దేవుడు

వికీపీడియా నుండి

వ్యాసముల క్రమము
దేవుడు

సాధారణ నిర్వచనాలు
దేవవాదం · హినోథీయిజం
ఏకేశ్వరవాదం · పానెంథీయిజం
పాంథీయిజం · మోనోలాట్రిజం


నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితము
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతములలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతములో
సిక్కు మతములో · బౌద్ధమతములో


అనుభవాలు మరియు ఆచరణలు
విశ్వాసము · ప్రార్థన · నమ్మకం · అవతరణలు
ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్
మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం


సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతము · ఓంటాలజీ
గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ
అయోమయం
చెడుతో సమస్యలు (థియోడైసీ)
ఆస్తికవాదం


ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు


దేవుడు ని ఆస్తికులు విశ్వాన్ని సృష్టించి, నడిపేవాడు, అని నమ్ముతారు.[1]ఏకేశ్వరోపాసకులు దేవుడు ఒక్కడే అంటారు. బహుదేవతారాధకులు, ధార్మిక వేత్తలు,(Theologians), దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, కరుణామయుడు, సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త మరియు అంతములేనివాడు.

దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు. [1] ఈ పేర్లన్నీ హిందూమతము, యూదమతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము నకు చెందిన ధార్మికవేత్తలు తత్వవేత్తలు, హిప్పోకు చెందిన ఆగస్టైన్, [2] అల్-ఘజాలి,[3] మరియు మైమోనిడ్స్, ఆపాదించారు. [2] మధ్యకాలపు తత్వవేత్తలు, దేవుడున్నాడని వాదించారు.[4] మరికొందరైతే దేవుడు లేడనీ వాదించారు, మరియు దేవుని ఉనికిని ప్రశ్నించారు.

విషయ సూచిక

[మార్చు] "దేవుడు" నిర్వచనం

దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు బమ్మెర పోతన రాసిన ఈ పద్యం చక్కని సమాధానం.అన్ని మతాలవారికీ సరిపోగలదు.

"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు;పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ;డనాదిమధ్యలయుడెవ్వడు;సర్వము దానయైన వా
డెవ్వడువాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".[పోతన భాగవతం: గజేంద్ర మోక్షం]

[మార్చు] దేవుని రూపం

మూడు వాదాలున్నాయి:

  • 1. రూపరహితుడు - నిర్గుణ నిరాకారుడు
  • 2. రూపరహితుడు - సాగుణ నిరాకారుడు
  • 3. సరూపుడు - సాగుణ సాకారుడు

[మార్చు] వివిధ సందర్భాలలో "దేవుడు" పదం వినియోగం

  • రాయైతేనేమిరా దేవుడు - హాయిగా ఉంటాడు జీవుడు - ఉన్నచోటే గోపురం ఉసురు లేని కాపురం - అన్నీఉన్న మహానుభావుడు-- వేటూరి
  • మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - ఆత్రేయ
  • దేవుడికేం హాయిగ ఉన్నాడు-ఈ మానవుడే బాధలుపడుతున్నాడు - శ్రీశ్రీ
  • పిల్లలూ దేవుడూ చల్లనివారే
  • రాయిరా దేవుడు - తాగితే ఊగడు - మైలవరపు గోపి
  • ఎంతో రసికుడు దేవుడు
  • మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు - దాశరధి

[మార్చు] వివిధ మతాలలో నమ్మకాలు

యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఏకేశ్వరుణ్ణి నమ్ముతారు. దేవుడిని యెహోవా, అల్లాహ్ అని సంబోధిస్తారు.

క్రైస్తవులు త్రితత్వాన్ని నమ్ముతారు (అనగా దేవుడు, పరిశుద్దాత్మ, క్రీస్తు). అరబ్ క్రైస్తవులు దేవున్ని అల్లాహ్ అందురు. "అల్లాహ్ అల్ ఆబా" అనగా "God the Father" అని, "ఐబ్న్ అల్లాహ్" అనగా "దేవుని పుత్రుడు" అని అర్థాలు ఉన్నయి. క్రీస్తు దేవుని బిడ్డ కనుక అరబ్ క్రైస్తవులు క్రీస్తుని ఇబ్న్ అల్లాహ్ అంటారు. యూదులు ముస్లింల లాగ ఏకైక దేవున్ని నమ్ముతారు (దేవుని విషయములొ యూదులు, ముస్లింలు మధ్య కూడా కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయి).

[మార్చు] దేవుడున్నాడా, లేడా?

ఇది ఒక సంక్లిస్టమైన ప్రశ్న.ఎందుకంటే ఇది ఈ ప్రశ్న ఉత్పన్నమైనపుడు మతపరమైన విశ్వాసాలతో ముడిపెట్టి చాలా మంది సమాధానం చెబుతూఉంటారు. కాని సైన్స్ ప్రకారం చూస్తే దేవుడి ఉనికి లేదా దైవత్వం కు సంబంధించి చర్చ ఎక్కడా చూడము.అంటే దేవుడు అనే పదం కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించినది మాత్రమే తప్ప శాస్త్రానికి( Science)సంబంధింనది కాదు.సైన్స్ ప్రకారం చూసినపుడు దేవుడు లేడనే సమాధానం వస్తుంది.కాని నూటికి తొంబై శాతం మంది తాము చదివిన శాస్త్రంకంటే మతాన్ని,మతపరమైన విశ్వాసాలను ఎక్కువగా నమ్మడం వలన "దేవుడు" ఉనికి మానవ సమాజంలో సజీవంగా ఉంది.కాబట్టి దేవుడు ఉన్నాడా?లేడా? అనే ప్రశ్నకు సమాధానం-మతపరంగా ఉన్నాడు.సైన్స్ ప్రకారం లేడు.కాని విశ్వాన్ని నడిపించే ఓ అద్రుశ్య శక్తి మాత్రం ఉంది.అదే COSMIC ENERGY

[మార్చు] ఒకే దేవుడా?

[మార్చు] వివిధ భక్తుల భావనలు

  • ఈశ్వర అల్లా తేరే నామ్ - మహాత్మా గాంధీ.

[మార్చు] దేవుడు ఆడా?మగా?

[మార్చు] వివిధ తెగల, మరియు జానపద నిర్వచనాలు

  • ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు.అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.
  • ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటారు.
  • "చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే

ఒక్కడైన ఆ పరమేశ్వరున కు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళ లో ప్రజలు ఎప్పుడో పాడారు.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. 1.0 1.1 Swinburne, R.G. "God" in Honderich, Ted. (ed)The Oxford Companion to Philosophy, Oxford University Press, 1995.
  2. 2.0 2.1 Edwards, Paul. "God and the philosophers" in Honderich, Ted. (ed)The Oxford Companion to Philosophy, Oxford University Press, 1995.
  3. అల్విన్ ప్లాటింగా,
  4. Plantinga, Alvin. "God, Arguments for the Existence of," Routledge Encyclopedia of Philosophy, Routledge, 2000.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు