ఐరోపా

వికీపీడియా నుండి
యూరప్ / ఐరోపా
ప్రపంచపటంలో యూరప్.
విస్తీర్ణం 10,180,000 కి.మీ.² (3,930,000 చ.మై.)
జనాభా 731,000,000
జనసాంద్రత 70/కి.మీ.² (181/చ.మై.)
ca. 50
ప్రాంతీయత యూరోపియన్
భాషా కుటుంబాలు ఇండో-యూరోపియన్
Finno-Ugric
Altaic
Basque
Semitic
North Caucasian
పెద్ద నగరాలు ఇస్తాంబుల్, మాస్కో, లండన్, పారిస్, మాడ్రిడ్, బార్సెలోనా, సెయింట్ పీటర్స్ బర్గ్, మిలాన్, బెర్లిన్, రోమ్, ఏథెన్స్, కీవ్, బుచారెస్ట్
టైం జోన్లు UTC (ఐస్‌ల్యాండ్) నుండి UTC+5 (రష్యా) వరకు


సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. యురేషియా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం మరియు నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నవి. తూర్పు దిశన ఐరోపా మరియు ఆసియా ఖండాలకు సరిహద్దులుగా ఉరల్ పర్వతాలు, ఉరల్ నది మరియు కాస్పియన్ సముద్రం ఉన్నవి.[1]విస్తీర్ణాన్ని బట్టి ఐరోపా, 10,180,000 చదరపు కిలోమీటర్లు (3,930,000 చ.మై) వైశాల్యముతో ప్రపంచములో రెండవ చిన్న ఖండము. ఇది 2% భూమి వైశాల్యము కలిగి ఉన్నది. ఐరోపా ఖండంలో దాదాపు 50 దాకా సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. కానీ వీటి ఖచ్చితమైన సంఖ్య ఐరోపా యొక్క సరిహద్దుల నిర్ణయాన్ని బట్టి, పూర్తిస్థాయి గుర్తింపులేని ప్రదేశాలను పరిగణనలోకి తీసుకోవటం, తీసుకోకపోవటం వంటి విషయాలపై ఆధారపడుతుంది. ఐరోపా దేశాలలో జనభా వారిగా మరియు వైశాల్యము వారీగా రష్యా అన్నింటికంటే పెద్దదేశం కాగా వాటికన్ అన్నింటికంటే చిన్నదేశం. 71 కోట్ల జనాభాతో ఆసియా, ఆఫ్రికాల తర్వాత ఐరోపా అత్యంత జనాభా కలిగిన ఖండము. ప్రపంచము యొక్క 11% ప్రజలు ఐరోపాలో నివసిస్తున్నారు. అయితే, ఖండము అంటే ఒక భౌగోళిక ఉనికితో పాటు, సాంస్కృతిక మరియు రాజకీయ ఉనికిని కూడా సూచిస్తుంది కాబట్టి ఐరోపా యొక్క సరిహద్దులు మరియు జనాభా గురించి ఏకాభిప్రాయము లేదు.


రాజకీయ భౌగోళికం [మార్చు]

అనేక సిద్ధాంతాలు మరియు విపులీకరణల తరువాత యూరప్ ఖండాన్ని భౌగోళిక మరియు రాజకీయ ప్రాంతాలుగా వర్గీకరించారు. వీటిలో 50 దేశాలు గలవు. యూరప్ సమాఖ్య లో 27 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. క్రింది పట్టిక ఐక్యరాజ్యసమితి ఉపయోగిస్తున్నది.[2]


ప్రాంతము లేదా ఉప-ప్రాంతము పేరు మరియు
పతాకము
విస్తీర్ణం
(కి.మీ²)
జనాభా
(జూలై 1 2002 నాటి అంచనా.)
జనసాంద్రత
(ప్రతి చ.కి.మీ.)
రాజధాని
Flag of ఆలండ్ ఆలాండ్ (ఫిన్లాండు) 1,552 26,008 16.8 మారీహామ్న్
Flag of అల్బేనియా అల్బేనియా 28,748 3,600,523 125.2 తిరానా
Flag of అండొర్రా అండోర్రా 468 68,403 146.2 అండోర్రా లా వెల్లా
Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 83,858 8,169,929 97.4 వియన్నా
Flag of ఆర్మేనియా ఆర్మీనియా 29,800 3,229,900 101 యెరావాన్
Flag of అజర్బైజాన్ అజర్‌బైజాన్ 86,600 8,621,000 97 బాకు
Flag of బెలారస్ బెలారుస్ 207,600 10,335,382 49.8 మిన్స్క్
Flag of బెల్జియం బెల్జియం 30,510 10,274,595 336.8 బస్సెల్స్
Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా మరియు హెర్జెగొవీనా 51,129 4,448,500 77.5 సరజేవో
Flag of బల్గేరియా బల్గేరియా 110,910 7,621,337 68.7 సోఫియా
Flag of క్రొయేషియా క్రోషియా 56,542 4,437,460 77.7 జగ్రెబ్
Flag of సైప్రస్ సైప్రస్ 9,251 788,457 85 నికోసియా
Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 78,866 10,256,760 130.1 ప్రేగ్
Flag of డెన్మార్క్ డెన్మార్కు 43,094 5,368,854 124.6 కోపెన్ హాగన్
Flag of ఎస్టోనియా ఎస్టోనియా 45,226 1,415,681 31.3 టల్లిన్
Flag of ఫారో దీవులు ఫరోయె (డెన్మార్క్) 1,399 46,011 32.9 తోర్షావన్
Flag of ఫిన్‌లాండ్ ఫిన్లాండు 336,593 5,157,537 15.3 హెల్సెంకి
Flag of ఫ్రాన్స్ ఫ్రాన్సు 547,030 59,765,983 109.3 పారిస్
Flag of జార్జియా జార్జియా 69,700 4,661,473 64 తిబ్లిసి
Flag of జర్మనీ జర్మనీ 357,021 83,251,851 233.2 బెర్లిన్
Flag of జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ (యునైటెడ్ కింగ్ డం) 5.9 27,714 4,697.3 జిబ్రాల్టర్
Flag of గ్రీస్ గ్రీసు 131,940 10,645,343 80.7 ఏథెన్సు
Flag of గ్వెర్నిసీ గెర్నెసీ 78 64,587 828.0 సెయింట్ పీటర్ పోర్ట్
Flag of హంగేరి హంగేరి 93,030 10,075,034 108.3 బుడాపెస్ట్
Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 103,000 307,261 2.7 రేక్‌జవిక్
Flag of ఐర్లాండ్ ఐర్లండ్ రిపబ్లిక్ 70,280 4,234,925 60.3 డబ్లిన్
Flag of ఐల్ ఆఫ్ మాన్ ఐసెల్ ఆఫ్ మ్యాన్ 572 73,873 129.1 డగ్లస్
Flag of ఇటలీ ఇటలీ 301,230 58,751,711 191.6 రోమ్
Flag of జెర్సీ జెర్సీ 116 89,775 773.9 సెయింట్ హెలియర్
Flag of కజకస్తాన్ కజకస్తాన్ 2,724,900 15,217,711 5.6 ఆస్తానా
Flag of కోసొవో కొసావో 10,887 2,126,708 220 ప్రిస్టీనా
Flag of లాత్వియా లాత్వియా 64,589 2,366,515 36.6 రిగా
Flag of లైకెస్టీన్ లీచెన్‌స్టైన్ 160 32,842 205.3 వడూజ్
Flag of లిథువేనియా లిథువేనియా 65,200 3,601,138 55.2 విల్నియస్
Flag of లక్సెంబోర్గ్ లక్సెంబర్గ్ 2,586 448,569 173.5 లక్సెంబర్గ్ (నగరం)
Flag of మేసిడోనియా మెసడోనియా రిపబ్లిక్ 25,333 2,054,800 81.1 స్కోప్జే
Flag of మాల్టా మాల్టా 316 397,499 1,257.9 వల్లెట్టా
Flag of మాల్డోవా మాల్డోవా 33,843 4,434,547 131.0 చిస్‌నావ్
Flag of మొనాకో మొనాకో 1.95 31,987 16,403.6 మొనాకో
Flag of మాంటినిగ్రో మాంటెనీగ్రో 13,812 616,258 44.6 పొడ్గోరికా
Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 41,526 16,318,199 393.0 ఆమ్‌స్టర్‌డామ్
Flag of నార్వే నార్వే 324,220 4,525,116 14.0 ఓస్లో
Flag of పోలాండ్ పోలెండు 312,685 38,625,478 123.5 వార్సా
Flag of పోర్చుగల్ పోర్చుగల్ 91,568 10,409,995 110.1 లిస్బన్
Flag of రొమేనియా రొమేనియా 238,391 21,698,181 91.0 బుచారెస్ట్
Flag of రష్యా రష్యా 17,075,400 142,200,000 26.8 మాస్కో
Flag of శాన్ మారినో సాన్ మెరీనో 61 27,730 454.6 సాన్ మెరీనో
Flag of సెర్బియా సెర్బియా (కొసావో తో కలుపుకుని) 88,361 9,663,742 109.4 బెల్‌గ్రేడ్
Flag of స్లొవాకియా స్లొవేకియా 48,845 5,422,366 111.0 బ్రాటిస్లావా
Flag of స్లొవేనియా స్లొవేనియా 20,273 1,932,917 95.3 జుబ్లజానా
Flag of స్పెయిన్ స్పెయిన్ 504,851 45,061,274 89.3 మాడ్రిడ్
Flag of నార్వే స్వాల్‌బార్డ్ మరియు జాన్
మయేన్ దీవులు
(నార్వే)
62,049 2,868 0.046 లాంగియర్‌బెన్
Flag of స్వీడన్ స్వీడెన్ 449,964 9,090,113 19.7 స్టాక్‌హోమ్
Flag of స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ 41,290 7,507,000 176.8 బెర్న్
Flag of టర్కీ టర్కీ 783,562 70,586,256 93 అంకారా
Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్ 603,700 48,396,470 80.2 కీవ్
Flag of United Kingdom యునైటెడ్ కింగ్ డం 244,820 61,100,835 244.2 లండన్
Flag of వాటికన్ నగరం వాటికన్ నగరం 0.44 900 2,045.5 వాటికన్ నగరం
మొత్తం 10,180,000 731,000,000 70


మూలాలు [మార్చు]

  1. Microsoft® Encarta® Online Encyclopedia 2007. ""Europe"". Retrieved 2007-12-27. 
  2. "United Nations Statistics Division — Countries of Europe". Retrieved 2008-06-10. 



"http://te.wikipedia.org/w/index.php?title=ఐరోపా&oldid=808686" నుండి వెలికితీశారు