షణ్ముఖుడు
వికీపీడియా నుండి
షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాధ వివరంగా ఉన్నది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్టి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకొంటారు.
విషయ సూచిక |
[మార్చు] ప్రధాన గాధ
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు.
శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి
- షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
- స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
- కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
- వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
- శరవణభవుడు - శరములో అవతరించినవాడు
- గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
- సేనాపతి - దేవతల సేనానాయకుడు
- స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
- సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
- మురుగన్ -
దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృత్తికావ్రతము ఆచరించమని బోధించాడంటారు.
[మార్చు] తత్వార్ధాలు
షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు. తెలుగునాట సుబ్రహ్మణ్య షష్ఠి ఒక ముఖ్యమైన పండుగ. తమిళనాట మురుగన్ దేవాలయాలు, పేర్లు, ఉత్సవాలు సర్వ సాధారణం.
[మార్చు] ఆచారాలు
[మార్చు] ప్రార్ధనలు
"సుబ్రహ్మణ్యాష్టకము" నుండి
- హే స్వామినాధ కరుణాకర దీనబంధో
- శ్రీ పార్వతీ సుముఖ పద్మ సింధో
- దేవాధినాధ గణ సేవిత పాద పద్మ
- వల్లీశనాధ మమదేహి కరావలంబమ్
-
- నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
- తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ
- శృత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప
- వల్లీశనాధ మమదేహి కరావలంబమ్
[మార్చు] దేవాలయాలు
[మార్చు] వనరులు
[మార్చు] బయటి లింకులు
ఈ గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలన్నిటి కి ఒక ఆధ్యాత్మిక కేంద్రం గా భాసిల్లుతున్నది. ఊరి శివార్లలో గల శివాలయం నిత్యం ధూప దీప నైవేద్యాదులతో భక్తులతో కళ కళ లాడుతూ ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకత ఏమనగా .... ఈ ఆలయంలో శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి మూర్తి సుమారు 7 అడుగుల ఎత్తున్న పాలరాతి విగ్రహం ఉన్నది. రూపం అత్యంత రమణీయంగా గాంభీర్యం , కోమలత్వం , కరుణ , ప్రేమ భావాల మేళవింపుగా ఎంతసేపు చూసినా తనివి తీరని ఆకర్షణతో సందర్శకులను కట్టిపడేస్తుంది. ఈ మూర్తిని జైపూర్ నుండి తెప్పించారు. ఇలాంటి విగ్రహం దక్షిణాదిలోనే లేదని ఇక్కడి పెద్దలు చెబుతారు. శిథిలావస్థలోనున్న శివాలయాన్ని సంస్కరించటం కోసం సుమారు 30 ఏళ్ళ క్రితం ఈ గ్రామానికి విచ్ఛేసిన సిద్ధులు పరమపూజ్య శ్రీ శ్రీశ్రీ శుద్ధ చైతన్య స్వామి కొన్ని నెలల పాటు కేవలం పాలు , పళ్ళు మాత్రమే స్వీకరించి అకుంఠితదీక్ష పూని అమ్మవారి ఉపాసన చేసిన తరువాత ఆలయం దినదిన ప్రవర్థమానమై మునుపటికి మించిన వైభవంతో అలరారుతున్నట్లు గ్రామ ప్రజలు చెబుతారు. క్రమేపీ గ్రామం పాడిపంటలతో సకల సౌభాగ్యాలతో తులతూగటంతో గ్రామస్థులు కృత`జ్ఞ తా పూర్వకంగా శివాలయ ప్రాంగణంలోనే ఆయనకు ఒక ఆశ్రమాన్ని ఏర్పరచి ఆయన చూపిన ధర్మ మార్గంలో జీవిస్తున్నారు. స్వామీజీ మరణానంతరం వారి శిష్యులు పూజ్యనీయులు బ్రహ్మచారి వెంకటస్వామి నిత్యము ధార్మిక ప్రసంగాలు, ఉపన్యాసాలు, భజనలు నిర్వహిస్తున్నారు. మహిళలు ఏడాది పొడవునా ఈ గ్రామంలో నిత్యమూ తెల్లవారుఝామునే లేచి స్నానాదికాలు పూర్తి చేసుకుని నగర సంకీర్తన , పూజలు చేస్తారు. ఇక్కడ వ్యవసాయ పరంగా వరి, చెరకు, మినుములు, పెసలు కొబ్బరి పండిస్తారు. గత కొద్ది సంవత్సరాలుగా చేపలు , రొయ్యల చెరువులు బాగా వృద్ధి లోకి వచ్చాయి.