తిరువల్లాయ్

వికీపీడియా నుండి
  ?తిరువల్లాయ్
కేరళ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 9°23′N 76°35′E / 9.385, 76.575
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) పతనంతిట్ట జిల్లా
జనాభా 56 (2001)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 689101
• +91-469

తిరువల్లాయ్ (ఆంగ్లం: Thiruvalla or Tiruvalla) (మళయాళం: തിരുവല്ല), కేరళ రాష్ట్రంలో పతనంతిట్ట జిల్లాలోని తాలూకా కేంద్రం మరియు పట్టణం. ఇక్కడ నెడుంపురం పాలస్ మరియు పలియక్కర పాలస్ ఉన్నవి. ఇక్కడి రైల్వే స్టేషన్ [[]] మరియు తిరువనంతపురం మధ్యలో ఉన్నది.

ఈ ఊరికి తిరువల్లాయ్ అనే పేరు ఇక్కడ ప్రవహించే మణిమాల నది ముఖద్వారం పేరు మీద వచ్చింది (Valla vai(vai అంటే ప్రాచీన మళయాళంలో నదీ ముఖద్వారం). తిరువల్లాయ్ కి పశ్చిమంగా పంపా, మణిమాల అచెన్ కోవిల్ నదుల సంగమం అత్యంత సుందరంగా కనిపిస్తుంది.

శ్రీ వల్లభ క్షేత్రం [మార్చు]

ఇక్కడి శ్రీ వల్లభ క్షేత్రం వైష్ణవ దివ్యదేశాలు భారతదేశంలో ప్రాచీనమైనది. ఈ క్షేత్రమునకు 'తెన్ నగర్' అను తిరునామము కలదు. దీనిని ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు ప్రతిష్టించెనని చెప్పుదురు. దీనిని నమ్మాళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్లు కీర్తించిరి.[1] శాసనాల ద్వారా లభించిన ఆధారాల ప్రకారం తిరువల్లాయ్ లో ప్రాచీనమైన ఆధ్యాత్మిక మరియు వైదిక ప్రాముఖ్యత కలిగియుండి వేల కొలది విద్యార్ధులకు విద్యనందించేది.

మూలాలు [మార్చు]

  1. తిరువల్లవాళ్ (తిరువల్లాయ్ లేదా శ్రీవల్లభక్షేత్రం), దివ్యదేశ వైభవ ప్రకాశికా, శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి, ఉభయ వేదాంత సభ, పెంటపాడు, 1997, పేజీ.83.