నంద్యాల

వికీపీడియా నుండి

  ?నంద్యాల మండలం
కర్నూలు • ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు జిల్లా పటములో నంద్యాల మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో నంద్యాల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నంద్యాల
జిల్లా(లు) కర్నూలు
గ్రామాలు 19
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
214,175 (2001)
• 108348
• 105827
• 67.18
• 77.68
• 56.46


నంద్యాల ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఒక మండలం, లోక్ సభ మరియు శాసన సభ నియోజకవర్గం, మరియు అదే పెరుగల పట్టణం.కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక పెద్ద వాణిజ్య కేంద్రం. నంద్యాలకు భారత రాజకీయాలలో ఒక రాష్ట్రపతిని మరియు ప్రధానమంత్రి అందించిన ఏకైక పార్లమెంటు నియోజకవర్గముగా విశిష్టత ఉన్నది. నంద్యాల స్థానికులు కానప్పటికీ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా, పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఇక్కడినుండే పోటీచేశారు. పి.వి.నరసింహారావు నంద్యాల నియోజకవర్గము నుండి లోక్‌సభకు అత్యంత భారీ మెజారిటీ వోట్లతో ఎన్నికై ప్రపంచ రికార్డు సృష్టించాడు.

పూర్వము నంద్యాలకు నందియాల అని పిలిచేవారు. నంద్యాల దగ్గరలో మహనంది అనే ప్రముఖ యాత్రా స్థలం కలదు.

విషయ సూచిక

[మార్చు] రాజకీయ వ్యవస్థ

[మార్చు] ఆర్థికం

రాష్ట్రం,జిల్లాలో తక్కిన ప్రాంతాలలాగే నంద్యాల ప్రాంతంలో, ముఖ్యంగా మండలంలోని గ్రామాలలో, వ్యవసాయమే ప్రధాన వృత్తి. కుందూ నది మరియు ఇతర వాగుల రూపంలో జలవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ గత కొంత కాలంగా నెలకొన్న వర్షాభావం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాంతంలో పండించే పంటలలో ముఖ్యమైనవి పత్తి, వరి, శనగ, జొన్నలు మరియు కూరగాయలు.

నంద్యాల పట్టణం మండలంలోని గ్రామాలకు మరియు దగ్గ్గరలో గల పలు మండలాలకు వాణిజ్య మరియు వర్తక కేంద్రం.

[మార్చు] రవాణా

నంద్యాల పట్టణానికి రైలు సౌకర్యం మరియు బస్సు సౌకర్యం రెండూ ఉన్నాయి.

నంద్యాల పట్టణములో కూడళ్ళలో గాంధీచౌకు మరియు బొమ్మలసత్రం ముఖ్యమైనవి. బొమ్మల సత్రం 18వ నంబరు జాతీయరహదారిని ఆనుకొని ఉంది. కర్నూలు వైపు నుండి నంద్యాల పట్టణములో ప్రవేశించేవారికి బొమ్మలసత్రం ముఖద్వారం. బొమ్మల సత్రము పక్కనే కుందేరు ప్రవహిస్తూ ఉన్నది.

[మార్చు] దర్శనీయ ప్రదేశాలు

మహానంది క్షేత్రం ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో ముఖ్యమైనది.

[మార్చు] ప్రాంత ప్రముఖులు

  • భూమా నాగిరెడ్డి మాజీ ఎంపి
  • ఎస్‌.పి.వై.రెడ్డి (ప్రస్తుత ఎంపీ)
  • శిల్పా మోహనరెడ్డి (ప్రస్తుత ఎంఎల్యే)
  • బొజ్జా వెంకటరెడ్డి (మాజీ ఎంపీ)
  • మహమ్మద్ ఎన్ ఫరూక్ (మాజీ మంత్రి)
  • రామనాథ రెడ్డి (మాజీ ఎంఎల్యే)
  • పేసాల శ్రీనివాసులు శ్రేస్టి
  • కైప రాముడు (మున్చిపల్ ఛైర్మెన్)

[మార్చు] గ్రామాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

RAIT

పేజీకి సంభందించిన లింకులు