శివుడు

వికీపీడియా నుండి

ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం.

శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకడు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. శివుడు అనార్య దేవుడు. కానీ తరువాత వైదిక మతంలో లయకారునిగా స్థానం పొందాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.[1]

శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని యొక్క అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు యొక్క రూపముగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు.[2]. శైవం, వైష్ణవం ,శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సాంప్రదాయాలు[3].


విషయ సూచిక

[మార్చు] పుట్టుక

శివుని పుట్టుక గురించి అనేక కథలు ఉన్నాయి. విష్ణు పురాణంలో శివుడు బ్రహ్మ కుమారుడని ఉన్నది. మధు, కైటభులు అను రాక్షసులు బ్రహ్మను చంపటానికి రాగా, విష్ణువు వారిని తీక్షణంగా చూస్తాడు. ఆ సందర్భములో విష్ణువు నుదుటి నుండి శివుడు త్రిశూలాన్ని ధరించి జన్మించాడని మరొక ఇతిహాసములో ఉన్నది.

మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉన్నది.

[మార్చు] శివుని రూపం

పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉన్నది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.

[మార్చు] హిందూ సాంప్రదాయంలో స్థానం

Dakshinamurti Shiva sculpture on the southern entrance of the Madurai Meenakshi Temple

[మార్చు] దక్షిణామూర్తి

ప్రధాన వ్యాసం: దక్షిణామూర్తి

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.

[మార్చు] ప్రధాన కథ

[మార్చు] మత సాంప్రదాయాలు

[మార్చు] పేర్లు, అవతారాలు

  • ఆదిదేవుడు
  • రుద్రుడు
  • పరమశివుడు
  • గంగాధరుడు
  • గౌరీపతి
  • నటరాజు
  • కైలాసాధిపతి
  • పశుపతి
  • గరళకంఠుడు
  • హరుడు

[మార్చు] గ్రంథాలూ, పురాణాలూ

[మార్చు] దేవాలయాలు

ప్రధాన వ్యాసం: శివాలయం

శివుని లింగరూపములోను, మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని ఆగమశాస్త్రాలవల్ల తెలుస్తున్నది. శివుని ప్రతిమలలో స్థానమూర్తిగాను, ఆశీనమూర్తిగానూ ఉంటాడు. కానీ శయనరూపంలో శివుని ప్రతిమలు లేవు. మొత్తం 45 రకాలుగా శివ ప్రతిమలు ప్రతిష్టించవచ్చని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి. శివుడు ప్రతిమగా పూజింపబడుచున్నప్పటికీ ఎక్కువగా లింగరూపములోనే ప్రతిష్టింపబడుచున్నాడు. శివలింగాలు నాలుగు రకాలు. అవి దైవికాలు, ఆర్షకాలు, బాణలింగాలు, మానుషాలు.

[మార్చు] ఆచారాలు, పండగలు

[మార్చు] ప్రార్థనలు, స్తోత్రాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] వనరులు

  1. ముప్పాళ్ల హనుమంతరావు (1997) పేజీ.615
  2. Tattwananda, p. 45.
  3. Flood (1996), p. 17.

[మార్చు] బయటి లంకెలు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు