కృష్ణా జిల్లా
| ?కృష్ణా జిల్లా ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 8,727 కి.మీ² (3,370 చ.మై) |
| ముఖ్య పట్టణము | మచిలీపట్నం |
| ప్రాంతం | కోస్తా |
| జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
45,29,009 (2011) • 519/కి.మీ² (1,344/చ.మై) • 2268312 • 2260697 • 74.37(2001) • 79.13 • 69.62 |
కృష్ణా జిల్లాకు [1]ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రంగా విజయవాడ ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో నల్గొండ జిల్లా ఉన్నాయి. దీని ముఖ్యపట్టణం మచిలీపట్నం కాగా, దీనిలోనివిజయవాడ ఆంధ్రప్రదేశ్ లో మూడవ పెద్దనగరం.
విషయ సూచిక |
[మార్చు] జిల్లా పేరు వెనుక చరిత్ర
కృష్ణా పరివాహక ప్రాంతం కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాలో ఉన్న ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు పాశుపతాస్త్రం కొరకు పరమశివుని ఉద్దేశించి తపమాచరించాడని, దుర్గాదేవి ఇక్కడ మహిసారుడిని సంహారం చేసిందని పురాణకధనాలు వివరిస్తున్నాయి. కృష్ణా నది తీరాన కొలువు తీరి ఉన్నకనక దుర్గాదేవికి భక్తజన పూజలను అందుకొంటూ ఉంది.
[మార్చు] జిల్లా చరిత్ర
చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు "మచిలీపట్నం జిల్లా" అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణాజిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ మంది వ్యాపారంలో ఉండగా, గ్రామాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు లో కొంత భాగం కృష్ణా జిల్లాలో కూడా ఉంది. ఇక్కడ ప్రవహించే నదులు కృష్ణా, బుడమేరు, మున్నేరు మరియు తమ్మిలేరు. విజయవాడ, గుడివాడ, ఉయ్యూరు,మచిలీపట్నం,చల్లపల్లి, కొండపల్లి, తిరువూరు, కైకలూరు, కృష్ణా, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట ఈ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు.
జిల్లాలోని హనుమాన్ జంక్షన్ కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిసి నూజివీడు, మచిలీపట్నం రహదారికిరువైపులా ఉంటాయి. అలాగే మూడు మండలాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ఉన్న హనుమంతుని ఆలయము చాలా విశిష్టమైనది. పట్టణానికి ఆ పేరు ఈ ఆలయము వలన వచ్చినదే.
[మార్చు] భౌగోళిక స్వరూపం
- కృష్ణా జిల్లా పీఠభూమి మరియు తీర ప్రాంతంలుగా విభజించబడింది. భారతదేశం యొక్క అత్యంత పర్యావరణ సంబంధిత ముఖ్యమైన చిత్తడినేలలో కొల్లేరు సరస్సు ఒకటి ఈజిల్లా లోపలనే పాక్షికంగా ఉంది.
[మార్చు] కొండలు
- జిల్లాలో ప్రధాన కొండ ఒకే పొడవుతో నందిగామ మరియు విజయవాడ పట్టణముల మధ్య 24 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దానిని కొండపల్లి అని పిలుస్తారు. ఇంకనూ జమ్మలవాయిదుర్గం, మొగల్రాజపురం మరియు ఇంద్రకీలాద్రి మొదలగు ఇతర కొండలు కూడా ఉన్నాయి.
- భారతదేశములో అత్యంత ప్రసిద్ధమైన కనకదుర్గదేవాలయం, విజయవాడ వద్ద ఇంద్రకీలాద్రి కొండలు మీదనే ఉన్నది.
[మార్చు] నీటివనరులు
[మార్చు] భూమి మరియు భూగర్భ వనరులు
- జిల్లాలో నల్లమట్టి (57.6%), ఇసుక బంకమట్టి (22.3%) ఎర్ర బంకమట్టి (19.4%) అను మూడు రకాల నేలలు ఉన్నాయి.
| ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
|---|---|---|---|
| మైనింగ్ & గనుల త్రవ్వకం | % | 0.45 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
- విస్తృతంగా నాచురల్ గ్యాస్ మరియు క్రూడాయిల్ నిక్షేపాలు ఆఫ్షోర్ మరియు జిల్లా యొక్క తీర ప్రాంతము నందు ఉన్నాయి.
- కొద్దిపాటి డైమండ్స్ యొక్క చిన్న చిన్న నిక్షేపాలు లభిస్తాయి.
- సున్నపురాయి ప్రధాన ఖనిజముగా ఈ జిల్లా నుండి సేకరిస్తారు.
- భవన నిర్మాణం కోసం వాడబడే ఇసుకను కృష్ణ మరియు మున్నేరు నదుల నుండి త్రవ్వకాలు జరిపి సేకరిస్తారు.
- ఖనిజాలు దొరుకు ప్రాంతములు:
- క్రోమైటు : కొడపల్లి కొండలు మరియు దగ్గర ప్రాంతాలలో
- డైమండ్స్ : పరిటాల, ఉస్తేపల్లి, కొండవీటికల్లు, రామన్నపేట, సూర్యవరం, కొత్తపేట, నెమలిపురం, మాగులూరు మరియు పుట్రేల (రాజస్థాన్ లో ప్రముఖ మైనవి) మొదలైన ప్రాంతాలు.
- ఇనుము ధాతువు : జగ్గయ్యపేట ప్రాంతం.
- సున్నపురాయి : జగ్గయ్యపేట ప్రాంతం.
- మైకా : తిరువూరు ప్రాంతం.
[మార్చు] ఆటవి ప్రదేశం
| ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
|---|---|---|---|
| అటవీ ప్రాతం | % | 7.5 | 1997-98 లెక్కల ప్రకారం (షుమారు 9% ఉజ్జాయింపుగా ఉండవచ్చును.) |
[మార్చు] వాతావరణం
- జిల్లా వాతావరణ పరిస్థితులు వేసవికాలం చాలా వేడిగా, శీతాకాలం తేలికపాటిగా ఉంటాయి. అంతేకాక ఇక్కడి వాతావరణం పరిస్థితులు ఉష్ణ ప్రాంతములుగా వర్గీకరింపబడ్డాయి. ఏప్రిల్ ప్రారంభ కాలం నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంది. ఈ ప్రాంతంనకు నైరుతి రుతుపవనాలు ద్వారా వర్షపాతం 1028 మి.మీ. అందించబడుతుంది.
[మార్చు] ఆర్ధిక స్థితి గతులు
[మార్చు] వ్యవసాయం
వ్యవసాయం గురించిన సమగ్రసమాచారం [2]కంప్యూటర్ ద్వారా అందుబాటులో వుంది. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లగల కంప్యూటర్ మరియు ప్రొజెక్టర్ ద్వారా రైతులకు అందుబాటులోనికి తెస్తున్నారు.
[మార్చు] వ్యాపారం
- కృష్ణా జిల్లా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారము మరియు వాణిజ్యం లతో నిమగ్నమై ఉన్నారు. వ్యవసాయం జిల్లా ప్రజలు యొక్క అతి ముఖ్యమైన వృత్తిగా ఉన్నది.
| ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
|---|---|---|---|
| వ్యవసాయం & అనుబంధ కార్యకలాపాలు | % | 66.18 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
| స్థూల సాగునీటి ప్రాంతం | % | 62.00 | 1997-98 లెక్కల ప్రకారం |
| తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి | కి.గ్రా. | 321 | 1997-98 లెక్కల ప్రకారం |
- కృష్ణా జిల్లాలో ఎన్నో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లా అనేక పరిశ్రమలకు ఆతెధ్యము ఇస్తున్నది. వాటిలో కెసీపి చెక్కర కర్మాగారం చెప్పుకోతగ్గది. ఉయ్యూరు వద్ద ఉన్న KCP షుగర్ ఫ్యాక్టరీ భారతదేశంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారములలో ఒకటి. ఇబ్రహీంపట్నం సమీపంలో, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (VTPS) దాని పనితీరునకు భారతదేశం లో నం .1 అధిక పవర్ ఉత్పత్తి యూనిట్‌గా స్థానం పొందింది. ఇది కాక, అనేక మీడియం స్కేల్ సిమెంట్ కర్మాగారాలు జిల్లా అంతటా ఉన్నాయి. మచిలీపట్నం వద్ద బంగారం-లేపనం ఆభరణాలు, కొండపల్లి వద్ద బొమ్మలు మరియు జగ్గయ్యపేట వద్ద సంగీత సాధన తయారీ పరికరాలు వంటి పలు చిన్న తరహా పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి.
| ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
|---|---|---|---|
| మాన్యుఫాక్చరింగ్ (గృహేతర) పరిశ్రమలు | % | 6.18 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
| గృహ పరిశ్రమలు | % | 2.39 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
| నిర్మాణము | % | 1.61 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
| సేవలు | % | 23.09 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
- విజయవాడ వద్ద సిరీస్ (SIRIS) ఫార్మాస్యూటికల్ కంపెనీ, అలోపతిక్ మందులు తయారీ దిగ్గజాలలో ఇది మరొక సంస్థ. ఆంధ్రప్రదేశ్ లోని అతి పురాతన పోర్ట్ మచిలీపట్నంలో ఉంది. ఇదికాక ఎన్నో సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. విజయవాడ దగ్గర ఇబ్రహీమ్ పట్నం వద్ద ఉన్న తాప విద్యుత్కేంద్రం చాలా పేరెన్నికగన్నది. ఇవికాక మచిలీపట్నంలో గిల్టునగల తయారీ, కొండపల్లి చెక్కబొమ్మలు, జగ్గయ్యపేట లో సంగీత సాధనముల తయారీ మొదలయిన చేతి వృత్తి పనులు కూడా ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన సాంప్రదాయిక నృత్య రీతి యైన కూచిపూడి నృత్యం జిల్లాలోని కూచిపూడి గ్రామంలో పుట్టింది.
[మార్చు] జీవనస్థాయి
- ఈ జిల్లాలో ఉన్న 4.187.841 (2001 నాటికి) జనాభాలో 32,08% శాతం పట్టణ జనాభా. జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయం మచిలీపట్నంలో ఉంది. విజయవాడకార్పొరేషన్ జిల్లా ప్రముఖ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్నది.
| ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
|---|---|---|---|
| పట్టణీకరణం | % | 35.82 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
| మొత్తం జనాభాలో పనివారి శాతం | % | 43.3 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
[మార్చు] ఆర్థిక గణాంకాలు
| ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
|---|---|---|---|
| తపాలా కార్యాలయములు (ప్రతి 100,000 మంది జనాభా) | నిష్పత్తి | 22.04 | 1996-97 లెక్కల ప్రకారం |
| బ్యాంకులు (ప్రతి 100,000 మంది జనాభా) | నిష్పత్తి | 9.33 | 1994-95 లెక్కల ప్రకారం |
| తలసరి బ్యాంకు డిపాజిట్లు | రూ. | 3386.42 | 1994-95 లెక్కల ప్రకారం |
| తలసరి బ్యాంకు ఋణాలు | రూ. | 2250.49 | 1994-95 లెక్కల ప్రకారం |
| వ్యవసాయానికి తలసరి బ్యాంకు ఋణాలు | రూ. | 604.49 | 1994-95 లెక్కల ప్రకారం |
| ఎస్.ఎస్.ఐ.(SSI)లకి తలసరి బ్యాంకు ఋణాలు | రూ. | 168.67 | 1994-95 లెక్కల ప్రకారం |
| పరిశ్రమలకు తలసరి బ్యాంకు ఋణాలు | రూ. | 490.86 | 1994-95 లెక్కల ప్రకారం |
[మార్చు] డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు
భౌగోళికంగా కృష్ణా జిల్లాను 50 రెవిన్యూ మండలాలుగా విభజించారు [3].
- కృష్ణా జిల్లాలో విజయవాడ కార్పొరేషన్ మరియు మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, పెడన మున్సిపాలిటీలుగా ఉన్నాయి. 2011 సం. నుండి నందిగామ, తిరువూరు, ఉయ్యూరులను మున్సిపాలిటీలు (పురపాలక సంఘాలు)గా ప్రభుత్వము ప్రకటించింది.
| 1 జగ్గయ్యపేట | 18 పెనమలూరు | 35 నాగాయలంక |
| 2 వత్సవాయి | 19తొట్లవల్లూరు | 36 కోడూరు |
| 3 పెనుగంచిప్రోలు | 20 కంకిపాడు | 37మచిలీపట్నం |
| 4 నందిగామ | 21 గన్నవరం | 38 గూడూరు |
| 5 చందర్లపాడు | 22 అగిరిపల్లి | 39పామర్రు |
| 6 కంచికచెర్ల | 23 నూజివీడు | 40 పెదపారుపూడి |
| 7 వీరులపాడు | 24 చాట్రాయి | 41 నందివాడ |
| 8 ఇబ్రహీంపట్నం | 25 ముసునూరు | 42 గుడివాడ |
| 9 జి.కొండూరు | 26 బాపులపాడు | 43 గుడ్లవల్లేరు |
| 10 మైలవరం | 27 ఉంగుటూరు | 44 పెడన |
| 11 ఏ.కొండూరు | 28 ఉయ్యూరు | 45 బంటుమిల్లి |
| 12 గంపలగూడెం | 29 పమిడిముక్కల | 46 ముదినేపల్లి |
| 13 తిరువూరు | 30 మొవ్వ | 47 మండవల్లి |
| 14 విస్సన్నపేట | 31 ఘంటసాల | 48 కైకలూరు |
| 15 రెడ్డిగూడెం | 32 చల్లపల్లి | 49 కలిదిండి |
| 16 విజయవాడ గ్రామీణ | 33 మోపిదేవి | 50 కృతివెన్ను |
| 17 విజయవాడ పట్టణం | 34 అవనిగడ్డ |
[మార్చు] లోకసభ నియోజకవర్గాలు
- కృష్ణా జిల్లా పరిధిలో విజయవాడ, మచిలీపట్నం మరియు ఏలూరు (కొద్ది భాగము) పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.
- ఈ జిల్లాలో విజయవాడ మరియు మచిలీపట్నం అను రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.
[మార్చు] అసెంబ్లీ నియోజకవర్గాలు
- ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి తిరుఊరు (ఎస్సీ), నందిగామ (ఎస్సీ), మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ (వెస్ట్), విజయవాడ (సెంట్రల్), విజయవాడ (తూర్పు), పెనమలూరు, నూజివీడు, గన్నవరం, పెడన, గుడివాడ, కైకలూరు , మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు (ఎస్సీ).
[మార్చు] పార్టీలు
- తెలుగు దేశం మరియు కాంగ్రెస్ (ఐ) జిల్లాలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) పార్టీలు, భారతీయ జనతా పార్టీ, లోక్ సత్తా పార్టీ , ఇతర పార్టీలు కూడా ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి.
[మార్చు] రవాణా వ్వవస్థ
- విజయవాడ వద్ద పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆసియాలోని అతి పెద్ద బస్ కాంప్లెక్స్‌లలో ఒకటి.
- విజయవాడ వద్ద రైల్వే స్టేషన్ భారతదేశంలో 2 వ రద్దీగా ఉండే జంక్షన్ ఉంది. 200 కంటే ఎక్కువ రైళ్లు ఈ రైల్వే స్టేషన్ ద్వారా (పాస్) ప్రయాణించడము మరియు రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగిపోవడము లేదా (ప్రారంభము) బయలుదేరడము కాని జరుగుతుంది.
- విజయవాడకు ఈశాన్యదిశలో 16 కి.మీ. దూరములో గన్నవరము వద్ద ఉన్న విమానాశ్రయం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, రాజమండ్రి నగరములకు అనుసంధానముతో విమాన ప్రయాణమునకు వీలు ఉన్నది.
| ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
|---|---|---|---|
| రహదారి పొడవు ప్రతి 100 చ.కి.మీ. | కి.మీ. | 78.76 | 1996-97 లెక్కల ప్రకారం |
| రైలు మార్గము పొడవు ప్రతి 100 చ.కి.మీ. | కి.మీ. | 2.14 | 1996-97 లెక్కల ప్రకారం |
- నాలుగు జాతీయ రహదారులు ఈ జిల్లా నుండి కలుపుతున్నాయి.
- కోల్‌కత నుండి చెన్నై = NH-5
- మచిలీపట్నం నుండి పూనే = NH-9
- జగదల్‌పూర్ నుండి విజయవాడ = NH-221
- ఒంగోలు నుండి కత్తిపూడి = NH-214
[మార్చు] జనాభా లెక్కలు
- జనసాంద్రత అనేది ఒక జనాభా కొలమాన విధానము. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.
- కృష్ణా జిల్లా 8.727 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఆక్రమించింది (3,370 sq mi),[4] ఈ జిల్లా షుమారు, తులనాత్మకంగా కోరిస్కాతో [5] సమానం.
| ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం | |
|---|---|---|---|---|
| ప్రదేశం | చ.కి.మీ | 8727 | 2001 జనాభా లెక్కల ప్రకారం | |
| జనాభా | వేలల్లో | 4218.41 | 2001 జనాభా లెక్కల ప్రకారం | |
| పురుషులు | వేలల్లో | 2151.18 | 2001 జనాభా లెక్కల ప్రకారం | |
| స్తీలు | వేలల్లో | 2067.22 | 2001 జనాభా లెక్కల ప్రకారం | |
| పట్టణ | వేలల్లో | 1365.64 | 2001 జనాభా లెక్కల ప్రకారం | |
| గ్రామీణ | వేలల్లో | 2852.76 | 2001 జనాభా లెక్కల ప్రకారం | |
| జనాభా పెరుగుదల (దశసంఖ్యతో సం.) | % | +14.05 | 2001 జనాభా లెక్కల ప్రకారం | |
| జనసాంద్రత (మనిషి/చ.కి.మీ.) | నిష్పత్తి | 483 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
[మార్చు] విభాగాలు
- ఈ జిల్లా ప్రతి ఆదాయం విభాగానికి ఉప కలెక్టర్ నేతృత్వంలో విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ అను నాలుగు ఆదాయం విభాగాలుగా విభజించబడింది.
[మార్చు] గృహోపకరణ సూచికలు
- 2007–2008 సంవత్సరములో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ సంస్థ వారు జిల్లా అంతటా 1229 గృహాలు 34 గ్రామాలలో ఇంటర్వ్యూ జరిపారు.[6] వారు 94.7% విద్యుత్, 93,4% నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం, 60.3% టాయిలెట్ సౌకర్యాలు, మరియు 45.5 (శాశ్వత) నివాస గృహాసౌకర్యాలు ఉన్నట్లు కనుగొన్నారు.[6]20.6% మంది స్త్రీలు అధికారక వయస్సు 18 సం.లు నిండక ముందే వివాహము చేసుకున్నారు.[7]
- ఇంటర్వ్యూ నిర్వహించిన వారిలో 76,9% ఒక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఉన్నారు.[6]
[మార్చు] సంస్కృతి
- కృష్ణా జిల్లా తెలుగు ప్రజల సాంస్కృతిక వారసత్వం యొక్క చిహ్నం.[ఆధారం కోరబడినది]
- ప్రపంచ ప్రసిద్ధ కూచిపూడి నృత్య రూపం ఈ జిల్లాలో నుండి ఉద్భవించింది.
- ఈ జిల్లా వాసులు మాట్లాడే తెలుగు యాసను తెలుగు భాషయొక్క సహజరూపమని భావించబడుతుంది.[ఆధారం కోరబడినది]
[మార్చు] పశుపక్ష్యాదులు
[మార్చు] వృక్షజాలం మరియు జంతుజాలం
- జిల్లాలో చెప్పుకోదగ్గ అటవీప్రాంతం లేదు. అడవి మొత్తం జిల్లా వైశాల్యంలో 9% మాత్రమే ఉంది. అయితే నందిగామ, విజయవాడ,నూజివీడు, తిరువూరు,గన్నవరము, మచిలీపట్నం ప్రాంతాలలో మరియు దివి తాలూకాలలో రిజర్వు ఫారెస్ట్ కలిగి ఉంది. ఒక రకం అయిన పొనుకు (గైరోకాపస్ జాక్విని) అని పిలువబడే తేలికపాటి రకమయిన చెక్కకొండపల్లి కొండలు ప్రాంతము నందు కనిపిస్తుంది. ఈ చెక్కను ఎక్కువగా బాగా అందరికీ తెలిసిన కొండపల్లి బొమ్మలు తయారీకి ఉపయోగిస్తారు. చాలా గుర్తించదగ్గ చెట్లు అయిన టెరోకార్‌పస్, టెర్‌మినాలియా, ఎనోజీస్సస్, లోగస్ట్రోయినయ్ మరియు కాజురినా లాంటివి కూడా ఉన్నాయి.
- పాంథర్స్ పులులు, దుమ్ములగొండులు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు మరియు ఇతర మాంసాహార క్షీరదాల జంతుజాలం ఇక్కడ కనిపిస్తాయి. జింక, మచ్చల లేడి సాంబార్, కృష్ణ జింక మరియు ఇతర శాకాహార జంతువులు ఈ భూభాగ అడవులలో గుర్తించవచ్చు.
- కృష్ణ జిల్లా సరిహద్దు కొల్లేరుసరస్సులో ఒక వలస బూడిద రంగు గల పెలికాన్ బిల్డ్ అనే ఒక రక్షిత పక్షి ఉంది.
- ఈ జిల్లా అనేక ముర్రా జాతి గేదెలు మరియు ఆవులు పెద్ద సంఖ్యలో కలిగి ఉంది.
[మార్చు] విద్యాసంస్థలు
- విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఒకటి. దీనిలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు.
- ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ.
- కృష్ణ విశ్వవిద్యాలయం మచిలీపట్నం.
- రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూజివీడు.
- దక్షిణ భారత శాఖ యొక్క స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం
- భారతదేశం లోనే కార్పొరేట్ విద్యా సంస్థలు అతిపెద్ద / పెద్ద /మధ్య రకములు అయిన, అనేక నివాస కళాశాలలు మరియు పాఠశాలలు కలిగి ఉన్న సంస్థలలో పేరెన్నికగన్న శ్రీ చైతన్య, నలందా, గౌతమ్, శ్రీ క్రిష్ణవేణి సంస్థలు, అమెరికన్ మెడికల్ విద్య (USMLE) శిక్షణ సంస్థల ప్రధాన కార్యాలయములు
- జిల్లాలో అనేకం ఇంజనీరింగ్ కాలేజ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, కె.ఎల్.సి.ఈ., ఏ.ఏ.ఎన్.ఎమ్. & వి.వి.ఎస్.ఆర్ (గుడ్లవల్లేరు) పాలిటెక్నిక్ కళాశాల, మేరీ స్టెల్లా కళాశాల, సిద్ధార్థ డిగ్రీ కళాశాల సహా అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో అనేక ప్రసిద్ధ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలు కూడా ఉన్నాయి.
| ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
|---|---|---|---|
| అక్షరాస్యత | % | 69.91 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
| అక్షరాస్యత (పురుషులు ) | % | 74.57 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
| అక్షరాస్యత (స్తీలు ) | % | 65.05 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
[మార్చు] కళాశాలలు
- డా.ఎన్.టి.ఆర్. యూనివర్సిటి ఆఫ్ హెల్త్ సైన్సెస్. విజయవాడ
- శ్రీమతి.వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కాలేజ్, విజయవాడ.
- జెస్తో కలినరి అండ్ హాస్పిటాలిటి ఎకాడమి, గవర్నర్ పేట, విజయవాడ
- ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. గర్నమెంట్ కాలేజ్, విజయవాడ.
- కె.బీ.న్.కాలేజ్,విజయవాడ.
- సయ్యద్ అప్పల స్వామి కాలెజ్, విజయవాడ.
- శాతవాహన కాలెజ్, విజయవాడ.
- ఆంధ్ర లయెల కళాశాల, విజయవాడ.
[మార్చు] ఆకర్షణలు
[మార్చు] జిల్లాలో చారిత్రక స్థలాలు
- మచిలీపట్నంపోర్ట్
- చింతలపాడు
- గుడివాడ
- కొండపల్లిఖిల్లా
- మహాత్మా గాంధీ హిల్, విజయవాడ
- ఘంటసాల
[మార్చు] మతపరంగా ముఖ్యమైన స్థలాలు
- కనకదుర్గ ఆలయం
- బ్రహ్మముగారి జెండా, ఈడుపుగల్లు
- పాండురంగస్వామి గుడి, చిలకలపూడి
- మోపిదేవి గుడి
- కొండాలమ్మ ఆలయం, గుడ్లవల్లేరు
- పెనుగంచిప్రోలు గుడి
- మొవ్వ గుడి
- సింగరాయపాలెం గుడి
- హనుమాన్ గుడి, హనుమాన్ జంక్షన్
- అయ్యప్పస్వామి గుడి, గొల్లపూడి
- మారెమ్మ గుడి, పుట్రేల
- సరస్వతి గుడి, నూజివీడు
- మేరీమాత గుడి, గుణదల. విజయవాడ
- వేణుగోపాల స్వామి దేవాలయం, నెమలి
[మార్చు] క్రీడలు
- ఈ జిల్లాలో కబాడీ ఆట అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడతో పాటు క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నిస్ ఆటలు ప్రాముఖ్యమైనవి. విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు, భారతదేశం యొక్క అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు బలరాం ఈ జిల్లా కు చెందినవారు.
[మార్చు] ప్రముఖవ్యక్తులు
కృష్ణా జిల్లా ఎందరో ప్రముఖులకు పుట్టినిల్లు. వారిలో కొందరు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు,ఎస్.వి.రంగారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు,కొడవటిగంటి కుటుంబరావు, పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, కె.ఎల్.రావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కైకాల సత్యనారాయణ మరియు విశ్వనాథ సత్యనారాయణ.
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మూలాలు
- ↑ కృష్ణా జిల్లా అధికారిక జాలస్థలం
- ↑ సస్యశ్రీ జాలస్థలం
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో కృష్ణా జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
- ↑ (2010) "States and Union Territories: Andhra Pradesh: Government", India 2010: A Reference Annual, 54th, New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India, 1111–1112. ISBN 978-81-230-1617-7. Retrieved on 2011-10-11.
- ↑ Island Directory Tables: Islands by Land Area. United Nations Environment Program (1998-02-18). తీసుకొన్న తేదీ: 2011-10-11. “Corsica 8,741”
- ↑ 6.0 6.1 6.2 District Level Household and Facility Survey (DLHS-3), 2007-08: India. Andhra Prades (PDF). International Institute for Population Sciences and Ministry of Health and Family Welfare (2010). తీసుకొన్న తేదీ: 2011-10-03.
- ↑ How Do I? : Obtain Marriage Certificate. National Portal Content Management Team, National Informatics Centre (2005). తీసుకొన్న తేదీ: 2011-10-03. “To be eligible for marriage, the minimum age limit is 21 for males and 18 for females.”
|
||||||||||||||