విగ్రహారాధన
| ఈ "వ్యాసం"లో వ్రాసిన విషయాలు వివాదానికి దారి తీసేలాగా ఉన్నాయి. కొందరికి అభ్యంతరకరంగా ఉండవచ్చును. కనుక ఈ వ్యాసం వ్రాయడంలో విధి విధానాలపైన, తటస్థ దృక్కోణంపైనా ప్రత్యేకమైన శ్రద్ధ అవుసరం. వ్యాసంతో నేరుగా సంబంధం లేని విషయాలు వ్రాయవద్దు.
|
విగ్రహ ఆరాధన: మనిషి తయారు చేసిన ఒక రాతి బొమ్మనో, మూర్తినో, మరో రూపాన్నోపట్టుకొని దేవుడిగా, దేవుని ఆత్మ ఆవహించిన దివ్యావతారంగానో భావించి పూజంచడం, లేదా దయ్యపు శక్తులున్న అవతారంగా విశ్వసించడం .
'ఆవు' 'ఎద్దు' విగ్రహాలు
ఈజిప్టులో పూర్వం 'ఎద్దు విగ్రహాన్ని' పూజించేవారు.మోషే కొండపైకెళ్ళి దేవుని దగ్గరనుండి తెచ్చిన పది ఆజ్ఞలు చెక్కిన రాతి పలకలను అతని జాతి ప్రజలు 'ఆవు'ను పూజించడం చూచి సహించలేక పగలగొడతాడు.
గ్రీకు మరియు రోమన్లలో విగ్రహారాధన
పార్థియన్లు 'అథేనా' అను విగ్రహానికి పూజించేవారు, ఈ దేవత గ్రీకుల నాగరికత మరియు 'యుద్ధ దేవత'. దీనిని 'ఫిడియాస్' శిల్పకారుడు రూపొందించాడు. ఏథియన్ మందిరంలో గల ఈ విగ్రహం వద్ద 'మతపరమైన బలి కార్యక్రమాలు' నిర్వహించేవారు.
గ్రీకు మరియు రోమన్ మతవిశ్వాసాల అనుసారం, 'పల్లాడియమ్' అనే విగ్రహం నగరశ్రేయస్సు ను కాపాడే విగ్రహంగా భావించేవారు.
అబ్రహాము మతాలన్నీ విగ్రహారాధనకు వ్యతిరేకం
అబ్రహాము నుండి వచ్చిన మతాలు అంటే యూదా మతం క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం విగ్రహారాధనను నిషేధించాయి.యూదులు ,ముస్లిములు విగ్రహారాధన చేయరు. క్రైస్తవ మతంలో విగ్రహారాధన నిషిద్ధమైనా కొన్ని చర్చీలలో 'మేరీమాత, 'యేసుక్రీస్తు' మరియు 'శిలువ' విగ్రహాలకు మొక్కుతారు.
ముహమ్మద్ కు పూర్వం మక్కాలో విగ్రహాలు
మహమ్మదు ప్రవక్తకు పూర్వం మక్కా నగరం పలు విగ్రహాలకు నిలయం. కాబా గ్రహంలోనూ విగ్రహాలుండేవి. వాటిలో లాత్, మనాత్, హుబల్, దులిల్, ఉజ్జా మున్నగు విగ్రహాల పేర్లు. ఇలా మొత్తం 360 విగ్రహాలు కాబా గ్రహంలో వుండేవి. ఈ కాలానికి 'అజ్ఞాన కాలం' (అరబ్బీ : جاهلية ), అని పిలిచేవారు. పాగన్లు (బహువిగ్రహారాధకులు) తమ వర్తక కార్యకలాపాలను మక్కా నగరంలో నిర్వహించేవారు. మక్కా వాణిజ్య వర్తక కేంద్రం, కాబా గృహం విగ్రహాలకు కేంద్రం. ప్రజలు కాబా కు తీర్థయాత్రకొరకు వచ్చేవారు. ఇటు తీర్థయాత్ర పూర్తి చేసుకునేవారు, దానితో బాటు, వ్యాపారాలు చేసుకునేవారు.
ఇస్లామీయ ప్రవక్త ముహమ్మద్, ఇస్లాం మత సారాన్ని ప్రకటించి, విగ్రహారాధన సరికాదని బోధించారు. తౌహీద్ లేదా ఏకేశ్వరోపాసనను సరియైన మతంగా ప్రకటించి, విగ్రహారాధనను నిషేధించారు. మక్కా ముస్లింల వశమైనప్పుడు, కాబాగృహంలోని విగ్రహాలన్నీ తొలగించారు.
ముహమ్మదు ప్రవక్త బొమ్మ విగ్రహం ఉండదెందుకు?
అల్లాహ్ కు సమానంగా ఇతరుల్ని జతచేసే ఏ ఆరాధనా మార్గాన్నయినా ఇస్లాం మూసివేస్తుంది.ఈ ( షిర్క్ ) లో ప్రతిమలు విగ్రహాలుంటాయి.కానీ వాటిని ఈస్లాం నిషేదించింది.విగ్రహాలను చేసే వాళ్ళను శపించింది.అబిసీనియా చర్చిలో ఇలాగే ప్రతిమలున్నట్లు వాటినిర్వాహకుల్ని ప్రవక్త శపించినట్లు ఆయెషా ఇలా చెప్పారు:
- "వారిలో ఒక నీతిమంతుడు చనిపోతే వారు అతని సమాధి మీద అతని విగ్రహాన్నుంచి ప్రార్ధనాలయాన్ని నిర్మిస్తారు.వీళ్ళు అల్లా సృష్టిలో అత్యంత దుష్టులుగా పునరుత్థాన దినాన తేలిపోతారు".(బుఖారీ5:409).
- ప్రవక్త ప్రయాణం చేసి వచ్చారు.నాగదితలుపుకు బొమ్మలున్న కర్టెన్ కట్టాను.అది చూసి ఆయన దాన్ని చింపేశారు."అల్లా సృష్టితాలను పోలిన వాటిని చేశె వాళ్ళే పునరుత్థాన దినాన అతి తీవ్ర శిక్షను పొందుతారు అన్నారు.కాబట్టి దాన్ని రెండు దిండులు గా మార్చుకున్నాము.(బుఖారీ:5:496).
- పునరుత్థాన దినాన అతి తీవ్ర శిక్షను పొందేవాళ్ళు విగ్రహాలు చేశేవాళ్ళే.(బుఖారీ:5:494)
- ఇక ప్రవక్త తనబొమ్మను ఎలా తయరుచేయనిస్తారు?అందుకే ఏశిష్యుడూ అందుకు దైర్యంచెయ్యలేదు.బొమ్మలు హరాం అనుకున్నారు.
- లేఖనాలుగల ప్రజలారా(క్రైస్తవులు) మీమతంలో హద్దులు మీరకండి అని అల్లా హెచ్చరించాడు (ఖురాన్ 4:171)
- ప్రవక్తకూడా తన పట్ల ఎవరూహద్దులు మీరకుండా హెచ్చరించాడు."మరియం కుమారుడైన ఈసా గురించి క్రైస్తవులు హద్దులు మీరినట్లు మీరు నాగురించి హద్దులు మీరకండి.నేను కేవలం బానిసను.అందుకనే నన్ను అల్లా దాసుడు సందేశకుడు అని పిలవండి.(బుఖారీ:3:189)
- "మీరు మీ దేవతా విగ్రహాలు వద్ద్,సువా,యాగూత్,యావూక్,నస్ర్ లను వదలకూడదు అంటారు వాళ్ళు"(ఖురాన్ 71:23)
- నోవహు కాలంలో నీతిమంతులైనవాళ్ళు చనిపోతే వాళ్ళు కూర్చున్న చోట రాతి బలిపీఠాలు కట్టమని,వారి పేర్లతో పిలవమనీ సైతాను ప్రజల్ని ప్రేరేపించేవాడు.వారు అలాగే పిలిచారు గానీ ఆరాధించలేదు.ఆ తరం గడిచాక జ్ఞానంకోల్పోయిన జనం నీతిమంతుల ఆరాధన ,సమాధుల దగ్గరకు పదేపదే వెళ్ళటం,వారి విగ్రహాలు పెట్టటం,కాలంగడిచేకొద్దీ వారినే పూజించటంమొదలుపెట్టారు.(కితాబుల్ తౌహీద్ 219)
అందుకే ఈ పద్ధతి షిర్క్ కు దారితీయకుండాప్రవక్త తన చిత్రాలను నిషేధించారు.నాతరువాత వచ్చే నా అనుచరులే నాకు అత్యంత ఇష్టులు.వారిలో ప్రతి ఒక్కరూ తమ యావదాస్థినీ ఖర్చుచేసైనాసరే నా రూపాన్నిచూడాలని తహతహ లాడుతారు.సైతానుమాత్రం నారూపాన్ని పొందలేడు అన్నారు ప్రవక్త.(ముస్లిం)
ముస్లింలలో విగ్రహారాధన
ముస్లింలు విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించరు. కాని దక్షిణ ఆసియా మరియు పర్షియన్ మరియు షియా మతం యొక్క ప్రభావాలు ఎక్కువగా వున్న ప్రాంతాలలో క్రింది విషయాలు గోచరిస్తాయి. భారతదేశంలోని ముస్లిం సమాజాలలో వీటి ప్రవేశం ఎలా జరిగిందంటే, నవాబులు దాదాపు షియా మతానికి చెందినవారు. ఉదాహరణకు లక్నో నవాబు, అవధ్ నవాబు, బెంగాల్ నవాబు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీ వంశము, ఆసఫ్ జాహీ వంశము, టిప్పూ సుల్తాన్, ఆర్కాడు నవాబు, మదురై నవాబు, వీరందరూ షియాలే. వీరి పరిపాలనా కాలంలో చాలా దర్గాలు, ఆషూర్ ఖానాలు, ముహర్రం పీర్ల పండుగలు, (నేటికినీ లక్నో మరియు హైదరాబాదు నగరాలలో చూడవచ్చును), ఫాతెహా ఖ్వానీలు, కుండోంకే ఫాతెహా (రజబ్ నెలలో ఇమాం జాఫర్-ఎ-సాదిక్ మన్నత్ లేదా నోము), ఘడీ కే ఫాతెహా, చరాగోంకే ఫాతెహా (దీపాల మన్నత్), దర్గాల వద్ద 'షిఫా ఖానా' లు, చెరువులు గుంటలు, కొలనులలో మునగడం లాంటి విషయాలు, వెలసాయి. ఇలాంటి అంధవిశ్వాసాల నుండి మానవాళికి కాపాడడానికే ఇస్లాం అవతరించింది. కానీ నేటికినీ చాలా మంది ముస్లింలు 'అజ్ఞాన కాలం'లోనే విహరిస్తున్నారనే భావన నేటి లోకం భావిస్తున్నది. పెద్ద పెద్ద ముస్లిం సుల్తానులు ఔలియాల వద్ద నోములు నోచితే (ఉదాహరణకు అక్బర్ తనకు సంతానం లేదని సలీం చిష్తీ అనే సూఫీ ఔలియా సమాధి వద్ద మన్నత్ (నోము) చేశాడు) సాధారణ జనం అలాంటి చక్రవర్తులకు అనుకరించడంలో అతిశయోక్తిలేదు.
- దర్గాలు
- జెండా మానులు (జెండాలు తగిలించిన వృక్షాలు)
- పంజాలు (మొహర్రంలో ప్రతిష్టించే పీర్లు)
- ఔలియాల నషాన్లు (ఔలియాల పేరును తగిలించి అక్కడక్కడా ప్రతిష్ఠానాలు)
పైనుదహరించిన విషయాలు ఇస్లాం ప్రబోధించినవా కావా అనే వాటి గురించి చర్చలు జరుగుతూనే వున్నాయి. ఇవన్నీ సరైన విషయాలేనని సున్నీ బరేల్వీ జమాత్, సరైనవి కావు అని తబ్లీగీ జమాత్ పరస్పర ప్రకటనలు మరియు బోధనలు చేపడుతూనేవున్నవి. అప్పుడప్పుడూ వీరిమధ్య అడపాదడపా వాగ్వాదాలు, చిన్న చిన్న కొట్లాటలు, మరియు ఒకరికి వ్యతిరేకంగా ఒకరి దూషణలు సర్వ సాధారణం.
కాబాలోని రాయి( అస్వాద్)
ముహమ్మదు గారు ఈ నల్లని రాయిని హజ్ యాత్రలోభాగంగాముద్దుపెట్టుకున్నారు.కాబా గోడలో అమర్చిన రాయిని పరలోకం నుండి వచ్చిన రాయిగా భావించి ముస్లిములుకూడా అలాగే ముద్దు పెట్టుకుంటారు.
ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకం
ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకం. చనిపోయి దర్గాలలో(సమాధులలో) పెట్టబడిన ఔలియాల(ముస్లిం భక్తులు) ఆశీస్సులు పొందడం కోసం, వారి సమాధుల వద్ద జియారత్ చేయడాన్ని ఇస్లాం విగ్రహారాధనగా భావిస్తుంది.ఇస్లాం ఈ క్రింది పనుల్ని విగ్రహారాధనగా భావించి నిషేధించింది:
ఔలియాల సమాధులకు సాష్టాంగ ప్రమాణాలు చేయటం,సమాధులలో వున్న వారి పీర్లతో నోములు నోయటం,ఔలియాలకే ప్రార్థనలు చేయటం, సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం,దర్గాల దగ్గర స్తోత్రగానాలు చేయటం,దర్గాలే సర్వస్వం, అల్లాహ్ ను పొందుటకు ఇవే స్వర్గద్వారాలు అనుకోవటం,తల నీలాలు సమర్పించటం, తావీజులు, తాయెత్తులు ధరించటంలాంటివి.
ఇస్లాం విగ్రహారాధనను నిషేధిస్తుంది. సమాధులను గౌరవ భావంతో సందర్శించేందుకు అనుమతి ఇస్తుంది కానీ వాటికి మొక్కటాన్ని ఆరాధించటాన్ని నిషేధిస్తుంది.
ఆర్యసమాజం విగ్రహారాధనకు వ్యతిరేకం
ఆర్యసమాజం విగ్రహారాధన(మూర్తిపూజ)ను వ్యతిరేకిస్తుంది.
యూదా క్రైస్తవమతాలు విగ్రహారాధనకు వ్యతిరేకం
క్రైస్తవులు లేఖనాలు విగ్రహారాధనకు వ్యతిరేకం. ఏ ప్రతిమనూ చేసుకోకూడదని, ఏఆకారానికీ మొక్కకూడదని దేవుడు పది ఆజ్ఞలు రాతిపలకలపై చెక్కి మోషేకిస్తాడు.కానీ కొన్ని డినామినేషన్లకు చెందిన క్రైస్తవులు విగ్రహాలను ఇండ్లలోనూ వీధులలోనూ చర్చీలలోనూ వుంచి వాటికి మొక్కుతారు కూడా. విగ్రహారాధకులని చిత్ర హింసలు పెట్టి చంపిన యూదుల ప్రవక్త మోషేని క్రైస్తవులు కూడా ప్రవక్తగా నమ్ముతారు కానీ మోషే ప్రవచనాలకి విరుధ్ధముగా క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేస్తూ తమ ప్రవక్త ఆశయాలకి తామే పోటు పొడుస్తున్నారు.
జైనమతం
జైన మతంలో తీర్థాంకరుల విగ్రహాలకు పూజా పునస్కారాలు చేపట్టడం తక్కువగాను, వీటిని గౌరవించడం ఎక్కువగా చూస్తాము. అయిననూ విగ్రహాలకు 'అభిషేకం' చేయడం ఆనవాయితి.[1]
హిందూమతం
హిందూ మతం విగ్రహారాధనను ఆచరిస్తుంది. విగ్రహారాధన హిందూ సంస్కృతిలో విడదీయలేని భాగం అయిపోయింది. ఇప్పుడు షిరిడీ సాయి బాబా, సత్య సాయి బాబాల పేర్లతో కొత్త కొత్త దేవాలయాలు కట్టి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. గతంలో ప్రతి ఊరికి ఒక రామాలయం ఉండేది. ఇప్పుడు ఊరూరా సాయిబాబా ఆలయాలు వెలుస్తున్నాయి.