2007
వికీపీడియా నుండి
2007 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 2004 2005 2006 - 2007 - 2008 2009 2010 |
| దశాబ్దాలు: | 1980లు 1990లు - 2000లు - 2010లు 2020లు |
| శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
[మార్చు] జనవరి
- జనవరి 1: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
- జనవరి 1: బల్గేరియా, రుమేనియాలు యూరోపియన్ యూనియన్ లోకి ప్రవేశించాయి.
- జనవరి 4: అమెరికా ప్రతినిధులసభ తొలి మహిళా స్పీకర్గా నాన్సీ పెలోసీ నియమించబడింది.
- జనవరి 10: హుగో చావెజ్ వెనిజులా అద్యక్షుడిగా రెండో సారి ప్రమాణస్వీకారం.
- జనవరి 11: ప్రపంచ వాణిజ్య సంస్థ 150వ సభ్యదేశంగా వియత్నాం ప్రవేశించింది.
- జనవరి 30: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ విస్టా మరియు ఆఫీస్ 2007 లను విడుదలచేసింది.
- ఫిబ్రవరి 4: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడిచి కొత్త రికార్డు సృష్టించింది.
[మార్చు] ఫిబ్రవరి
- ఫిబ్రవరి 16: చెచన్యా అద్యక్షుడిగా మాజీ వేర్పాటు ఉద్యమనేత రమజాన్ కాడిరోవ్ బాధ్యతలు చేపట్టాడు.
[మార్చు] మార్చి
- మార్చి 12: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.
[మార్చు] ఏప్రిల్
- ఏప్రిల్ 17: 2014 ఆసియా క్రీడలు నిర్వహణ బిడ్ను ఢిల్లీతో పోటీపడి దక్షిన కొరియాలోని ఇంచెయాన్ నగరం గెల్చుకుంది.
[మార్చు] మే
- మే 16: ఫ్రాన్సు అద్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.
[మార్చు] జూన్
- జూన్ 10: కెనెడియన్ గ్రాండ్ ప్రిక్స్ను లూయీస్ హామిల్టన్ గెలుచుకున్నాడు.
- జూన్ 27: యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.
[మార్చు] జూలై
- జూలై 4: 50 నక్షత్రాల అమెరికా జాతీయ పతాకం అత్యధిక కాలంపాటు చెలామణిలో ఉండి రికార్డు సృష్టించింది. 1912 నుంచి 1959 వరకు చెలామణిలో ఉన్న 48 నక్షత్రాల పతాకం రికార్డు ఛేధించబడింది.
- జూలై 4: 2014 శీతాకాలపు ఒలింపిక్ క్రీడా వేదికగా సోచి నగరం ఎంపైకైంది.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని చేపట్టింది.
- జూలై 28: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి,ముదిగొండ లొ ఏడుగురు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
[మార్చు] ఆగష్టు
[మార్చు] సెప్టెంబర్
- సెప్టెంబర్ 7: రగ్బీ ప్రపంచ కప్-2007 ఫ్రాన్సులో ప్రారంభమైనది.
- సెప్టెంబర్ 12: రష్యా ప్రధానమంత్రి మైకేల్ ప్రాద్కోవ్ మరియు మొత్తం మంత్రిమండలి రాజీనామా సమర్పించింది.
- సెప్టెంబర్ 13: బుర్జ్ దుబాయ్ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన కట్టడంగా రికార్డు సృష్టించింది. టొరంటోలోని సిఎన్ టవర్ రికార్డు ఛేధించబడింది.
- సెప్టెంబర్ 14: రష్యా నూతన ప్రధానమంత్రిగా విక్టర్ జుబ్కోవ్ నియామకం.
- సెప్టెంబర్ 24: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్యాన్ పై విజయం సాధించింది.
[మార్చు] అక్టోబర్
[మార్చు] నవంబర్
- నవంబర్ 24: ఆస్ట్రేలియా ఎన్నికలలో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ విజయం సాధించింది.
[మార్చు] డిసెంబర్
- డిసెంబర్ 3: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
- డిసెంబర్ 11: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 20,000 మైలురాయిని దాటింది.
- డిసెంబర్ 21: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న రాణిగా రికార్డు సృష్టించించి. దీనితో విక్టోరియా రాణి రికార్డు ఛేధించబడింది.
- డిసెంబర్ 25: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం.
- డిసెంబర్ 30: హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.
- డిసెంబర్ 30: కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరణ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించాడు.
[మార్చు] జననాలు
[మార్చు] మరణాలు
- జనవరి 1: ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత డూండీ
- జనవరి 2: ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య
- జనవరి 4: ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు కోరాడ నరసింహారావు
- ఏప్రిల్ 7: ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు
- ఏప్రిల్ 13: ప్రసిద్ధ సినిమా నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి
- ఏప్రిల్ 13: ప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి
- జూలై 8: భారత మాజీ ప్రధానమంత్రి, చంద్రశేఖర్
- సెప్టెంబర్ 28: పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు.
- నవంబర్ 19: ప్రసిద్ధ రచయిత పులికంటి కృష్ణారెడ్డి
- డిసెంబర్ 27: పాకిస్తాన్ మాజి ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో.
[మార్చు] పురస్కారాలు
|
||||||||