆలీ కేరళ ఉత్తరభాగమైన కోజికోడ్‌ను జయించాడు. 18వ శతాబ్దంలో హైదర్ ఆలీ కొడుకు టిప్పు సుల్తాన్‌కు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య జరిగిన రెండు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల ఫలితంగా మలబార్జిల్లా, దక్షిణ కెనరాలు 1790లో ఆంగ్లేయుల పరమయ్యాయి. 1791, 1795లలో కంపెనీవారు కోచి, తిరువాన్కూరు సంస్థానాలతో ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. మలబార్, దక్షిణకెనరా ప్రాంతాలు మద్రాసు ప్రెసిడన్సీలో భాగాలయ్యాయి.


కేరళలో బ్రిటిష్ అధికారానికి ప్రతిఘటనలు తక్కువనే చెప్పవచ్చు. 1946 పున్నపర-వయలార్ తిరుగుబాటు అలాంటివాటిలో ఒకటి.[10] కాని నారాయణ గురు, చత్తంపి స్వామిగళ్ వంటి సంస్కర్తల నాయకత్వంలో అంటరానితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా గట్టి ఉద్యమాలు నడచాయి. 1924లో జరిగిన వైకోమ్ సత్యాగ్రహం వీటిలో చెప్పుకొనదగినది. 1936లో తిరువాన్కూర్ చిత్ర తిరుణాల్ బాల రామ వర్మ అన్ని కులాలకూ ఆలయప్రవేశాన్ని కల్పిస్తూ ఆదేశాలను జారీ చేశాడు. కొచ్చిన్, మలబార్‌లలో కూడా ఇదే ప్రగతిశీల పరిణామాలు చోటు చేసుకొన్నాయి.


[మార్చు] కేరళ రాష్ట్రం

1947లో భారతదేశం స్వతంత్రమైనాక 1941 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ ఏర్పరచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్రపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని (4 తాలూకాలు మినహా) వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నిల అనంతరం ఇ.ఎమ్.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటివాటిలో ఇది ఒకటి. [11] [11] [12]


ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం కార్మికులకు, కౌలుదారులకు అనుకూలమైన విధానాలను అనుసరించింది. తరువాతి ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అవలంబించారు. [13][14] ప్రజల జీవన ప్రమాణాలు ఈ కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందాయి.

[మార్చు] భౌగోళికం

ఇడుక్కి జిల్లాలో మున్నార్ చుట్టుప్రక్కల ప్రాంతం బాగా పర్వతమయం.
ఇడుక్కి జిల్లాలో మున్నార్ చుట్టుప్రక్కల ప్రాంతం బాగా పర్వతమయం.

కేరళ భూవైశాల్యం 38,863 చ.కి.మీ. ఇది భారతదేశ వైశాల్యంలో 1.18%. ఎక్కువ భాగం పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్య ఉన్నది. ప్రపంచంలో జీవవైవిధ్యం బాగా ఉన్న 25 ప్రదేశాలలో కేరళ ఒకటి. (biodiversity hotspots) [15] ఉత్తర అక్షాంశాలు 8°18' మరియు 12°48' మధ్య, తూర్పు రేఖాంశాలు 74°52' మరియు 72°22' మధ్య [16] ఉన్న కేరళ పూర్తిగా భూమధ్య ఉష్ణమండల ప్రదేశంలో ఉన్నది. కేరళ తీరరేఖ 580 కి.మీ. పొడవైనది. కేరళ వెడల్పు వివిధ ప్రాంతాలలో 35 కి.మీ - 120 కి.మీ. మధ్య ఉంటుంది.


భౌగోళికంగా కేరళను మూడు ప్రాంతాలుగా విభజింపవచ్చును - తూర్పు మెరక ప్రాంతం, మధ్య కొండ ప్రాంతం, పశ్చిమ పల్లపు (మైదాన) ప్రాంతం. భారత tectonic plate మధ్యలో ఉండడం వలన కేరళలో భూప్రకంపనల ప్రమాదం బాగా తక్కువ. [17]

వయనాడ్ గ్రామీణ ప్రాంతపు చిత్రం.
వయనాడ్ గ్రామీణ ప్రాంతపు చిత్రం.
కొల్లమ్ జిల్లా కోచి నీటికాలవలలో చీనా చేపలవల (చైనాలో తయారైనది)
కొల్లమ్ జిల్లా కోచి నీటికాలవలలో చీనా చేపలవల (చైనాలో తయారైనది)


కేరళ తూర్పు భాగం పడమటి కనుమల వర్షచ్ఛాయప్రదేశానికి ఆనుకొని ఉన్నది. ఇక్కడ ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఉన్నాయి. పడమటికి ప్రవహించే 41 నదులు, తూర్పుకు ప్రవహించే 3 నదులు ఇక్కడే ఆరంభమౌతాయి. పడమటి కనుమలు దాదాపు గోడకట్టినట్లున్నాయి. పాలఘాట్ దగ్గర మాత్రం ఖాళీస్థలం ఉన్నందున మిగిలిన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన ద్వారమయ్యింది. పడమటి కనుమల సగటు ఎత్తు 1,500 మీ. 2,500 మీ. ఎత్తైన శిఖరాలున్నాయి.


కనుమలకు ఆనుకొని పడమటి ప్రాంతంలో మధ్యకేరళ మైదానప్రాంతం ఉంది. ఇక్కడ ఎత్తుపల్లాల భూములు, లోయలు ఎక్కువ. [16] 250 మీ, 1000మీ. మధ్య ఎత్తులున్న ఇక్కడి కొండలకు తూర్పు అంచున నీలగిరి కొండలు, పళని కొండలు, అగస్త్యమలై, అన్నామలై వంటి పర్వతప్రాంతాలున్నాయి.


కేరళ పశ్చిమతీరమైదానం సమతలమైనది. ఇక్కడ అంతటా ఉప్పుటేరులు, నదీముఖద్వారాలు, కాలువలు చిలవలు పలవలుగా విస్తరించి ఉన్నాయి. వీటిని Kerala Backwaters అంటారు. వీటిలో అలప్పుళ్ళ, కోచిల మధ్యనున్న వెంబనాడ్ సరస్సు బాగా పెద్దది. దాని వైశాల్యం 200 చ.కి.మీ. మొత్తం దేశంలోని జలమార్గాలలో 8% కేరళలోనే ఉన్నాయి. [18] కేరళలో మొత్తం 44 నదులున్నాయి. వీటిలో పెరియార్(244 కి.మీ.), భరతపుళ్ళ (209 కి.మీ.), పంబ (176 కి.మీ.), చలియార్ (169 కి.మీ.), కదలుండిపుళ్ళ (130 కి.మీ.), అచన్‌కోవిల్ (128 కి.మీ.)-ముఖ్యమైన నదులు. మిగిలిన చిన్న నదులకు ఋతుపవన వర్షాలే పూర్తి జలాధారం. [16]

ఈ భౌగోళికకారణాలవల్ల పడమటి కనుమలలో కొన్ని ప్రాంతాలు సంవత్సరంపొడవునా నీటిమయమై ఉంటాయి. కుట్టనాడ్‌లో 500 చ.కి.మీ. ప్రదేశం సముద్రమట్టానికి దిగువున ఉంది. కేరళ నదులు చిన్నవైనందున వాటికి (ముఖద్వారాలలో) డెల్టాలు లేవు. కనుక పర్యావరణ ప్రభావాలు వీటిపై ఎక్కువ. [19] వేసవిలో ఎండ్రు, ఆనకట్టలవల్ల ఇసుక మేటలు, కాలుష్యం వంటి సమస్యలకు కేరళ నదులు వేగంగా ప్రభావితమౌతాయి. [20]

కేరళ వ్యావసాయిక పర్యావరణం
కేరళ పర్యావరణ ప్రాంతాలు

కేరళలో జీవజాలం, వాతావరణం, నేల రకాలు చూపే చిత్రపటం.
Source: Jose 2002.


సంవత్సరానికి 120 నుండి 140 వరకు వర్షపు రోజులున్నందున కేరళ వాతావరణం బాగా తేమమయం. [21] తూర్పు కేరళలో కాస్త పొడి వాతావరణం ఉంటుంది. కేరళ సగటు వర్షపాతం 3,107 మి.మీ. (భారతదేశపు సగటు 1,197 మి.మీ.). ఇడుక్కి పర్వతప్రాంతాలలో 5,000 మి.మీ. వరకు వర్షపాతం నమోదు అవుతుంది. కేరళ వర్షాలకు ప్రధానకారణం ఋతుపవనాలు. more anomalous factors resulted in the red rains of 2001. Kerala . వేసవిలో ఈదురుగాలులు, తుఫానులు, అల్పపీడనం కారణంగా వచ్చే వర్షాలు సామాన్యం. పర్యావరణ ఉష్ణోగ్రతలు పెరగడం (global warming) వలన కూడా అకాల వర్షాలు, సముద్ర మట్టం పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. [22] [23] [24] [16]


కేరళ సగటు ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు - 27 డిగ్రీలు సెంటీ గ్రేడ్ మధ్య ఉంటాయి. ఇవే తీరమైదానాలలో 20 డిగ్రీలు-22.5 డిగ్రీలు మధ్య ఉంటాయి. దినసరి అధిక ఉడ్ణోగ్రతల సరాసరి 36.7 డిగ్రీలు సెంటీగ్రేడు. దినసరి అల్ప‌ఉష్ణోగ్రతల సరాసరి 19.8 డి.సెం. [25]

[మార్చు] వన్య, జంతు సంపద

ఇడుక్కి జిల్లా వాయువ్యాన మరయూర్ ప్రాంతంలో ఒక నది.
ఇడుక్కి జిల్లా వాయువ్యాన మరయూర్ ప్రాంతంలో ఒక నది.

కేరళ జీవవైవిధ్యం తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యి ఉన్నది. భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు, అంటే షుమారు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి. 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు (endemic) స్థానికం, 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధిమొక్కలు. [26][27] కేరళలోని 9,400 చ.కి.మీ. అడవులలో, ఎత్తును బట్టి ఎన్నో విధాల ఉష్ణమండలపు, సమోష్ణమండలపు వృక్షజాతులున్నాయి. మొత్తం కేరళలో 24% అటవీ భూమి. [28] సస్థంకొట్ట చెరువు, వెంబనాడ్ చెరువు - ఇవి రెండూ ప్రపంచంలో గుర్తింపబడిన (Ramsar Convention listed) తేమ పర్యావరణ ప్రదేశాలు. నీలగిరి జీవ పరిరక్షణా నిలయం (Nilgiri Biosphere Reserve) కూడా ఇదే గుర్తింపు పొందింది. ఇటీవలికాలంలో అడవులను వ్యవసాయభూములుగా మార్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకొని కేరళ అడవులలో చాలా భాగాన్ని రక్షితప్రాంతంగా ప్రకటించారు. [29]


కేరళ జంతుసంపదలో వైవిధ్యం, స్థానికత్వం గమనించదగిన విషయాలు.

తీవ్రమైన పర్యావరణ వినాశనం (అడవల నరికివేత, చరియలు విరగడం, ఉప్పుపట్టడం, ఖనిజసంపద త్రవ్వకం వంటివి) వల్ల కేరళలోని ఈ జంతుసంపద మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నది.

ఇడుక్కి జిల్లా మరయూర్ అడవులలో ఒక Grizzled Giant Squirrel (Protoxerus stangeri).
ఇడుక్కి జిల్లా మరయూర్ అడవులలో ఒక Grizzled Giant Squirrel (Protoxerus stangeri).

[మార్చు] విభాగాలు

కేరళలోని 14 జిల్లాలు చారిత్రికంగా మూడు విభాగాలుగా పరిగణింపబడుతాయి

కేరళ జిల్లాలు
కేరళ జిల్లాలు - జనసాంద్రత (చ.కి.మీ.కు జనాభా)ప్రకారం రంగులు చూపబడ్డాయి

కేరళ జిల్లాలు - జనసాంద్రత (చ.కి.మీ.కు జనాభా)ప్రకారం రంగులు చూపబడ్డాయ.
Source: Government of Kerala 2001.
కొచ్చి మెరైన్ డ్రైవ్  Royal Musical Walkway.
కొచ్చి మెరైన్ డ్రైవ్ Royal Musical Walkway.

కేరళ రాజధానితిరువనంతపురం రాష్ట్రంలో అత్యధిక జనాభా గల నగరం. [30] కొచ్చి ఎక్కువ నగరపరిసర జనాభా కలిగినది (most populous urban agglomeration) [31]

కోజికోడ్, పాలక్కాడ్, కొల్లం, త్రిస్సూర్ముఖ్యమైన ఇతర వాణిజ్యనగరాలు. కేరళ హైకోర్టు ఎర్నాకుళంలో ఉన్నది.

[మార్చు] రాజకీయాలు

కేరళ పాలనా వ్యవస్థ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలవలెనే ఉంటుంది.

కేరళలో రెండు ప్రధాన రాజకీయ సంకీర్ణాలున్నాయి. ఒకటి యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఇండియా) (UDF-United Democratic Front,India ) - ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నడుస్తంది. రెండవది లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్(LDF-Left Democratic Front) - ఇది భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) (CPI-M)అధ్వర్యంలో ఉంటుంది. వామపక్ష రాజకీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. రాజకీయ కార్యక్రమాలలో కేరళ ప్రజలు చైతన్యవంతంగా పాల్గొంటారు.

[మార్చు] ఆర్ధిక వ్యవస్థ

పన్నుల ద్వారా కేరళ రాష్ట్ర ప్రభుత్వపు ఆదాయం (కేంద్రం నుండి వచ్చే వాటాను మినహాయించి) 2005లో 11,124 కోట్ల రూపాయలు (2000 సంవత్సరంలో ఇది 6,360 కోట్లు). పన్నులు కాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం 2005లో 1,080 కోట్లు (2000లో 684 కోట్లు). [32] అయినా కేరళ బడ్జెట్ లోటు చాలా ఎక్కువ. అందువలన ప్రభుత్వఋణభారం ఎక్కువై సామాజికసేవలకు పెట్టే ఖర్చుకు ఇబ్బంది అవుతున్నది. [33]

త్రివేండ్రంలో టెక్నోపార్కు.
త్రివేండ్రంలో టెక్నోపార్కు.


మొదటినుండీ కేరళ ప్రభుత్వాలు సంక్షేమకార్యక్రమాలకు పెద్దపీట వేశాయి. ప్రధానంగా సామ్యవాద ప్రజాస్వామ్యం కేరళ రాజకీయాలలో ముఖ్యమైన సిద్ధాంతం. కాని ఇటీవల మిగిలిన రాష్ట్రాలవలెనే కేరళ కూడా ఆర్ధిక సంస్కరణలపట్ల, సరళీకృత వాణిజ్య విధానాలపట్ల, విదేశీ పెట్టుబడులపట్ల మొగ్గు చూపుతోంది.

2004-2005లో కేరళ స్థూల ఉత్పత్తుల విలువ 89,451 కోట్ల రూపాయలు. [34] ఈ వృద్ధి రేటు 1980 దశకంలో 2.3%, 1990 దశకంలో 5.1%-5.99% ఉంటే 2003-2005 మధ్య 7.4%, 9.2% వృద్ధి నమోదయ్యింది. [35] [36] [35]


భారీ వ్యాపార సంస్థలు, బాంకులు తమవ్యాపారాలకు కేరళను పెద్దగా ఎన్నుకోవడంలేదు. [37] కాని విదేశాలలో పనిచేసే కేరళీయులు తమకుటుంబాలకు పంపే ధనంవల్ల ఈ లోటు భర్తీ అవుతున్నది. కేరళ స్థూల ఉత్పత్తిలో 20% వరకు విదేశాలలో ఉండేవారు పంపే ధనమే. [38]


కేరళ తలసరి స్థూల ఆదాయం 1,819 రూపాయలు. [39] ఇది మొత్తం భారతదేశం తలసరి స్థూల ఆదాయం కంటే బాగా ఎక్కువ, [35] కాని ప్రపంచపు సగటుకంటే ఇంకా తక్కువే. ఇక కేరళ జనాభివృద్ధి సూచిక (Human Development Index), జీవన ప్రమాణాలు భారతదేశంలో చాలా ప్రాంతాలకంటే బాగా మెరుగైనవి. [40]

ఇలా ఆర్ధిక ప్రగతి లేకుండానే, గణనీయమైన జీవన ప్రమాణాలు సాధించడం కేరళ వ్యవస్థకున్న ప్రత్యేకత అని నిపుణులు భావిస్తారు. (Kerala model,Kerala phenomenon). కేరళలో ఉన్న పటిష్టమైన సేవారంగం (service sector) వల్లనే ఇది సాధ్యమైందని నిపుణుల విశ్లేషణ. [41][42]

కేరళలో తేయాకు తోటలు
కేరళలో తేయాకు తోటలు

సేవారంగం (టూరిజము, ప్రజాపాలన, బ్యాంకింగ్, ఫైనాన్స్, రవాణా, సమాచారం వంటివి కలిపి) కేరళ స్థూల ఆదాయంలో 63.8% సమకూరుస్తున్నాయి. వ్యవసాయం, మత్స్యపరిశ్రమల పాలు 17.2% [36][43] కేరళలో దాదాపు సగంమంది ఆదాయానికి వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. [44] కేరళవాసుల ప్రధానాహారం వరి. దాదాపు 600 రకాల వరి [15] [45]) కేరళలోని 310,521 హెక్టారుల పంటభూముల్లో పండుతుంది. (1990లో వరి సేద్యం జరిగే భూమి 588,340 హెక్టారులు ఉండేది. క్రమంగా ఇది తగ్గుతున్నది.) [45]) సంవత్సరానికి 688,859 టన్నుల ధాన్యం పండుతుంది. [44] కొబ్బరి (899,198 హెక్టారులు), తేయాకు, కాఫీ (57,000 టన్నులు - భారతదేశపు ఉత్పత్తిలో 23%), [46] [47]) రబ్బరు, జీడిమామిడి, సుగంధద్రవ్యాలు (మిరియం, ఏలక, వనిల్లా, దాల్చీనీ,పోక వంటివి)కేరళలో ఇతర పంటలు. దాదాపు 10.50 లక్షల మత్స్యకారులు ఏటా 6,68,000 టన్నుల చేపలు పడతారు. (1999–2000 అంచనా); కేరళ 590 కి.మీ. తీరంలో 222 చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా ఉన్న పల్లెలున్నాయి. ఇంకా లోపలి భూభాగంలో 13 చేపలు పట్టే పల్లెలున్నాయి. పీచు పరిశ్రమ, చేనేత, హస్తకళలు వంటి వృత్తులలో 10 లక్షలమందికి జీవనాధారము. 1,80,000 చిన్న పరిశ్రమలలో 9,09,859మందికి జీవనోపాధి లభిస్తున్నది. కొద్దిగా ఖనిజాల త్రవ్వకం జరుగుతున్నది. (స్థూల ఉత్పత్తిలో 0.3%) [43] ఇలెమినైటు, సిలికా, క్వార్ట్జ్, రుటైల్, జిర్కోన్, కావొలిన్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు లభిస్తున్నాయి. [44] పెరటితోటలు, పశుపాలన కూడా లక్షలాదిమందికి ఉపాధి కలుగజేస్తున్నాయి.


ఇంకా టూరిజము, పారిశ్రామిక ఉత్పత్తులు, business process outsourcing కేరళలో ఇతర సేవారంగ ఉపాధి వనరులు. కేరళ నిరుద్యోగుల శాతం 19.2% అని ఒక అంచనా. [48] 20.77% అని మరొక అంచనా [49] [50] [51] [49] రాష్ట్రంలో దారిద్ర్యరేఖ దిగువన ఉన్నవారు 12.71% అని కొన్ని అధ్యయనాలు చెప్పగా [52] 36% వరకు ఉన్నదని మరికొన్ని అంచనాలు ఉన్నాయి. [53]

[మార్చు] రవాణా సదుపాయాలు

కేరళలో 145,704 కి.మీ. రోడ్లున్నాయి (మొత్తం దేశంలో 4.2%) అంటే ప్రతి వెయ్యి జనాభాకు 4.62 కి.మీ. అన్న మాట. (భారతదేశం సగటు 2.59 km). దాదాపు అన్ని పల్లెలూ రోడ్లతో కలుపబడి ఉన్నాయి. కేరళ జనసాంద్రత ఎక్కువ కావడం వలన భారతదేశం సగటు రోడ్ల వ్వస్థకంటే కేరళ సగటు బాగా ఎక్కువ. మొత్తం దేశం హైవేలలో 2.6% (1,524 కి.మీ.) కేరళలో ఉన్నాయి. 8 జాతీయ రహదారులు (నేషనల్ హైవేలు) కేరళలో ఉన్నాయి. ట్రాఫిక్ కూడా వేగంగా పెరుగుతున్నది. NH 47, NH 17ల ద్వారా కేరళ పశ్చిమతీరం దాదాపు అంతా కలుపబడింది.

[మార్చు] జన విస్తరణ

కేరళ జనాభా (1951-2026)

కేరళ జనాభా, వృద్ధిరేటు 1951–2026.

కేరళ జనాభా, వృద్ధి రేటు 1951 నుండి –2001 (అంచనా), 2006–2026 (ముందస్తు అంచనా).
Sources: Tharakan & Navaneetham 1999, p. 36, Government of Kerala 2005b.
కేరళలోని మతాలు
హిందూమతస్తులు
  
56.2%
ముస్లింలు
  
24.70%
క్రైస్తవులు
  
19.00%
ఇతరులు
  
0.02%
మతపరంగా కేరళ జనాభా


కేరళలోని 3.18 కోట్ల జనాభా[54] ప్రధానంగా మళయాళీ, ద్రావిడ జాతి చెందినవారు. జాతిపరంగా ఇండో-ఆర్యన్,యూదు,అరబ్బు జాతులకు గాని, సంస్కృతికిగాని చెందినవారు. ఇంకా జనాభాలో 3,21,00 మంది(1.1%)) ఆదివాసి తెగలకు చెందినవారు. [55][56]. మళయాళం కేరళ అధికార భాష. ; తమిళం, కొన్ని ఆదివాసి భాషలు కూడా ఆయా వర్గాలకు చెందినవారు మాట్లాడుతారు. దేశంలో 3.44% జనాభా కేరళలోనే ఉన్నది. చ.కి.మీ.కు 819 జనులున్నందున [57] కేరళ జనసాంద్రత భారతదేశపు జనసాంద్రతకంటే మూడురెట్లు ఎక్కువ. కాని కేరళ జనాభా వృద్ధిరెటు దేశంలోనే అతితక్కువ. [58] దశాబ్దంలో కేరళ జనాభా వృద్ది 9.42 % (దేశం మొత్తంమీద వృద్ధిరేటు 21.34%). [59]

కేరళలో జనాభా ఎక్కువగా తీరప్రాంతంలో ఉన్నారు. [16] మొత్తం జనాభాలో ఆడువారు 51.42% [1]


మతపరంగా హిందువులు56.1%, ముస్లిములు 24.7%, క్రైస్తవులు 19% ఉన్నారు. [60] ఒకప్పుడు గణనీయంగా ఉన్న కొచ్చిన్ యూదులు ఇప్పుడు కొద్ది సంఖ్యలో ఉన్నారు. చాలామంది ఇస్రాయెల్‌కు వలస వెళ్ళారు(aliyah). చాలా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మతపరమైన ఘర్షణలు దాదాపు లేవు. కాని ఇటీవల మతపరంగా తీవ్రభావాలున్న సమాజాల కార్యకలాపాలు విస్తృతమౌతున్నాయి. [61][62] కేరళలో నేరాలు, మానభంగాలు, హింసాత్మక చర్యలు మిగిలిన దేశంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. [63] — ఈ విషయంలో దేశంలో కేరళది మూడవ స్థానం. [1]


పితృస్వామ్య కుటుంబ విధానం తక్కిన మూడవ ప్రపంచంకంటే కేరళలో తక్కువ బలంగా ఉన్నది. [64][65] చాలామంది కేరళీయులు (కొందరు హిందువులు, మలబారు ముస్లిములు) మాతృస్వామ్య కుటుంబ విధానం (మరుమక్కతాయం) అనుసరిస్తారు. క్రైస్తవులు, తక్కిన ముస్లిములు, కొదరు హిందువులు ఒకవిధమైన పితృస్వామ్యవిధానాన్ని (మక్కతాయం)అనుసరిస్తారు. [66] కేరళలో స్త్రీ-పురుష సమానత్వం మిగిలిన దేశంకంటే ముందంజలో ఉన్నది. [67] [68] H కాని ఇది కూడా క్రమంగా దెబ్బతింటున్నది. [69] ఆడువారిపై గృహహింస, అత్యాచారాలు పెరుగుతున్నాయి. [70]) ప్రపంచీకరణ, ఆధునికీకణ, సంస్కృతీకరణ (వెనుకబడిన పేదలు ధనికవర్గాల ఆచార వ్యవహారాలను అనుకరించడం) ఇందుకు ముఖ్యకారణాలు. [65]

సెట్‌చీర ధరించిన కేరళ యువతి.
సెట్‌చీర ధరించిన కేరళ యువతి.


కేరళ జనాభివృద్ధి సూచికలు— పేదరిక నిర్మూలన, ప్రాధమిక విద్యావకాశాలు, ఆరోగ్య సదుపాయాలు— భారతదేశంలో చాలా ఉత్తమస్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకు కేరళలో అక్షరాస్యత 91% [71], జీవన కాలప్రమాణం 73 సంవత్సరాలు [71]. ఇవి భారతదేశంలో మిగిలిన ప్రాంతాలకంటే చాలా మెరుగైనవి. కేరళలో గ్రామీణ పేదరకం 1970–1971లో 69% ఉండగా 1993–1994 లో 19% కు తగ్గింది. అదే పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపితే 36% తగ్గింది. [72] 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు రాజులు ప్రారంభించిన సామాజిక సంక్షేమ కార్యక్రమాలే ఈ పరిణామాలకు మూలకారణం. [73] [74] స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రప్రభుత్వాలు ఈ ఒరవడిని కొనసాగించాయి. [75] [40] [42]



కేరళ ఆరోగ్య సదుపాయ వ్యవస్థ ఐక్యరాజ్యసమితి శిశు సంక్షేమ నిధి(UNICEF), ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వంటి సంస్థల నుండి "పిల్లలకు అనుకూలమైన రాష్ట్రము" అని మన్ననలు అందుకొన్నది.— ఉదాహరణకు 95% కంటే ఎక్కు జననాలు ఆసుపత్రులలో జరుగుతున్నాయి. [76]

ఆయుర్వేదము, [77] సిద్ధ వైద్యము, యునాని, ఇంకా కొన్ని (ప్రస్తుతం కనుమరుగవుతున్న) సాంప్రదాయిక, నాటు వైద్యవిధానాలు — కలారి, మర్మచికిత్స, విషవైద్యం వంటివి