మేఘాలయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మేఘాలయ
Map of India with the location of మేఘాలయ highlighted.
Map of India with the location of మేఘాలయ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
షిల్లాంగ్
 - 25°34′N 91°53′E / 25.57°N 91.88°E / 25.57; 91.88
పెద్ద నగరం షిల్లాంగ్
జనాభా (2001)
 - జనసాంద్రత
2,306,069 (23rd)
 - 103/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
22,429 చ.కి.మీ (22nd)
 - 7
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[మేఘాలయ |గవర్నరు
 - [[మేఘాలయ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1971-01-25
 - ఎం.ఎం. జేకబ్
 - ముకుల్ సంగ్మా
 - Unicameral (60)
అధికార బాష (లు) గారో, ఖాసీ, ఆంగ్లము
పొడిపదం (ISO) IN-ML
వెబ్‌సైటు: meghalaya.nic.in
దస్త్రం:Meghalayaseal.png

మేఘాలయ రాజముద్ర

మేఘాలయ (मेघालय) (Meghalaya) భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రము. ఇది 300 కి.మీ. పొడవు, 100 కి.మీ. వెడల్పు ఉన్న పర్వతమయ రాష్ట్రము. వైశాల్యం 22,429 చ.కి.మీ. మొత్తం జనాభా 21,75,000 (2000 సం. జనాభా లెక్కలు). మేఘాలయయకు ఉత్తరాన అస్సాం రాష్ట్రం హద్దుగా బ్రహ్మపుత్ర నది ఉంది. దక్షిణాన షిల్లాంగ్ ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ జనాభా 2,60,000.

1972 కు ముందు ఇది అస్సాం రాష్ట్రంలో ఒక భాగం. 1972 జనవరి 21న మేఘాలయ ప్రత్యేక రాష్ట్రంగా విభజింపబడింది.

వాతావరణం[మార్చు]

చిరపుంజి సైన్ బోర్డు

మేఘాలయ వాతావరణం మరీ వేడికాదు. మరీ చల్లన కాదు. కానీ వర్షాలు మాత్రం భారతదేశంలోనే అత్యధికం. కొన్ని ప్రాంతాలలో 1200 సెంటీమటర్ల వరకు వర్షపాతం నమోదవుతున్నది. షిల్లాంగ్ దక్షిణాన ఉన్న చెర్రపుంజీ పట్టణం ఒక నెలలో అత్యధిక వర్షపాతం నమోదులో ప్రపంచరికార్డు కలిగి ఉంది. ఆ దగ్గరలోని మాసిన్రామ్ ఊరు ఒక సంవత్సరంలో అత్యధిక వర్షపాతం నమోదైన ఊరిగా ప్రపంచ రికార్డు కలిగిఉన్నది.

షిల్లాంగ్ సమీపాన ఉన్న ఉమియం సరస్సు

మేఘాలయ రాష్ట్రంలో మూడోవంతు అటవీమయం. పశ్చిమాన 'గారో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి', 'జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి కాని ఇవి మరీ ఎత్తైనవి కావు. 'షిల్లాంగ్ శిఖరం' అన్నింటికంటే ఎత్తైనది (1,965 మీటర్లు). పర్వతాలలో చాలా గుహలలో విలక్షణమైన 'స్టేలక్టైటు', 'స్టేలగ్మైటు' సున్నపురాయి ఆకృతులున్నాయి.

ప్రజలు[మార్చు]

మేఘాలయలో 85% ప్రజలు కొండ, అటవీజాతులకు చెందినవారు. ఖాసీ, గారో తెగలవారు జనాభాలో ఎక్కువగా ఉన్నారు. ఇంక జైంతియా, హాజోంగ్ తెగలవారు 40,000 వరకు ఉన్నారు. రాష్ట్రంలో 15% జనులు కొండజాతులువారుకారు. వీరిలో 54,00 మంది బెంగాలీలు, 49,000 మంది షైక్లు. పొరుగు రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరామ్‌ల లాగా మేఘాలయలో కూడా క్రైస్తవులు ఎక్కువ. ఇంకా 16% వరకు జనులు పురాతన అటవీ సంప్రదాయాలు (Animism) ఆచరిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నది. కాని, 'ఉల్ఫా' (ULFA, NDFB) వంటి తీవ్రవాదుల ప్రభావం వల్ల దీనికి అనేక అవరోధాలున్నాయి. కొండలు, పర్వతాలతో నిండిన భూభాగమూ, బంగ్లాదేశ్ సరిహద్దూ తీవ్రవాదులకు మంచి ఆశ్రయమిచ్చే స్థావరాలు.

జిల్లాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జైంతియా కొండలలో ఒక బొగ్గగని బయట పనిచేస్తున్న కార్మికులు

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మేఘాలయ&oldid=3948127" నుండి వెలికితీశారు