బాపట్ల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?బాపట్ల మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో బాపట్ల మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో బాపట్ల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°53′20″N 80°28′12″E / 15.8889°N 80.47°E / 15.8889; 80.47
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము బాపట్ల
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 19
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,37,520 (2001)
• 69410
• 68100
• 65.40
• 73.18
• 57.51


గుంటూరు జిల్లా లో గుంటూరు నుండి 53 కి మీల దూరంలో గుంటూరు-చీరాల రాష్ట్ర రహదారిపై నున్న పురాతన పట్టణం - బాపట్ల. చెన్నై- కోల్కతా రైలు మార్గం బాపట్ల గుండా పోతుంది. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్ల గా మారింది.

బాపట్ల జనరల్ హాస్పిటల్

పేరువెనుక చరిత్ర[మార్చు]

స్వాతంత్య్ర సమరం జోరుగా సాగుతున్న రోజులవి! అహింస అనే ఆయుధంతో తమను ముప్పతిప్పలు పెడుతున్న గాంధీ అంటే చాలు... తెల్లవాళ్ళు లాఠీలతో యిరగబాదేస్తున్నారు. దాంతో... పుల్ల అట్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ఓ వృద్ధుడు తన అంగడికి ‘బాపు అట్లు’ అని పేరు పెట్టేసుకున్నాడు. బాపు అంటే అర్థం కాని తెల్లవాళ్ళు ఇతని జోలికి పోలేదు. ‘బాపు పుల్లట్ల’ వ్యాపారం జోరుగా సాగి పోయింది. ఇక ఊరూరా ‘బాపుఅట్లు’ వెలిశాయి. ఆ తర్వాత్తర్వాత ఈ ప్రాంతం బాపట్లగా ప్రచారంలోకి వచ్చేసింది.

స్వాతంత్య్ర సమరంలో బాపట్ల[మార్చు]

హోం రూలు ఉద్యమంపై బ్రిటిష్ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ 1916లో బాపట్లలో సభ జరిగింది. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను విద్యార్థులు బహిష్కరించారు. వీరికోసం బాపట్లలో 1921 ఫిబ్రవరిలో ఒక జాతీయ కళాశాల నెలకొల్పబడింది. పాటిబండ్ల కోటమ్మ, వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ, మంతెన అన్నపూర్ణమ్మ, తిలక్ స్వరాజ్యనిధికి తమ బంగారునగలు సమర్పించారు. 1921లో చీరాల-పేరాల ఉప్పుసత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బాపట్ల బోర్డు హైస్కూల్ విద్యార్థి. తాలూకా కార్యాలయంలో గుమాస్తాగా పనిచేశారు. 1923 మే నెలలో బాపట్లకు చెందిన ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు భట్టిప్రోలు సూర్యప్రకాశరావు నాగపూర్ వెళ్ళి నాగపూర్ జెండా సత్యగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఉప్పు తయారు చేయడానికి, నిల్వచేయడానికి బాపట్ల తాలూకాలోని గణపవరం ఒక కేంద్రంగా ఎంపిక చేయబడింది. విదేశీవస్త్ర బహిష్కరణ ఉద్యమం సందర్భంగా 1920 ఏప్రిల్ 12న మాధవపెద్ది కాళిదాసు అధ్యక్షతన సమావేశమైన బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యులందరు కోర్టులకు హాజరయ్యేటప్పుడు ఖద్దరు దుస్తులను ధరించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కనపర్తి వరలక్ష్మమ్మ బాపట్లలో మహిళలచేత రాట్నలక్ష్మీవ్రతం చేయించి ప్రతిరోజు నూలువడకాలని, ఖద్దరు దుస్తులనే ధరించాలని ప్రతిజ్ఞ చేయించారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బాపట్లలో నాళం రామచంద్రరావు, వేదాంతం వాసుదేవరావు, లక్కరాజ భార్గవి, మనోహరరావు, ఆచంట రంగనాయకులు నిర్బంధంలోకి తీసుకోబడ్డారు. వి.ఎల్.సుందరరావు, దేశిరాజు శర్మలు బాపట్ల తాలూకా ప్రాంతమంతా పర్యటించి ఈ ఉద్యమాన్ని నడిపారు. 1921 మార్చి 30న అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో పాల్గొనడానికి విజయవాడ వచ్చిన మహాత్మాగాంధీ తన పర్యటనలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన ప్రప్రథమంగా బాపట్లను సందర్శించారు. మరలా 1936లో బాపట్ల తాలూకాలో సంభవించిన తుపాను భీభత్సాన్ని చూడడానికి వచ్చారు. 1934లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు బాబురాజేంద్రప్రసాద్ బాపట్ల సందర్శించి టౌన్‌హాలులో జరిగిన సభలో ప్రసంగించారు. 1936వ సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ నాయకులు జవహర్‌లాల్ నెహ్రూ బాపట్లను సందర్శించి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన సభలో ప్రసంగించారు.

విద్యా కేంద్రం[మార్చు]

బాపట్ల ఇంజినీరింగు కళాశాల

చిరకాలముగా బాపట్ల ప్రముఖ విద్యా కేంద్రముగా విలసిల్లుచున్నది. ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము వారి వ్యవసాయ కళాశాల, వివిధ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ ఇంజినీరింగు కళాశాల, గృహవిజ్ఞాన కళాశాల ఇక్కడ ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఇంజనీరింగు, ఫార్మసీ మొదలైన కళాశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. వ్యవసాయ ఆధారితమైన ఎన్నో గ్రామాలకు బాపట్ల ఒక కూడలిగా, వ్యాపార కేంద్రంగా ఉన్నది. ఇక్కడ వ్యవసాయ కళాశాలలో అభివృద్ధి చెందిన బియ్యంను బీ.పీ.టీ. రకం అంటారు.

గృహవిజ్ఞాన కళాశాల, బాపట్ల[మార్చు]

అచార్య N.G. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దీనిని బాపట్లలో 1983 లో ప్రారంభించారు. దీనిలో ప్రస్తుతం B.Tech (Food science) course offer చేస్తున్నారు. మొతం సీట్ల సంఖ్య 40, వీటిని EMCET ద్వారా భర్తీ చేస్తారు.

సముద్రతీరం[మార్చు]

బాపట్లకు సమీపంలోని సూర్యలంక వద్ద నున్న బీచ్ సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడే భారత వాయుసేన వారి కేంద్రము కూడా కలదు. ఇది బాపట్లకు 9 కి.మీ దూరంలో ఉన్న ఓడరేవు మరియు పర్యాటక కేంద్రము. ఇక్కడ భారత వాయుసేన వారి కేంద్రము కూడా కలదు. కప్పలవారిపాలెం, పిన్నిబోయినవారిపాలెం సమీపంలో నల్లమడ వాగు,తూర్పు తుంగభద్ర, గుండంతిప్ప స్ట్రెయిట్‌ కట్‌, రొంపేరు రైట్‌ ఆర్మ్‌ డ్రెయిన్లు సముద్రంలో కలుస్తాయి.

పాలనా విభాగాలు[మార్చు]

ఇది తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

శాసనసభ మరియు లోక్ సభ నియోజకవర్గం[మార్చు]

ప్రముఖులు[మార్చు]

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • బాపట్ల

UPPARA PALEM

పట్టణంలోని ముఖ్య ప్రాంతాలు[మార్చు]

పడమటి సత్రం, తూర్పు సత్రం, గడియార స్థంభం, రథం బజార్, పాత బస్టాండ్, బాలకృష్ణాపురం, దరివాడ కొత్తపాలెం, చెంగల్రాయుడుతోట, దగ్గుమల్లివారిపాలెం, హయ్యర్‌నగర్, నరాలశెట్టిపాలెం, వివేకానందకాలనీ, , ఇమ్మడిశెట్టిపాలెం, విజయలక్ష్మీపురం, మాయాబజార్, ఇస్లాంపేట, రైలుపేట, జమెదార్ పేట,ఆనందనగర్,S.N.P AGRAHARAM

మండలంలోని గ్రామాలు[మార్చు]


Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"http://te.wikipedia.org/w/index.php?title=బాపట్ల&oldid=1450984" నుండి వెలికితీశారు