బైబిల్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
భాగం వ్యాసముల క్రమం |
|---|
| యేసు |
| శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్ |
| మూలాలు |
| చర్చి · కొత్త కాన్వెంట్ అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక |
| బైబిల్ |
| పాత నిబంధన · కొత్త నిబంధన గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా |
| క్రైస్తవ ధర్మం |
| త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ) చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్ |
| చరిత్ర మరియు సాంప్రదాయాలు |
| ప్రథమ · సంఘాలు · వర్గలు · మిషనరీలు తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు |
| తెగలు |
| క్రైస్తవ మత విషయాలు |
| బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు సంగీతం · లిటర్జీ · కేలండరు చిహ్నాలు · కళలు · విమర్శ |
| 30px క్రైస్తవ పోర్టల్ |
|
|
బైబిల్ క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం. క్రైస్తవులు ఇందులో దేవుని పలుకులు ఉన్నాయని భావిస్తారు. బైబిలుకు అనేక పేర్లు ఉన్నాయి. కొందరు పవిత్ర గ్రంథమని, పవిత్ర నిబంధనమని లేదా పరిశుద్ధ గ్రంథమని పిలుస్తారు. బైబిల్ ను మొదట హీబ్రూ, ఆరామిక్ మరియు గ్రీకు భాషలలో రచించబడినది. ఆ తరువాత లాటిన్ ఇంకా తదితర భాషలలోకి అనువదించబడినది. ఇప్పుడు బైబిల్ 2000 కు పైగా భాషలలోకి అనువదించబడినది. పాత నిబంధన లో 39,కొత్త నిబంధన లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి.
విషయ సూచిక |
[మార్చు] పాత నిబంధన
బైబిల్లోని మొదటి భాగాన్ని పాత నిబంధన గ్రంథం అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల కథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు మరియు దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ హెబ్రూ లో రాశారు. 39 పుస్తకాలు ఇవి:
- ఆది కాండము
- నిర్గమ కాండము
- లేవియ కాండము
- సంఖ్యా కాండము
- ద్వితీయోపదేశ కాండము
- యెహూషువ
- న్యాయాధిపతులు
- రూతు
- సమాయేలు మొదటి గ్రంధము
- సమాయేలు రెండవ గ్రంధము
- రాజులు మొదటి గ్రంధము
- రాజులు రెండవ గ్రంధము
- దినవ్రుత్తాతములు మొదటి గ్రంధము
- దినవ్రుత్తాతములు రెండవ గ్రంధము
- ఎజ్రా
- సెహెన్యూ
- ఎస్తేరు
- యేబు గ్రంధము
- కీర్తనల గ్రంధము
- సామెతలు
- ప్రసంగి
- పరమగీతము
- యెషయా గ్రంధము
- యిర్మీయా
- విలాపవాక్యములు
- యెహెజ్కేలు
- దానియేలు
- హోషేయ
- యేబేలు
- ఆమోసు
- ఓబద్యా
- యోనా
- మీకా
- నహూము
- హబక్కూకు
- జెఫన్యా
- హగ్గయి
- జెకర్యా
- మలాకీ
[మార్చు] కొత్త నిబంధన
రెండవ భాగాన్ని కొత్త నిబంధన గ్రంథం అంటారు. గ్రీకులో యేసుక్రీస్తు జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. సెయింట్ పౌలు వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి:
- మత్తయి సువార్త
- మార్కు సువార్త
- లూకా సువార్త
- యోహాను సువార్త
- అపోస్తలుల కార్యములు
- రోమీయులకు పత్రిక
- I కొరంథీలకు పత్రిక
- II కొరంథీయులకు పత్రిక
- గలతీయులకు పత్రిక
- ఎఫసీయులకు పత్రిక
- ఫిలిప్పీయులకు పత్రిక
- కొలొస్సైయులకు పత్రిక
- I థెస్సలొనీకైయులకు పత్రిక
- II థెస్సలొనీకైయులకు పత్రిక
- I తెమొథెయుకు పత్రిక
- II తెమొథెయుకు పత్రిక
- తీతుకు పత్రిక
- ఫిలేమోనుకు పత్రిక
- హెబ్రీయులకు పత్రిక
- యాకోబు పత్రిక
- I పేతురు పత్రిక
- II పేతురు పత్రిక
- I యోహాను పత్రిక
- II యోహాను పత్రిక
- III యోహాను పత్రిక
- యూదా
- ప్రకటన గ్రంధము
[మార్చు] కేథలిక్కు బైబిల్
ఇందు లో అదనంగా ఉన్నగ్రంధాలు: 7 వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.
- తోబితు
- యూదితు
- మక్కబీయులు 1
- మక్కబీయులు 2
- సొలోమోను జ్ఞానగ్రంథము
- సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము
- బారూకు
[మార్చు] తెలుగులో బైబిలు
1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంధము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు.
1842లో S.P.G. తెలుగు మిషను కడప జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్ధనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు.
1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్ధనల పుస్తకాన్ని ప్రచురించారు.
కడప, ముత్యాలపాడులలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.జాన్ క్లే మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.
[మార్చు] వనరులు
- http://www.worldscriptures.org/pages/telugu.html
- http://justus.anglican.org/resources/bcp/Muss-Arnolt/part4b.htm
[మార్చు] తొక్కిపెట్టబడిన బైబిల్ గ్రంథములు (Biblical apocrypha)
తొక్కి పెట్టబడిన బైబిల్ గ్రంథములు కూడా అనేకం ఉన్నాయి,