అగ్ని

వికీపీడియా నుండి

దావానలం

అగ్ని లేదా అగ్గి (Fire) పంచభూతాలలో ఒకటి.

[మార్చు] రసాయన చర్య

అగ్ని జ్వాల ప్రారంభం కావడానికి ముఖ్యమైనవి మూడు: అగ్నిప్రేరక పదార్ధాలు, ఆక్సిజన్ మరియు కావలసినంత వేడి. దీనిని 'అగ్ని త్రిభుజం' అంటారు.

అగ్నికి సాధారణమైన కారణాలు:

అగ్ని త్రిభుజం.

అగ్ని పుట్టిన తర్వాత దానిద్వారా ఉత్పన్నమైన వేడి మూలంగా అది పరిసరాలకు వ్యాపిస్తుంది. ఇందుకు కావలసిన మూలపదార్ధము మరియు ఆక్సిజన్ తగినంతగా అందుతుండడం అవసరం.

అగ్నిని ఆర్పడానికి ఈ మూడు మూలపదార్ధాలని తొలగించడం ముఖ్యమైనది. అందరికీ తెలిసిన పద్ధతిలో అగ్ని మీద నీరు జల్లడం వల్ల అక్కడి వేడిని తగ్గించడం ముఖ్య ఉద్దేశం. కార్బన్ డై ఆక్సైడ్ వాడడం వల్ల ఆక్సిజన్ ను తొలగిస్తున్నాము.

[మార్చు] వర్గీకరణ

అగ్ని రకాలు యూరోపియన్ / ఆస్ట్రేలియన్ వర్గీకరణ అమెరికా వర్గీకరణ
కర్రలు, గుడ్డలు, రబ్బరు, కాగితం మరియు కొన్ని రకాల ప్లాస్టిక్ వంటి ఘనపదార్ధాల వల్ల కలిగే అగ్ని. తరగతి A తరగతి A
పెట్రోలు, కిరోసిన్, కొవ్వు మరియు ప్లాస్టిక వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని. తరగతి B తరగతి B
మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్, హైడ్రోజన్ వంటి వాయు పదార్ధాల వల్ల కలిగే అగ్ని. తరగతి C
సోడియమ్, పొటాషియమ్, మెగ్నీషియమ్ వంటి ఘన లోహాల వల్ల కలిగే అగ్ని. తరగతి D తరగతి D
A, B తరగతికి చెందిన ఘన, ద్రవ పదార్ధాల వల్ల, విద్యుత్ పరికరాలు, వైర్లు మరియు ఇతర విద్యుత్వాహకాల ప్రమేయం వల్ల కలిగే అగ్ని. తరగతి E తరగతి C
వంటల్లో వాడే కొవ్వు మరియు నూనె వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని. తరగతి F తరగతి K

[మార్చు] ఇవి కూడా చూడండి

"http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు