తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు
జననంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి
ఆగష్టు 5, 1897
గుంటూరు జిల్లా లోని చందవోలు
మరణండిసెంబరు 10, 1990
మతంహిందూ మతం
భార్య / భర్తపార్వతి (శ్రీదేవి)
తండ్రితాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి
తల్లిశ్రీదేవి అమ్మ

తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి (ఆగష్టు 5, 1897 - డిసెంబరు 10, 1990) గారు శ్రీదత్తాత్రేయ స్వామి,  శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అమ్మ ఉపాసకులు. [1]

జీవితాంశాలు[మార్చు]

గుంటూరు జిల్లా లోని చందోలు (చందవోలు) గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు శాస్త్రి 1897, ఆగష్టు 5 న జన్మించారు. [1] తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి 1922 లో శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించారు. తిరిగి 1986 లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి రామకథామృత గ్రంథమాల తరపున పునర్ముద్రించారు.

రాఘవ నారాయణశాస్త్రికి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్యశాస్త్రి ఉపనయనం చేశారు. వెంకటప్పయ్యశాస్త్రి వద్దనే రాఘవనారాయణశాస్త్రి సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత, నిష్టతో చేయడం ప్రారంభించారు. విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం సకాలంలో చేయడం ప్రారంభించి, సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు. అయితే వీరిచేత అక్షరాభ్యాసం చేయించి, లౌకిక విద్య తాడికొండ గ్రామస్తులైన కేదారలింగం నేర్పడం ప్రారంభించారు.

16వ సంవత్సరంలోనే రాఘవనారాయణశాస్త్రి గారికి శ్రీ చీరాల స్వామి  దర్శనం ఇచ్చారు. శ్రీ చీరాల స్వామి అతని గురుదేవులు, వారి చెంతే వారు ఉద్దరించబడినారు. శ్రీ చీరాల స్వామి వారు  శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారిని  అష్టసిద్ధి, నవనిధి సిద్ధులతో వర్దిల్లుగాక అని ఆశీర్వదించినారు.  ఆ తరువాత జీవితాంతం స్వామి వారు వారిని దూరంగానే  ఉండమన్నారు.

వెంకటప్పయ్యశాస్త్రికి కుమారుడు కనిపించక వెతుకుతూండగా ఊరి చివర పొదలమాటున రాఘవనారాయణశాస్త్రి గారి కి కనిపించారు. తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసివచ్చింది. శ్యామలాంబ అవధూత వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపంలో జన్మించాడని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది. అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది. ఒకరిని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చాడు. అమ్మవారు చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది. 19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ, పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతితో వివాహ మైంది. పిన్ని చూపించింది కూడా ఈమెనే. ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రిగారు మార్చారు.

శాస్త్రి గారు తండ్రి గారి వేద పాఠశాల నిర్వహణలో తోడు పడుతూ ఉన్నారు. ఆయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికా నుంచి వచ్చేవారు. ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రితో కవిత్వ సాధన చేసేవారు. అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా ప్రశంసాపత్రాలను ఇచ్చారు. వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారితో అనేక అవధానాలు చేసి, ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధిలో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతంగా చెప్పి ఒప్పించారు.

దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు దీనస్థితి లో ఉంది. తరువాత ఇంటివద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు. మూడు రోజులు ఇంట్లో అంతా ఉపవాసమే ఉండి లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి నేల మీద నిద్రించారు. దేశాటన తరువాత  శ్రీ చీరాల స్వామి వారే ఇంటిదగ్గర అన్ని  వసతులు సమకూర్చినారు.

అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది. అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే.

అనేక గ్రామాలలో భాగవతం, హరివంశం, పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరేవారు. పరమ నిష్టాగరిష్టంగా జీవించేవారు. ప్రాణాయామం తపస్సు కొనసాగించారు. ఇంట్లో వేరుసెనగ నూనె, వేరుసెనగ వాడలేదు. దొండకాయ, టమేటా, బంగాళా దుంప, ముల్లంగి, కాబేజీ నిషిద్ధం. కాశీకి తప్ప ఎప్పుడూ రైలు ప్రయాణం చేయలేదు. ఆయనకు మగ సంతానం లేదు. కూతురు లక్ష్మిని చెరువు సత్య నారాయణ శాస్త్రి కిచ్చి వివాహం చేశారు. ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు.

శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశమైనాయి. వాటిని స్వంతానికి ఎప్పుడూ వాడుకోలేదు. వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు "నీకు ఏమి కావాలో చెప్పు. ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో" అనేది. వారు "నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా" అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు వారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి `వశ్యంకర ఔషధి’ని ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ మయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోని ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకుని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకి వెళ్ళారు. సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది. పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డు వచ్చాడు. సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామనుకుంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డు వచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డు వస్తుండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరడం లేదు. ఇక విసిగిపోయిన వారు "ఎవడవురా నువ్వు? నాకెందుకు అడ్డు వస్తున్నావు? నన్ను ఆ మూలిక కోసుకోనీ. మరల గ్రహణం అయిపోతే అది కనిపించదు" అన్నారట. ఆ పిల్లవాడు "నేనెవరైతే నీకెందుకు? నీకు ఆ మూలిక ఎందుకు?" అని ప్రశ్నించాడు. "ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వమంతా వశమవుతుందట. కనుక నన్ను దానిని తీసుకోనీ" అని శాస్త్రి గారన్నారు. దానికి అ పిల్లవాడు నవ్వి "నీకు ఈ మొక్క తో పని లేదు. నీ ముఖం చూస్తేనే అందరు వశులౌతారు, ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా" అన్నాడట. శాస్త్రి గారు "అదంతా నీకెందుకు? ముందు అడ్డు తొలగు. మరల గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది" అని కోరారు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఈ లోగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది. బాలుడు మాయమయ్యాడు శాస్త్రి గారు తనకు దాన్ని పొందే యోగం లేదని నిట్టూరుస్తూ ఉండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయస్వామి. వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక సారి ఒక 6-7 యేళ్ళ పిల్లవాడు వీరిని చూచి "మనిద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం కదా! గుర్తు లేదా?" అని అడిగాడట. వీరికేమీ అర్థం కాక ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఏదో అడుగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట. అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాహచర్యం పొందిన మహా భాగ్యశాలియో కదా! పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు. సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు. శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృశ్యుడైనాడు. యు

అదృష్యుడైనాడు.

తండ్రి గారు మొదలు పెట్టిన "శ్రీ రామకథామృతం" ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు అయోధ్యకాండం లో గాయత్రీ మంత్రం లోని "భకార" వర్ణం తో పద్యం రావటం లేదు. అమ్మను ఉపాశించి నిద్ర పోయారు. కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు. శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే "ఎందుకు నిల బడ్డావు?" అని అడిగింది. "నాకూ పాలు ఇస్తావా?" అని అడిగారు. మెలకువ వచ్చి "భర్మ మయ రమ్య హర్మ్యము" అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది.

తాడి కొండ వేద పాఠశాలలో దెయ్యాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు. ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెనపల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతీ కని పించి, నమస్కరించి లోపలి వెళ్ళింది. ఆమె గ్రహ పీడి తురాలు. అందర్ని కొడుతూ, తిడుతూ ఉండేది. అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది. ఆమెను గ్రహ ప్రేరణ చేసి "ఏం చేస్తే నువ్వు పోతావు?" అని అడిగారు. "సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను "అంది. శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు. ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది. దెయ్యం వదిలింది. వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది. అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వెయ బూనితే "గారుడ మంత్రం "జపించారు. సర్పం తల నేలకు వాల్చింది. "స్వామీ !నీ జోలికి నేను రాలేదు. నా జోలికి నువ్వు రావద్దు. పొరపాటున నా కాలు తగిలింది. వెళ్లి పొండి." అనగానే పాము వెళ్లి పోయింది. ఆ రోజంతా గారుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు.

శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు "బాలా మంత్రానుష్టానం" చేసిన మహనీయులు. ఒక సారి కాశీలో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి గలగలా లాడే బంగారు చ్గాజులున్న చెయ్యి చూపించి "నాకేమి కానుక తెచ్చావు?" అని అడిగింది. శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు. బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది. తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు. గంగమ్మ కని పించి "కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా?" అన్నది. "అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది?" అని గద్దించింది. "అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు. ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే." అన్నారు. మళ్ళీ గంగమ్మ "నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు "అన్నది గంగ. శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి "గంగార్పణం" చేశారు.

ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో, పేరు పెట్టమనో అడిగే వారు. కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసే వారు. అంతే. ఆ కార్య క్రమం శుభప్రదంగా జరిగి పోయేది. దానికి తిరుగు లేదు. అదీ వారి మంత్ర సిద్ధి.

దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం, గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు. అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు. అప్పుడు వారిని చూశాను. జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది. అప్పుడే "నడయాడే దైవం" అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం. 10-12-1990 ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతంగా చేరి పోయారు. వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారంగా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు. శాస్త్రి గారు కారణ జన్ములు. వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి. అంత్యక్రియలు జరిగినపుడు ఆ చితి పై శ్రీ బాలా త్రిపుర సుందరి అందరికీ కనిపించుట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Sri Raghava Narayana Sastry". Achyuthan (in ఇంగ్లీష్). Archived from the original on 2018-02-15. Retrieved 2018-03-04.

యితర లింకులు[మార్చు]