సిగరెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంకా వెలిగించబడని సిగరెట్లు.

సిగరెట్ అనేది పొగ త్రాగే కడ్డీ[1]. చిన్నగా తురమబడిన పొగాకును కాగితము ద్వారా తయారుచేయబడిన గొట్టంలో కూరి వీటిని తయారుచేస్తారు.[2] సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం అని నిరూపించబడింది. పొగాకులో ఉండే ప్రధానమైన నికోటిన్ అనే రసాయన పదార్థం వ్యసనానికి కారణమైన ఉత్ప్రేరకం.[3] ఈ అలవాటువల్ల చాలా రకాల కాన్సర్లు, హృద్రోగాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. గర్భవతులైన వారు పొగ త్రాగితే పుట్టే సంతానం లోపాలతో ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి.[4] [5] [6] సిగరెట్టు, చుట్ట - రెండూ పుగాకుతో చేసినవే. కాని చుట్టకంటే సిగరెట్టు ఇంకా చిన్నది. పుగాకు పొడిని కాగితంలో చుట్టి సిగరెట్లు తయారు చేస్తారు. చుట్టలు పూర్తి ఆకును చుట్టి చేస్తారు. తాజా పరిశోధనల్లో సిగరెట్ వల్ల నపుంసకత్వం సంభవిస్తుందని, ఈ నపుంసకత్వం తరతరాలకు సంక్రమించే అవకాశం ఉందని ఫలితాలను వెల్లడించారు.

మధ్య అమెరికాలో 9వ శతాబ్దం నాటికే పొగ త్రాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తుంది. మాయ నాగరికతలోను, అజ్టెక్ నాగరికతలోను మత సంబంధమైన కార్యక్రమలలో పొగాకు త్రాగేవారు. కరిబియన్, మెక్సికో, దక్షిణ అమెరికా ప్రాంతాలలో బాగా ముందుకాలంనుండి పొగ త్రాగే అలవాటు ఉండేది.[7] క్రిమియా యుద్ధం కాలంలో బ్రిటిష్ సైనికులు ఒట్టొమన్ టర్క్ సైనికులను అనుకరించి పొగ త్రాగడం మొదలుపెట్టారు.[8] తరువాత పొగ త్రాగే అలవాటు ఐరోపాలోను, ఇతర ఖండాలలోను విస్తరించింది.

సిగరెట్టులో భాగాలు.
1. ఫిల్టర్ - ఇది 95% సెల్యులోజ్ అసిటేట్‌తో తయారవుతుంది.
2. ఫిల్టర్‌ను కవర్ చేసే "టిప్పింగ్ పేపర్".
3. పుగాకు పొడిని కవర్ చేసే "రోలింగ్ పేపర్".
4. పుగాకు "బ్లెండ్".

మార్కెట్‌లో లభించే సిగరెట్లలో చూడడానికి కనిపించేవి - పుగాకు బ్లెండ్, చుట్టే సిగరెట్ పేపర్, ఆ పేపరును అతికించే పాలివినైల్ అసిటేట్ (PVA) జిగురు, చాలావాటిలో సెల్లులోజ్ అసిటేట్ ఆధారంగా తయారైన ఫిల్టర్.[9]. అయితే సిగరెట్టులో వాడే పుగాకు బ్లెండుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని కంపెనీల బ్లెండులలో 100పైగా పదార్ధాలు ఉండవచ్చును.[10]

రోజుకో సిగరేట్‌ తాగినా గుండెకు పోటే[మార్చు]

రోజుకొక సిగరెట్టే కాలుస్తున్నా రక్తనాళాలకు హాని చేస్తుందని తేలింది. ఒక్క సిగరెట్‌ తాగినా, అది రక్తనాళాలను గట్టి పడేలా చేసి గుండె జబ్బులకు గురి చేస్తుంది.రక్తనాళాలు గట్టిపడడం వలన గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. పొగ తాగే వారికన్నా, పొగాకును నమిలే వారిలో రక్తనాళాల గట్టిదనం తక్కువగా ఉన్నా, మొత్తానికి పొగాకు అలవాటు లేని వారికంటే ఎక్కువేనని తేలింది. (ఆంధ్రజ్యోతి 28.10.2009)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన బుడుగు హాస్య రచనలో బుడుగు ఇలా చెప్పాడు - అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడకు గుచ్చి కాలుస్తారు. సిగరెట్లు తెల్లగా ఉంటాయి. వీటిని నోటిలో గుచ్చి కాలుస్తారు.
  2. http://www.jeffreywigand.com/WHOFinal.pdf Wigand, MA. ADDITIVES, CIGARETTE DESIGN and TOBACCO PRODUCT REGULATION, A REPORT TO: WORLD HEALTH ORGANIZATION, TOBACCO FREE INITIATIVE, TOBACCO PRODUCT REGULATION GROUP, KOBE, JAPAN, 28 JUNE-2 JULY 2006
  3. [1]
  4. "Smoking While Pregnant Causes Finger, Toe Deformities". Science Daily.
  5. "List of health effects by CDC". Archived from the original on 2009-01-06. Retrieved 2007-12-18.
  6. "List of foods to avoid during pregnancy". Archived from the original on 2014-07-13. Retrieved 2014-07-19.
  7. Robicsek, Francis Smoke; Ritual Smoking in Central America pp. 30-37
  8. The Crimea
  9. Clean Virginia Waterways, Cigarette Butt Litter - Cigarette Filters Archived 2009-01-26 at the Wayback Machine, [[:en:Longwood University|]], Retrieved [[:en:October 31|]] 2006
  10. Philip Morris USA, Product Information -Cigarette ingredients Archived 2007-12-30 at the Wayback Machine, Retrieved March 5 2007

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సిగరెట్&oldid=3837118" నుండి వెలికితీశారు