క్రైస్తవ మతము
|
భాగం వ్యాసముల క్రమం క్రైస్తవ మతము
|
|---|
| యేసు |
| శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్ |
| మూలాలు |
| చర్చి · కొత్త కాన్వెంట్ అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక |
| బైబిల్ |
| పాత నిబంధన · కొత్త నిబంధన గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా |
| క్రైస్తవ ధర్మం |
| త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ) చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్ |
| చరిత్ర మరియు సాంప్రదాయాలు |
| ప్రథమ · సంఘాలు · వర్గలు · మిషనరీలు తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు |
| తెగలు |
| క్రైస్తవ మత విషయాలు |
| బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు సంగీతం · లిటర్జీ · కేలండరు చిహ్నాలు · కళలు · విమర్శ |
|
|
క్రైస్తవ మతము (Christianity) ప్రపంచంలోని అతి పెద్ద మతం. ఏసుక్రీస్తును ఏకకాలంలో దేవుని కుమారుడు గానూ, దేవుడు గానూ నమ్ముతూ ఏక దైవారాధన ను ప్రబోధించే మతం. నజరేయుడైన యేసు జీవితం అంటే ఆయన జననం, ప్రబోధం, శ్రమ, మరణం, పునరుత్థానాలగురించి పౌలు నిర్మించిన సిద్ద్ధాంతాలే క్రైస్తవ మత పునాదులు. బైబిలు లోని క్రొత్త నిబంధన లో యేసు జీవితం, బోధలతో పాటు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన అనేక విషయాలు వివరించబడ్డాయి. యేసు దేవుని కుమారుడని, పాత నిబంధన లో ప్రవచింప బడిన మెస్సయ్యా అని క్రైస్తవులు నమ్ముతారు. 2001 వ సంవత్సరపు అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవాన్ని అనుసరించే వాళ్ళు 210 కోట్ల మంది ఉన్నారు.
యేసు పునరుత్థానం చెందిన ఏభై రోజుల తర్వాత వచ్చిన పెంతెకోస్తు అనే పండుగ దినాన క్రైస్తవం ఒక సమాజంగా ఏర్పడిందని అపోస్తలుల కార్యాల గ్రంథం పేర్కొంటుంది. తొలుత యూదా మతం లో ఒక శాఖగా మొదలైన ఇది అనతికాలంలోనే ఒక ప్రత్యేక మతంగా ఆవిర్భవించింది. యూదుల మత గ్రంథమైన హెబ్రీ బైబిలు ను విశ్వసిస్తూ దాన్ని పాత నిబంధన గా క్రైస్తవులు పేర్కొంటారు. యూదా మరియు ఇస్లాం మతము లతో పాటు క్రైస్తవం కూడా అబ్రహాము సంబంధిత మతం గా పేర్కొన బడుతుంది. అంతియొకయలోని శిష్యులు మొట్ట మొదటి సారిగా క్రైస్తవులని పిలువ బడ్డారు.
క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు సిద్ధాంత పరంగా, ఆచారాల పరంగా వేరు వేరు 3652 సమూహాలుగా తమలో తాము విడిపోయారు. డినామినేషనులు అని పిలువబడే ఈ క్రైస్తవ మత శాఖలను వారనుసరిస్తున్న సంప్రదాయాల ననుసరించి రోమన్ కాథలిక్కులు 2. సనాతన తూర్పు సంఘం 3. ప్రొటెస్టెంట్ లు అనే మూడు ప్రధాన వర్గాలుగా విభజించ వచ్చు.
విషయ సూచిక |
రోమన్ కాథలిక్కులు [మార్చు]
సనాతన తూర్పు సంఘం [మార్చు]
ప్రొటెస్టెంట్ లు [మార్చు]
ఇవీ చూడండి [మార్చు]
యూదులు, క్రైస్తవులు [మార్చు]
క్రీస్తుయేసుకు 12 మంది శిష్యులు.యెసు"నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను" (లూకా 19:10) అని ఏసుచెప్పారు. యూదులు ఆయన్ని చంపారు. కానీ క్రైస్తవ మతం విశ్వమానవాళికి ఆయన్ని ప్రభువుగా చేసి ఆరాధిస్తోంది. ఈ మతంలో ఎవరయినా చేరవచ్చు. ఆయన మార్గము ప్రేమమార్గము. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ. క్రీస్తు శిష్యుడు తోమా 1 వ శతాబ్దం లో భారత దేశానికి క్రీస్తు సందేశాలను తెచ్చాడు. ఇది ప్రేమమార్గం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనేది మూల సూత్రం.
మతాల గురించి బైబిలు వాక్యాలు [మార్చు]
- ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. (మత్తయి 23: 15)
- మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది (యోహాను 16: 2)
|
|||||||||||||||||