తదియ

వికీపీడియా నుండి
(త్రితీయ నుండి దారిమార్పు చెందింది)

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో మూడవ తిథి తదియ లేదా త్రితీయ. అధి దేవత - గౌరి.

[మార్చు] తదియ నిర్ణయం

ధర్మ సింధు[1] ప్రకారం గౌరీ వ్రతాదులలో తదియకు లేశమైనను విదియ కలియరాదు. మరునాడు చవితి కొద్దిగా కలిసివున్నా గౌరీదేవికి తదియగా గుర్తించాలి.

ఇతర వ్రతాలలో తొలిరోజున మూడు ముహూర్తముల కాలం విదియ ఉండి, ఆ రోజున మూడు ముహూర్తముల కాలం తదియ ఉంటే పూర్వదినాన్ని తదియగా గుర్తించరాదు. కేవలం ద్వితీయవేధ ఎక్కువ ఉన్నప్పుడే ఇలా గ్రహించాలి. లేనపుడు పరదినమే గ్రహించాలి.

[మార్చు] పండుగలు

  1. ఉండ్రాళ్ళ తద్ది (తదియ).
  2. అట్ల తద్ది (అట్ల తదియ).
  3. అక్షయ తదియ (వైశాఖ శుద్ధ తదియ)

[మార్చు] మూలాలు

  1. తదియ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.
"http://te.wikipedia.org/w/index.php?title=తదియ&oldid=560001" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె