కడప

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


  ?కడప
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of కడప, India
కడపను చూపిస్తున్న పటము
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తిస్తున్న భారతదేశ పటము
Location of కడప
అక్షాంశరేఖాంశాలు: 14°29′N 78°49′E / 14.48°N 78.81°E / 14.48; 78.81
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ప్రాంతం రాయలసీమ
జిల్లా(లు) kadapa జిల్లా
జనాభా 3,25,725 (2001)
మేయరు altitude = 138
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 516001
• +91-8562
• AP04

కడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతములోని నగరము. వైఎస్ఆర్ జిల్లాకు ముఖ్యపట్టణము.

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి దక్షిణదిశగా 412 కి.మీ ( మైళ్ళ)దూరంలో పెన్నా నది కి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉన్నది. నగరానికి రెండు వైపులా నల్లమల అడవులు ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. తిరుమల వెంకటేశ్వర స్వామికి గడప కావటంతో దీనికి ఆ పేరు సిద్ధించినది.

రామాయణం లోని నాల్గవ భాగమైన కిష్కింధకాండము ఇక్కడికి 20 కి.మీ (12 మైళ్ళు) గల ఒంటిమిట్ట లో జరిగినదని నమ్మకము. గండి లో కల ఆంజనేయ స్వామి గుడి కూడా రామాయణం లోని భాగమే అని నానుడి. రాముడు సీతని కనిపెట్టటంలో ఆంజనేయ స్వామి యొక్క సహాయాన్ని అంగీకరిస్తూ, తన బాణం యొక్క మొనతో ఈ గుడిని కట్టినట్లు ప్రతీతి.

వ్యుత్పత్తి[మార్చు]

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఆంగ్లేయుల ఉఛ్ఛరణకి అనుగుణంగా సృష్టించిన స్పెల్లింగు "Cuddapah" కి బదులుగా 19 ఆగష్టు 2005 లో ప్రాంతీయులకి సౌకర్యంగా ఉండేవిధంగా "Kadapa" అని మార్చారు.

కడప పట్టణ రైల్వే స్టేషను

చరిత్ర[మార్చు]

11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప చోళ సామ్రాజ్యము లోని భాగము. 14వ శతాబ్దపు ద్వితీయార్థములో ఇది విజయనగర సామ్రాజ్యము లో భాగమైనది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉండినది. 1422 లో పెమ్మసాని నాయకుడైన పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800 లో బ్రిటీష్ సామ్రాజ్యం లో భాగమైనది. కడప నగరం పురాతనమైనది అయిననూ కుతుబ్ షాహీపాలకుడైన నేక్ నాం ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు. కొంత కాలం ఇలా సాగినా తర్వాత ఇది పతనమవగా 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం ఇది నేక్నాం ఖాన్ కడప నవాబు అని తేలినది. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయాన నవాబులకి ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లినది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మున్రో క్రింద ఉన్న నాలుగు కలెక్టరేట్ లలో ఇది కూడా ఒకటైనది. 2004 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందినది.

వన్ టౌన్ పోలీస్ స్టేషను వద్ద నున్న రహ్మతుల్లా క్లాక్ టవర్

భౌగోళికం[మార్చు]

కడప పట్టణం భౌగోళికంగా 14°28′N 78°49′E / 14.47°N 78.82°E / 14.47; 78.82 వద్ద ఉన్నది. 138 మీ (452 అడుగుల) సరాసరి ఎత్తు కలదు. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ. తూర్పు కనుమలు జిల్లాని రెండుగా విడదీస్తాయి. ఈశాన్య, మరియు ఆగ్నేయ భాగాలు తక్కువ ఎత్తు గల పీఠభూమి కాగా, దక్షిణ మరియు నైరుతి భాగాలు సముద్ర మట్టానికి 1500 నుండి 2,500 ఎత్తు గల భూమి. పశ్చిమం దిశ గా బళ్ళారి నుండి అనంతపురం గుండా పారే పెన్నా నది ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న నెల్లూరు జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారిననూ వేసవుల్లో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, సగిలేరు, చెయ్యేరు మరియు పాపాఘ్ని.

కడప నగరపాలక సంస్థ[మార్చు]

కడప నగరపాలక సంస్థ వై.ఎస్.ఆర్ జిల్లా లోని ఏకైక నగరపాలక సంస్థ.

జనాభా[మార్చు]

ఆసక్తికరమైన కేంద్రాలు[మార్చు]

 • దేవుని కడప (లేదా) పాత కడప
 • దేవుని కడప చెరువు
 • అమీన్ పీర్ దర్గా (ఆస్థాన్-ఎ-మగ్దూమ్-ఇలాహి దర్గా)
 • సి. పి. బ్రౌన్ గ్రంథాలయము
 • సెయింట్ మేరీస్ క్యాథెడ్ర చర్చ్, మరియాపురం
 • విజయదుర్గా దేవి గుడి, చిత్తూరు జాతీయరహదారి
 • కడప శిల్పారామం
 • వై ఎస్ ఆర్ క్రికెట్ స్టేడియం
 • పాలకొండలు

Kaviatri Molla==రచయితలు మరియు కవులు==

జిల్లాలోఉర్ధూసాహిత్యం[మార్చు]

విద్యారంగం[మార్చు]

 • రాజీవ్ గాంధీ వైద్య కళాశాల, పుట్లంపల్లి
 • కందుల శ్రీనివాస రెడ్డి స్మృత్యర్థ ఇంజినీరింగ కళాశాల
 • హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
 • యోగి వేమన విశ్వవిద్యాలయము
రాజీవ్ గాంధీ వైద్య కళాశాల
 • వేంపల్లి : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.

వ్యవసాయం మరియు పరిశ్రమలు[మార్చు]

ప్రముఖులు[మార్చు]

ప్రదేశాలు[మార్చు]

 • కో ఆపరేటివ్ కాలనీ
 • ఎన్ జీ ఓస్ కాలనీ
 • పోలీస్ క్వార్టర్స్
 • రాజారెడ్డి వీధి
 • మరియాపురం
 • రైల్వే స్టేషన్ రోడ్డు
 • ఎర్రముక్కపల్లి
 • కాగితాల పెంట
 • చంద్ర మౌలినగర్

సినిమా థియేటర్లు[మార్చు]

 • రమేష్
 • అప్సర
 • అమీర్
 • తాహర్
 • రవి
 • సుధ

పరిశీలన కొరకు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూసలు, వర్గాలు[మార్చు]


Public Domain This article incorporates text from a publication now in the public domainమూస:Cite EB1911

"http://te.wikipedia.org/w/index.php?title=కడప&oldid=1307134" నుండి వెలికితీశారు