అగ్గిపుల్ల
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
అగ్గిపుల్ల (ఆంగ్లం Match) సాధారణంగా మనం ఇంటిలో ఏదైనా వెలిగించడానికి వాడతాము. దీనితో అగ్నిని తయారుచేస్తారు. ఇవి అగ్గిపెట్టెల రూపంలో దుకాణాలలో అమ్ముతారు. ఒక అగ్గిపెట్టెలో చాలా అగ్గిపుల్లలుంటాయి. దీనికి రెండు పక్కల వెలిగించడానికి ఉంటుంది. అగ్గిపుల్ల సాధారణంగా కర్రపుల్లకు ఒక చివర భాస్వరమునకు సంబంధించిన పదార్ధం అతికించి ఉంటుంది. ఈ చివరను అగ్గిపెట్టె పక్కనున్న ప్రదేశంలో రాపిడి కలిగించినప్పుడు అగ్గి పుట్టి కర్రపుల్ల అంటుకుంటుంది. అగ్గిపెట్టె లను దాచడం ఒకరకమైన హాబీ.
వీని దురుపయోగం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం మూలంగా వీటిని నిషిద్ధ పదార్ధాలుగా నిర్ణయించారు. అందువల్ల పిల్లలనుంచి వీటినుండి దూరంగా ఉంచాలి.
పూర్వం నుండి అగ్గి పుల్లలు పల్చని చెక్క తో తయారవుతున్నా ఇప్పుడిప్పుడే మైనం తోనూ, ప్లాస్టిక్ తోనూ తయారు చేస్తున్నారు. మొదట్లో రెండు అంగుళాల పొడవుతో వచ్చే పుల్లలనుండి ఇప్పుడు ఐదంగుళాల పొడవు వరకూ తయారు చేస్తున్నారు.
[మార్చు] చరిత్ర
భారతదేశంలో అగ్గిపుల్లలు తయారు చేయు మొదటి కర్మాగారము భారతీయుల ఆధ్వర్యంలో అహ్మదాబాదు నగరంలో స్థాపించారు.[1]
[మార్చు] ఇతరాలు
- దీపావళి పండుగలో ఒక ప్రత్యేకమైన అగ్గిపుల్లలు వాడతారు.
- సిగరెట్ కాల్చేవారు అగ్గిపెట్టెను విధిగా తమ వద్ద ఉంచుకొంటారు.
- అగ్గిపుల్లలతో పిల్లలు రకరకాల బొమ్మలు తయారు చేస్తారు.
- ఫైవ్ స్టార్ హోటళ్ళ లో పొడవైన అగ్గిపుల్లలు వాడటం ఒక ఫ్యాషన్.
[మార్చు] మూలాలు
- ↑ మామిడిపూడి వేంకట రంగయ్య రచించిన ఆంధ్రవిజ్ఞానకోశము, మొదటి సంపుటము, పుట:121
- Beaver, Patrick, (1985). The Match Makers: The story of Bryant & May. London: Henry Melland Limited. ISBN 0-907929-11-7.
- Emsley, John, (2000). The Shocking History of Phosphorus: A biography of the Devil's element. Basingstoke: Macmillan Publishing. ISBN 0-333-76638-5.
- Threlfall, Richard E., (1951). The story of 100 years of Phosphorus making: 1851 - 1951. Oldbury: Albright & Wilson Ltd.
- Oxford (1999). Concise Oxford Dictionary. Tenth Edition. Oxford: Oxford University Press.
- Steele, H. Thomas (1987). Close Cover Before Striking: The Golden Age of Matchbook Art. Abeville Press.