వాస్కోడగామా

వికీపీడియా నుండి
వాస్కో డ గామా
Vasco da Gama.png
జననం జ. 1469
సైనెస్, అలెంతెహో, పోర్చుగల్
మరణం డిసెంబర్ 24 1524
కొచ్చిన్
వృత్తి Explorer, నావికాదళ సైన్యాధ్యక్షుడు
భార్య/భర్త కాటరీనా దె అటైదే

వాస్కో డగామా (Vasco da Gama) క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పోర్చుగీసు నావికుడు. ఇతడు పోర్చుగల్ దేశస్థుడు. 1498లో ఐరోపా నుండి భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. వాస్కో డగామా బృందము మొట్టమొదట కాలికట్ లో కాలుమోపింది.

[మార్చు] ఆరంభ జీవితం

వాస్కో డగామా జన్మస్థలమైన సైనెస్లో ఆయన విగ్రహము
దక్షిణాఫ్రికాలోని గుడ్‌హోప్‌ అగ్రము లో వాస్కో డగామా క్రాస్‌కు నిర్మించిన స్మారకం.

వాస్కో డగామా 1460లో[1] లేదా 1469లో[2], పోర్చుగీసు ఈశాన్య తీరంలో చిన్న గ్రామమైన సైనెస్‌లో బహుశా నొస్సా సెన్యోరా దస్ సాలాస్ చర్చి పక్కనున్న ఇంట్లో జన్మించాడు. అలెంతెహో తీరంలోని అతికొద్ది రేవుల్లో ఒకటైన సైనెస్‌, ప్రధానంగా బెస్తవారు నివాసముండే కొన్ని వెల్లవేసి, ఎర్రటి పెంకులతో కప్పబడిన పెంకుటిల్లుల సముదాయము.

వాస్కోడగామా తండ్రి ఎస్తేవో డ గామా 1460లలో డ్యూక్ ఆఫ్ విసూ, డామ్ ఫెర్నాండో యొక్క కుటంబములో నైట్‌గా ఉండేవాడు.[3] డామ్ ఫెర్నాండో, ఎస్తేవోను సైనెస్‌కు అల్కైదే-మోర్ (గవర్నరు)గా నియమించి, ఎస్త్రెమోజ్‌లో సబ్బుల తయారీపై పన్నులు వసూలు చేసుకునేట్టు కొంత ఆదాయం కల్పించాడు.

ఎస్తేవో డ గామా భార్య పేరు డానా ఇసబెల్ సొడ్రె. ఆవిడ హొయొ సొడ్రె కూతురు.

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు