యేసు

వికీపీడియా నుండి

యేసుక్రీస్తు

భాగం వ్యాసముల క్రమం

Christian cross.svg

 
యేసు
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్
మూలాలు
చర్చి · కొత్త కాన్వెంట్
అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
బైబిల్
పాత నిబంధన · కొత్త నిబంధన
గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
క్రైస్తవ ధర్మం
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
చరిత్ర మరియు సాంప్రదాయాలు
ప్రథమ · సంఘాలు · వర్గలు · మిషనరీలు
తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
తెగలు
క్రైస్తవ మత విషయాలు
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
సంగీతం · లిటర్జీ · కేలండరు
చిహ్నాలు · కళలు · విమర్శ
30px క్రైస్తవ పోర్టల్

యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) [1] నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన క్రైస్తవ మత మూలపురుషుడు. అంతకాక, యేసు వివిధ ఇతర మతములలో కూడ ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడినాడు. ఈయన సాధారణంగా యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. ఇందులో క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు") అనే అర్ధం వచ్చే పదం నుండి పుట్టిన ముకుటం. ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానార్ధము కలపదము.


కొత్త నిబంధన గ్రంథం యొక్క నాలుగు ప్రకటించబడిన సువార్తలైన మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలను యేసు జీవితము మరియు బోధనలకు సంబంధించిన సమాచారమునకు ముఖ్య ఆధారాలుగా పరిగణిస్తారు. చాలా మంది బైబిలు పరిశోధకులు మరియు చరిత్రకారులు యేసు, గలిలయకు చెందిన ఒక యూదు మత బోధకుడని, ఈయన విశ్వాసముతో సేద తీర్చెనని, బాప్తిస్మమిచ్చు యోహానుచే బాప్తిస్మము పొందెనని, రోమన్ సామ్రాజ్యాన్ని మాయచేస్తున్నాడనే ఆరోపణతో రోమన్ ప్రాంతాధీశుడు పొంతి పిలాతు ఆజ్ఞానుసారము శిలువ వేయబడినాడని అంగీకరిస్తారు.[2] అయితే కొంతమంది అల్పసంఖ్యలోని పండితులు యేసు యొక్క చారిత్రకతను ప్రశ్నిస్తున్నారు.[3]

యేసుక్రీస్తుపై విభిన్న సంక్లిష్ట క్రైస్తవ ధృక్కోణాలు ఉన్నాయి అయితే అవన్నీ పాతనిబంధన గ్రంథం లేదా యూదు తనఖ్ లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చెననే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారిడిగా భావిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే క్రైస్తవులు యేసుని దేవుని యొక్క అవతారంగా భావిస్తారు. అయితే కందరు మటుకు యేసు దైవత్వము సంబంధంచినంత వరకు ఇతర గూఢార్థాలను అనుసరిస్తారు. ఈ విషయాలను గూర్చిన విద్యను క్రిస్తోలొజి అని పిలుస్తారు. యేసుకు సంబంధించిన ఇతర నమ్మకాలు - తన కన్యత్వ పుట్టుక, అతని పరలొక ప్రయాణం మరియు రాబోవు రెండొవ రాకడ. మిక్కిలి క్రైస్తవులు యేసు అద్భుతాలు చేసి నిబంధన గ్రంథం లోని ప్రవచనాలను నెరవెర్చారని నమ్ముతారు.

యేసు జీవిత కాలం: యేసు జీవిత చరిత్రను గూర్చి మత్తయి సువార్త మరియు లూకా సువార్త అను పరిశుద్ద గ్రంధము నందలి పుస్తకములలో వివరించబడినది.మత్తయి సువార్త యందుగాని, లూకా సువార్త యందుగాని, యేసు క్రీస్తు పుట్టిన తేదీని తెలిపి యుండలేదు.పశ్చిమ దేశములలోని క్రైస్తవులు అంతా క్రీస్తు జన్మదిన పండుగ ఐన క్రిస్టమస్ ను డిసెంబరు 25 వ తేదీన ఆనయాయతీగా జరుపుకొను చున్నారు.రోమా క్రైస్తవులు సుమారు క్రీ.శ.330 నుండి ఆ విడధంగా జరుపనారంభించిరి.

విషయ సూచిక

[మార్చు] యేసు జీవితం-భోదనలు, సువార్తలలో వివరించినట్లుగ

ప్రధాన వ్యాసం: నూతన నిభందన ప్రకారం యేసు జీవితం

మూస:యేసు సువార్త

యేసు జీవితం గురించి మనంతట మనంగా ఒక అవగాహనకు రాలేం.చారిత్రక ఆధారాల మూలంగా కూడా తెలుసు కోవడం కుదిరే పని కాదు. నాలుగుసువార్తల ద్వారా మనం యేసు జీవితాన్ని గురించి తెలుసుకొనగలం.

[మార్చు] యేసు వంశము-కుటుంబము

ప్రధాన వ్యాసం: యేసు వంశము

[[ఫైలు:Czestochowska.jpg|thumb|left|165px|జీసస్ మరియు మేరీ : జెస్టోచోవా కు చెందిన నల్ల మడొన్నా నాలుగు సువార్తలలో, మత్తయి మరియు మార్కు సువార్తలలో మాత్రమే యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది.మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన యోసేపు యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలను మరియొక విధంగా యేసు తల్లియైన మరియ.[4] యొక్క పితరుల వివరాలన్ని వ్రాసాడు. ఏ విధంగా చూసినా, యేసు యొక్క వంశ మూలపురుషులుగా రాజైన దావీదు మరియు అబ్రహాములను గమనించగలం.అబ్రహాము దావీదుల మధ్య ఉన్న మూల పురుషుల జాబితాలో యే విధమైన మార్పు ఉండదు గాని,దావీదు నుండి యోసేపు వరకు వ్రాయబడిన మూల పురుషుల జాబితాలో తేడా కనిపిస్తుంది.మత్తయి సొలోమోను తో ప్రారంభించి యూదా గోత్రములోని చివరి రాజైన యెకోన్యావరకు ప్రస్తావిస్తాడు. యెకొన్యా తరువాత రాజుల వంశ పరంపర బాబిలోన్ యూదాను జయించుటతో ఆగిపోతుంది. దీని ద్వారా మత్తయి యేసును ఇశ్రాయేలు సింహాసన వారసునిగ నిరూపిస్తాడు. లూకా వ్రాసిన వంశవృక్షము అబ్రహాము కంటే ముందుకు సాగి ఆదాము-హవ్వ లవరకు సాగి, దావీదు యేసు క్రీస్తులకు మధ్య అనేక పేర్లు చేర్చబడ్డాయి. యోసేపు పేరు యేసు బాల్య బదినముల ప్రస్తావనలో మత్రమే వినిపిస్తుంది. యేసు తల్లియైన మరియను ప్రేమించిన శిష్యుడు యోహాను కు అప్పగించడాన్ని బట్టి యేసు తన సేవను ప్రారంభించుటకు మునుపే యోసేపు చనిపోయి ఉంటాడని అర్థం చేసుకోవాలి. (యోహాను|19:25-27|యోహాను19:25–27), [5] నూతన నిభందన గ్రంధాలైన మత్తయి సువార్త, మార్కు సువార్త మరియు గలతీయులకు వ్రాసిన పత్రికల ద్వారా యేసుకు బందువులు, సోదరులు మరియూ సోదరీమణులు ఉన్నారని గ్రహించగలం.[6] గ్రీకు భష లోని adelphos అనే పదం, సోదరుడుగా అనువదించ బడింది. ఈ పదం దగ్గరి బందుత్వాన్ని తెలియ చేస్తుంది. కతోలికులు మరియు తూర్పు ఛాందస క్రైస్తవులు ఈ పదాన్ని రక్త సంబందికునిగా లేదా దగ్గరి బందువుగా అన్వయించారు.(see మరియ కన్యత్వం).

[మార్చు] పుట్టుక మరియు ప్రారంభ జీవితం

ప్రధాన వ్యాసాలు: ప్రకటనయేసు పుట్టుక & బాల యేసు

[[ఫైలు:Gerard van Honthorst 002.jpg|thumb|left|Adoration of the Shepherds, Gerard van Honthorst , 17th c.]] మత్తయి మరియు లూకా సువార్తల ప్రకారం యేసు బెత్లహెం అను యూదా ప్రాంత పల్లెలోమరియ, అను కన్యకకు, పరిషుద్దాత్ముని అద్భుత కార్యం గా జన్మించాడు.లూకా సువార్త లో గబ్రియేలుఅని పిలువ బడిన దేవదూత మరియను దర్శించి దేవుడు మరియను తన కుమారునిగర్భమునందు మోయుటకు ఎన్నుకొన్నాడని తెలిపిన ఉదంతాన్ని వివరంగా చూడగలం. (లూకా 1:26–38). లూకా సువార్త ప్రకారం కైసర్ ఔగుస్తుస్ ఆజ్ఞ వలన యోసేపు మరియలు తాము కాపురమున్న నజరేతును విడిచి యోసేపు పితరుడైన దావీదు యొక్క గ్రామమైన బెత్లెహేము కు తమ పేర్లను జన సంఖ్యలో వ్రాయించుకొనుటకు వెళ్ళారు.యేసు జన్మించినపుడు సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టె లో యేసును పరుండ బెట్టారు. (లూకా 2:1–7). లూకా సువార్త ప్రకారం, ఒక దేవ దూత యేసు జన్మించిన వార్తను గొల్లలకు తెలిపింది. అది విన్న ఆ గొల్లలు యేసును చూచి ఆ వార్తను ఆ ప్రదేశమంతట ప్రచురించారు.మత్తయి కూడా తన సువార్త యందు "జ్ఞానులు" ఆకాశములో ఉదయించిన వింత నక్షత్రము ద్వారా నడిపించబడి వచ్చి యేసును దర్శించి తమ విలువైన బహుమతులను యేసుకు సమర్పించుట ద్వారా మెస్సియా, లేదా యూదుల రాజు, పుట్టాడని గ్రహించారని వ్రాసాడు.(మత్తయి 2:1-12) యేసు పుట్టిన పిదప వారు దూతచే భోదించబడిన వారై హేరోదు యొక్క ఉగ్రత నుండి తప్పించుకొనుటకై ఈజిప్టు కు పారిపోయారు. యేసు బాల్యంనందు గలలియ లోని నజరేతుఅను ఊరిలో పెంచబడ్డాడు. లూకా సువార్త ప్రకారం, యోసేపు మరియలు యేసు జననానికి ముందు నజరేతు నందు జీవించారు. ఆ తరువాత తిరిగి నజరేతుకు వచ్చి అక్కడ నివసించారు. మత్తయి సువార్త ప్రకారం వారి కుటుంబం హేరోదు మరణ పర్యంతం ఈజిప్టు నందు నివసించారని వ్రాయబడి ఉంది. (మత్తయి|2:19-23|మత్తయి 2:19-23). ఈజిప్టుకు పారిపోవుట గాక తూరు మరియు సీదోనులకు వెళ్ళుట మినహా, యేసు జీవితంలోని అన్ని సంఘటనలు పూర్వ ఇశ్రాయేలు దేశము మరియు యూదా ప్రాంతములయందే జరిగినవి. [7] లూకా సువార్త ప్రకారము (బైబిలు వచనం||లూకా|3:23) యేసు ముప్పది యేండ్ల ప్రాయము వాడైనప్పుడు బాప్తీస్మము పొందెను. యేసు బాప్తీస్మము పొందుటకు ముందు ఆయన బాల్యానికి మధ్య ఒక సారి దేవాలయములో కనబడుట తప్ప మరి యెప్పుడు ఆయన గురించి ఏ సువార్తలోను ప్రస్తావించ బడలేదు. (లూకా|2:41-52|లూకా 2:41–52). మార్కు సువార్త యందు యేసు వడ్రంగివానిగా పిలువ బడెను. (బైబిలు వచనం||మార్కు|6:3), మరియు మత్తయి సువార్త యందు వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు. (బైబిలు వచనం||మత్తయి|13:55),దీనిని బట్టి యేసు ఆ మధ్య కాలంలో వడ్రంగం పని చేసి ఉండి ఉంటాడని భావించ వచ్చు.

'యేసు బాప్తీస్మము పొందుట మరియు శోధనను జయించుట.'

మార్కు సువార్త యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడంతో ప్రారంభించబడింది.దీనిని బైబిలు పండితులు యేసు యొక్క పరిచర్య ప్రారంభంగా వర్ణిస్తారు. మర్కు సువార్త ప్రకారం యోర్దాను నదిలో ప్రజలకు బప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు. కాని మత్తయి సూవార్త యందు "తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడుగగా, యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగినట్లు వివరించబడింది. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరువబడుటయు,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చుటయూ చూచెను. అంతలో పరలోకము నుండి ఒక స్వరము "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పలుకుట వినెను. బాప్తీస్మము పొందిన పిదప యేసు దేవుని వలన అరణ్యములోనికి కొనిపోబడి, అక్కడ 40 దినములు, రాత్రులు ఉపవాసముండెను.ఈ సమయమందు సాతాను యేసును శోధించెను. యేసు సాతాను శోధనలను దేవుని వాక్యమును ఉదహరించుట ద్వారా జయించెను.అంతట సాతాను యేసును విడిచి పోయెను.అంతట దేవ దూతలు వచ్చి యేసుకు ఉపచారము చేసిరి. దీనికి సంబందించిన వివరములను యోహాను సువార్త యందు పొందు పరచబడలేదు.

[మార్చు] సేవ

ప్రధాన వ్యాసాలు: యేసు పరిచర్యకొండమీద ప్రసంగంమైదానములో ప్రసంగంపన్నెండు మంది శిష్యులు & యేసు రూపాంతరము పొందుట
Sermon on the Mount, Carl Heinrich Bloch, 19th c.

సువార్తలు తెల్పునది యేమనగా యేసు మెస్సియ, "అనేకుల ప్రాణవిమోచన క్రయ ధనముగా తన ప్రాణము నర్పించ వచ్చితినని" మరియు "దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు వచ్చితినని ప్రకటించెను.దేవుని రాజ్యము."[8] తన పరిచర్య కాలములో ఎన్నో అద్భుత కార్యములను చేసెను అద్భుతములు

[మార్చు] ఇస్లాంలో ఏసుక్రీస్తు

ఇస్లాం మతంలొ ముహమ్మద్ ప్రవక్త తరువాత రెండవ గొప్ప ప్రవక్త ఏసు క్రీస్తు (ఈసా అల్ మసీహ్). ముస్లిముల నమ్మకం ప్రకారం ఏసు క్రీస్తు ఒక ప్రవక్త మాత్రమే కానీ దేవుడు కాదు, దేవుని బిడ్డ కాదు. ప్రవక్తని దేవునిగా ఆరాధించడం ఇస్లాం మతం ప్రకారం పాపం.

[మార్చు] ముహమ్మద్ రాకడ గురించి ముందే చెప్పిన క్రీస్తు

Muslims believe that Jesus was a precursor to Muhammad, and that he announced the latter's coming. They base this on a verse of the Qur'an wherein Jesus speaks of a messenger to appear after him named Ahmad. Islam associates Ahmad with Muhammad, both words deriving from the h-m-d triconsonantal root which refers to praiseworthiness. Muslims also assert that evidence of Jesus' pronouncement is present in the New Testament, citing the mention of the Paraclete whose coming is foretold in the Gospel of John. Muslim commentators claim that the original Greek word used was periklutos, meaning famed, illustrious, or praiseworthy - rendered in Arabic as Ahmad; and that this was substituted by Christians with parakletos.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు






ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

"http://te.wikipedia.org/wiki/%E0%B0%AF%E0%B1%87%E0%B0%B8%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు