అర్జునుడు

వికీపీడియా నుండి

అర్జునుడు పాండవ మధ్యముడు. మహాభారత ఇతిహాసములో ఇంద్రుడి అంశ మరియు అస్త్రవిద్యలో తిరుగులేని వీరుడు. పాండు రాజు సంతానం. కుంతి కి ఇంద్రుడు కి కలిగిన సంతానం.

శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం
శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం

విషయ సూచిక

[మార్చు] జననం

పాండు రాజుకు మొదటి భార్యయైన కుంతీ దేవి ద్వారా సంతానం కలుగలేదు. కుంతీ దేవికి చిన్నతనంలో దుర్వాస మహాముని నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ వరం ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీ దేవి మొదట యమ ధర్మరాజును ప్రార్థించింది. యుధిష్టురుడు జన్మించాడు. వాయుదేవుని ప్రార్థించింది; భీముడు జన్మించాడు. చివరగా దేవేంద్రుని ప్రార్థించింది. అర్జునుడు జన్మించాడు.

[మార్చు] వ్యక్తిత్వం

అర్జునుడు సుభద్ర రతి క్రీడలు సన్నివేశాన్ని చిత్తిరించిన రాజా రవి వర్మ.
అర్జునుడు సుభద్ర రతి క్రీడలు సన్నివేశాన్ని చిత్తిరించిన రాజా రవి వర్మ.

మహాభారతం అర్జునుని సంపూర్ణ వ్యక్తిత్వం కలవానిగానూ,ఆరోగ్యకరమైన, ధృడమైన, అందమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు కలవానిగానూ, మరియు ప్రతి తల్లితండ్రీ, ప్రతి భార్య, ప్రతీ స్నేహితుడు, గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఉన్నవానిగా అభివర్ణించింది.మొత్తం నలుగుర్ని వివాహమాడాడు. స్నేహితులతో కూడా చాలా మంచిగా వ్యవహరించేవాడు. గొప్ప వీరుడైన సాత్యకి అర్జునుడికి మంచి స్నేహితుడు. తన బావయైన శ్రీకృష్ణునితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగించాడు. కొంచెం మృధు స్వభావి మరియు మంచి ఆలోచనాపరుడు కూడా. అందుకనే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి గీత బోధించవలసి వచ్చింది.

[మార్చు] విధ్యార్థిగా

అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు. దీనికి పునాది లేత వయస్సులోనే పడింది. చిన్నపుడు అత్యుత్తమ విద్యార్థి. గురువు ద్రోణాచార్యుడు చెప్పిన ఏ అంశాన్నైనా ఇట్టే గ్రహించే వాడు.

[మార్చు] భర్తగా

[మార్చు] కర్తవ్య పాలనలో

పాండవులు తమ ఉమ్మడి భార్యయైన ద్రౌపదితో సంసార జీవనం సాగించడానికి కొన్ని విధి నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియమాల ప్రకారం ఒకరు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నపుడు మరొకరు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు. ఇలా భంగం కలిగించిన వారికి ఏడాది పాటు బహిష్కరణ శిక్ష విధిస్తారు. పాండవులు ఇంధ్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నపుడు ఒక సారి బ్రాహ్మణుడొకడు, అర్జునుని సహయాన్ని అభ్యర్థించాడు. అతని పశుసంపదలను ఎవరో దొంగల ముఠా తోలుకెళ్ళారనీ, వారి నుంచి తన పశు సంపదను కాపాడమని అర్జునుని వేడుకొన్నాడు. కానీ అర్జునుని ఆయుధ సామాగ్రి మొత్తం ద్రౌపది మరియు యుధిష్టురుడు ఏకాంతంగా ఉన్న గదిలో ఉండిపోయి నందున వారికి భంగం కలిగించడం నియమాలకు వ్యతిరేకం కనుక సందిగ్ధంలో పడ్డాడు. కానీ సహాయార్థం వచ్చిన బ్రాహ్మణోత్తముని తిప్పి పంపటం క్షత్రియ ధర్మం కాదు కాబట్టి ఆ శిక్ష గురించి జంకకుండా వారున్న గదిలోకి వెళ్ళి ఆయుధాలు తీసుకొని పశువులను దొంగలించిన వారికోసం వెళ్ళాడు. ఆ పని పూర్తయిన వెంటనే ధర్మరాజు మరియు ద్రౌపదితో సహా కుటుంబం మొత్తం వారిస్తున్నా ఒక సంవత్సరం పాటు తనకు తానే బహిష్కరణ విధించుకున్నాడు.

[మార్చు] అరణ్య వాసం మరియు అజ్ఞాతవాసం

అజ్ఞాత వాసంలో అర్జునుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా బృహన్నల వేషం ధరించాడు. అరణ్యవాసం విదించిన ఐదవ సంవత్సరంలో హిమలయాలకు వెళ్ళి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు.

[మార్చు] యుద్ధం

మహాభారత సంగ్రామంలో అర్జునునిది చాలా కీలకమైన పాత్ర. యుద్ధ రంగంలో నిలిచి తన బంధువులను, హితులను, సన్నిహితులనూ చూసి అర్జునుడు మొదట యుద్ధం చేయనని వెనకడుగు వేస్తాడు. కానీ రథ సారథి, మరియు బావయైన శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు. దీనినే హిందూ సంస్కృతి లో భగవద్గీత అంటారు. ఇది హిందువులకు చాలా పవిత్రమైన గ్రంథం.

[మార్చు] యుద్ధానంతరం

మహాభారత సంగ్రామానంతరం పాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు. గొప్ప విజయం, కౌరవులకు మద్ధతు పలికిన అనేక మంది రాజలను ఓడించడం, మొదలైన అనేక కారణాల వల్ల వారు అశ్వమేధ యాగం చేయ సంకల్పించారు.

[మార్చు] ఇతర పేర్లు

  1. పార్థుడు
  2. జిష్ణు
  3. కిరీటి
  4. విజయుడు
  5. కపిధ్వజుడు
  6. సవ్యసాచి
  7. భీభత్సుడు
  8. ఫల్గుణుడు
  9. ధనుంజయుడు
  10. గాండీవి
పేజీకి సంభందించిన లింకులు