పోలాండ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Rzeczpospolita Polska
రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్
Flag of పోలాండ్ పోలాండ్ యొక్క చిహ్నం
జాతీయగీతం
Mazurek Dąbrowskiego
(Dąbrowski's Mazurka, or "Poland Is Not Yet Lost")
పోలాండ్ యొక్క స్థానం
Location of  పోలాండ్  (orange)

– on the European continent  (camel & white)
– in the European Union  (camel)                  [Legend]

రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Warsaw
52°13′N, 21°02′E
అధికార భాషలు పోలిష్2
ప్రజానామము పోలిష్
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  President Lech Kaczyński
 -  Prime Minister Donald Tusk
Formation
 -  Christianisation4 14 April 966 
 -  Redeclared 11 November 1918 
Accession to
the
 European Union
1 May 2004
 -  జలాలు (%) 3.07
జనాభా
 -  Dec. 2007 జన గణన 38,116,000[1] <--then:-->(33rd)
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $620.868 billion[2] (20th)
 -  తలసరి $16,310[2] (IMF) (49th)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $420.284 billion[2] (21st)
 -  తలసరి $11,041[2] (IMF) (47th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) Increase 0.870 (high) (37th)
కరెన్సీ Złoty (PLN)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .pl5
కాలింగ్ కోడ్ +48
1 See, however, Unofficial mottos of Poland.
2 Although not official languages, Belarusian, Kashubian, Lithuanian and German are used in 20 communal offices.
3 The area of Poland according to the administrative division, as given by the Central Statistical Office, is 312,679 square kilometres (120,726 sq mi) of which 311,888 square kilometres (120,421 sq mi) is land area and 791 square kilometres (305 sq mi) is internal water surface area.[1]
4 The adoption of Christianity in Poland is seen by many Poles, regardless of their religious affiliation or lack thereof, as one of the most significant national historical events; the new religion was used to unify the tribes in the region.
5 Also .eu, as Poland is a member of the European Union.

పోలాండ్ (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్) మధ్య ఐరోపాలోని ఒక దేశం. పోలాండ్ కి పశ్చిమ దిశలో జర్మనీ, దక్షిణ దిశలో చెక్ రిపబ్లిక్ మరియు స్లొవేకియా, తూర్పున ఉక్రెయిన్, బెలారస్, లిథువేనియాలు, ఉత్తరాన బాల్టిక్ సముద్రం ఉన్నాయి. 312,679 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న పోలాండ్ ఐరోపాలో 9వ అతిపెద్ద దేశం మరియు ప్రపంచంలోనే 69వ అతిపెద్ద దేశం. జనాభా లెక్కల రీత్యా చూసినట్లయితే, 3.8 కోట్ల జనాభాతో పోలాండ్ ప్రపంచంలో 33వ అతిపెద్ద దేశంగా ఉంది.

966వ సంవత్సరంలో మొదటి మీజ్కో మహారాజు క్రైస్తవ మతాన్ని స్వీకరించడంతో పోలాండ్ రాజ్యావతరణకు అంకురార్పణ జరిగింది - ఆనాటి పోలాండ్ సరిహద్దులు దాదాపు ఈనాటి పోలాండ్ సరిహద్దులకు సమానంగా ఉన్నాయి. 1025వ సంవత్సరంలో రాజ్యంగా మారిన పోలాండ్, 1569లో లిథువేనియాతో కలిసి పాలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ నెలకొల్పింది. ఆ కామన్వెల్త్ 1795లో కూలిపోగా, రాజ్య భాగమంతా ప్రష్యా, రష్యా, ఆస్ట్రియాల పరమయ్యింది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యాన్ని సాధించిన పోలాండ్, రెండవ ప్రపంచ యుద్ధంలో ముందు నాజీ జర్మనీ, ఆ తర్వాత సోవియట్ యూనియన్ యొక్క వశమయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అరవై లక్షలకు పైగా పౌరులను కోల్పోయిన పోలాండ్ ఆ తర్వాత సోవియట్ యూనియన్ ప్రభావిత సోషలిస్ట్ రిపబ్లిక్ గా రూపాంతరం చెందింది. 1989లో కమ్యూనిస్ట్ పాలనను పడత్రోసిన పిమ్మట పోలాండ్ రాజ్యాంగబద్ధంగా "మూడవ పాలిష్ రిపబ్లిక్"గా రూపాంతరం చెందింది. పోలాండ్ ఐరోపా సమాఖ్య, నాటో మరియు ఓఈసీడీలలో సభ్యదేశంగా ఉంది.

నైసర్గిక స్వరూపము[మార్చు]

  • ఖండం - ఐరోపా
  • వైశాల్యం - 3,12,679 చ.కి.మీ.
  • జనాభా - 3,84,83,957 (2014 అంచనాల ప్రకారం),
  • రాజధాని- వార్సా, కరెన్సీ - పోలిష్ జోలోటీ,
  • ప్రభుత్వం - పార్లమెంటరీ రిపబ్లిక్
  • అధికారిక భాష- పోలిష్,
  • మతం - 97 శాతం క్రైస్తవులు,
  • సరిహద్దులు - బాల్టిక్ సముద్రం, రష్యా, తూర్పు జర్మనీ, చెకోస్లోవేకియా,
  • స్వాతంత్య్ర దినాలు - కమ్యూనిస్ట్ పోలెండ్ - 8 ఏప్రిల్ 1945, రిపబ్లిక్ ఆఫ్ పోలెండ్ - 13 సెప్టెంబర్ 1989,
  • పంటలు- తృణధాన్యాలు, చెరకు, నూనెగింజలు, బంగాళదుంపలు,
  • ఖనిజాలు- బొగ్గు, సల్ఫర్, రాగి, జింకు, సీసం, ఇనుము,
  • పరిశ్రమలు - యంత్రభాగాలు, బొగ్గు, రసాయనాలు, పెట్రోలియం శుద్ధి, ఆహార ఉత్పత్తులు,
  • వాతావరణం - జనవరిలో -5 నుండి 0 (సున్న) డిగ్రీలు, 15 నుండి 25 డిగ్రీలు జూలైలో

చారిత్రక నేపధ్యము[మార్చు]

Map of Poland (Polish: Polska) in 960–992 under Mieszko I

10వ శతాబ్దం నుండి తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న పోలెండ్ దేశం అనేక శతాబ్దాలపాటు వలసవాదుల అధిపత్యంలో మగ్గింది. దేశ సరిహద్దులు బలహీనంగా ఉండడం వల్ల ఇతర దేశాల వాళ్లు చాలా సులువుగా దేశంలోకి ప్రవేశించేవారు. 18వ శతాబ్దంలో ప్రపంచ పటం నుండి పోలెండ్ మాయమైపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పోలెండ్ తిరిగి తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. హిట్లర్ సేనలు పోలెండ్‌ను తన అధీనంలోకి తీసుకొని రెండో ప్రపంచ యుద్ధం దాకా అధిపత్యాన్ని కొనసాగించింది. ఈ రెండు యుద్ధాల సమయంలో వేలాదిమంది పౌరులు, అధికారులు ఊచకోతకు గురయ్యారు. అటు రష్యా, ఇటు జర్మనీ సేనల మధ్య పోలెండ్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పోలిష్ హోమ్ ఆర్మీ ప్రాణాలకు తెగించి దేశాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకుంది.


సంస్కృతి - సంప్రదాయాలు[మార్చు]

పోలెండ్ దేశానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ఎక్కువగా యూరోపియన్ సంస్కృతి కనబడుతుంది. ఇక్కడ మత సహనం అధికం. ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటిస్తారు. ఉంది. పోలెండ్ ప్రజలను పోల్స్ అంటారు. దాదాపు 98 శాతం ప్రజలు పోలిష్ భాషను మాట్లాడతారు. దేశంలో జర్మన్‌లు, ఉక్రేనియన్‌లు, బెలారూసియ+న్‌లు, జిప్సీలు, లిధువేనియన్‌లు, జ్యుయిష్‌లు కూడా ఉన్నారు. ఇలా దేశంలో విభిన్న దేశాలకు చెందిన వారు ఉండడం వల్ల దేశమంతటా విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు కనబడతాయి.

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

మాసూరియన్ సరస్సులు[మార్చు]

పోలెండ్ దేశంలో దాదాపు 3000 సరస్సులు ఉన్నాయి. ముఖ్యంగా మాసూరియా సరస్సు యాత్రికులకు స్వర్గం లాంటిది. దట్టమైన అడవులు, సరస్సులను కలిసే చిన్న చిన్న నదులతో ప్రయాణికులకు ఎంతో అందంగా కనబడుతుంది. ఈ సరస్సు పోలెండ్ దేశానికి ఉత్తరంలో, లిథువేనియా, రష్యా దేశాల సరిహద్దులలో ఉంది. ఇక్కడ అందమైన గుహలు, అందమైన చర్చిలు, గతరాజుల నివాస భవనాలు ఎన్నో కనబడతాయి. ఈ ప్రదేశమే ఒకప్పుడు హిట్లర్ యుద్ధకేంద్రంగా వెలుగొందింది.

స్లోవిన్‌స్కీ ఇసుక తిన్నెలు[మార్చు]

దేశానికి ఉత్తర భాగంలో స్లోవెన్‌స్కీ జాతీయ పార్కులో ఈ ఇసుక తిన్నెలు దర్శనమిస్తాయి. ఎవరో తీర్చిదిద్దినట్లుగా కనబడే ఈ ఇసుక తిన్నెలు చూపరులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పక్కనే బాల్టిక్ సముద్రం ప్రశాంతంగా కనబడుతుంది. ఈ ఇసుక తిన్నెలు గాలి వీచడం ద్వారా ఏర్పడతాయి. ఇవి ఒక్కొక్కసారి 30 మీటర్లు ఎత్తు వరకు ఏర్పడతాయి.

క్రాకోవ్ నగరం[మార్చు]

పోలెండ్ దేశంలో ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి. ఇది విస్తులా నదీతీరంలో నిర్మింపబడింది. లెస్సర్ పోలెండ్ ప్రాంతంలో ఉంది. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఇది మొదటగా నిర్మింపబడిందని చరిత్ర చెబుతోంది. 9వ శతాబ్దంలో స్లావోనిక్ యూరప్ దేశాలతో గొప్ప వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడ ఎనిమిది మిలియన్లకు పైగా జనాభా ఉంది.

1978లో ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నగరంలో వావెల్ కెథడ్రాల్, రాయల్ కేజిల్, ఎప్పుడూ నిండుగా పారుతూ ఉండే విస్తులా నది, సెయింట్ మేరీస్ బాసిలికా, జగిలోనియన్ విశ్వవిద్యాలయం, క్లాత్‌హల్, ప్యాలస్ ఆర్ట్, కనోనిక్జా వీధి, పావిలాన్ విస్పియన్‌స్కీ... ఇంకా మరెన్నో చూడదగ్గ స్థలాలు ఉన్నాయి.

వార్సా[మార్చు]

ఇది పోలెండ్ దేశానికి రాజధాని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ నగరం అభివృద్ధిలో ఊపందుకుంది. ఐరోపా దేశాలలో గొప్ప టూరిస్ట్ నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా లక్షలాది మంది ఈ నగర సందర్శనకు వస్తూ ఉంటారు. నగరం మధ్య నుండి విస్తులా నది పారుతూ ఉంటుంది. 13వ శతాబ్దంలో ఈ నగరం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. నగరంలో చాలావరకు భవనాలు నాలుగైదు అంతస్తుల్లో రంగుల్లో కనబడతాయి. నగరంలోని పురాతన మార్కెట్ స్థలం అత్యంత పురాతనమైంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభ్యమవుతాయి. నగరంలో ఐరోపా సంస్కృతి బాగా కనబడుతుంది. నగరంలో ఓల్డ్‌టౌన్, రాయల్‌రూట్, చోపిన్ మ్యూజియం, జ్యుయిస్ ఘెట్టో మొదలైన ఎన్నోప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

వ్రోక్లా ద్వీపకల్పాల నగరం[మార్చు]

వ్రోక్లా నగరం దిగువ సిలేసియా ప్రాంతానికి రాజధాని. ఈ నగరం చిన్న చిన్న ద్వీపాల సముదాయం. ఒక్కొక్క ద్వీపాన్ని కలపడానికి ఒక వంతెన చొప్పున నగరం మొత్తంలో 100కు పైగా వంతెనలు కనబడతాయి. ఇది దేశానికి దక్షిణ-పశ్చిమ భాగంలో ఉంది. ఇదొక పురాతన నగరం. ఇక్కడే ఓద్రా నది ప్రవహిస్తుంది. దీని ఉపనదులే ఈ నగరాన్ని చిన్న చిన్న ద్వీపాలుగా మార్చేశాయి. ఈ నగరంలో మొత్తం 25 మ్యూజియంలు ఉన్నాయి. సెయింట్ జాన్ కెథడ్రాల్, నగరాన్ని ఆనుకొని సుడెటెన్ పర్వతాలు పరుచుకొని ఉండి చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి.

పరిపాలన[మార్చు]

పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 16 ప్రాంతాలుగా విభజించారు. ప్రాంతాన్ని పోలెండ్ భాషలో ‘వైవోడేషిప్’ అంటారు. ఈ 16 ప్రాంతాలను తిరిగి 379 పోవియట్‌లుగా, వీటిని మళ్ళీ 2478 జిమినాస్‌లుగా విభజించారు. 16 ప్రాంతాలు

m:en:Voivodeship రాజధాని నగరాలు లేదా నగరము
ఆంగ్లంలో పోలిష్ భాషలో
గ్రేటర్ పోలెండ్ Wielkopolskie పోజ్‌నన్
కువాయియణ్-పొమెరేనియన్ Kujawsko-Pomorskie బిడ్‌గోసెజ్ / టోరున్
లెస్సర్ పోలెండ్ Małopolskie క్రాకో
లోడ్జ్ Łódzkie లోడ్జ్
లోయర్ సిలేసియన్ Dolnośląskie వరోక్లా
లుబ్లిన్ Lubelskie లుబ్లిన్
లుబుజ్ Lubuskie గొర్జొవ్ విల్కొ పోల్స్కీ / జిలొన గొర
మాసోవియన్ Mazowieckie వార్సా
ఒపోలే Opolskie ఒపోలె
పోడ్‌లాస్కీ Podlaskie బైలిస్టాక్
పోమరేనియన్ Pomorskie జిడాన్సక్
సిలేసియన్ Śląskie కటోవైస్
సబ్‌కార్ఫాథియన్ Podkarpackie రెజెస్జొవ్
స్వీటోక్రిజస్కీ
(Holy Cross)
Świętokrzyskie కీలెస్
వార్మియన్-మాసూరియన్ Warmińsko-Mazurskie ఒలిస్టిన్
వెస్ట్‌పోమరేనియన్ Zachodniopomorskie సెజెసిన్

దేశంలో మొత్తం 20 పెద్ద నగరాలు, పట్టణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి..

చిత్రమాల[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పోలాండ్&oldid=1329616" నుండి వెలికితీశారు