టొరంటో
టొరంటొ పట్టణం కెనడా దేశంలోని పెద్ద ప్రధాన మయిన భిన్న జాతులు సంస్కృ తులు కలసి నివసించే అందమయిన పట్టణం.
| టొరంటొ | |||
|
|||
| ముద్దు పేరు: T.O., Hogtown, The Big Smoke, Toronto the Good, T-Dot | |||
| నినాదం: Diversity Our Strength | |||
| Location of Toronto and its census metropolitan area in the province of ఓంటారియో | |||
| Coordinates: | |||
|---|---|---|---|
| దేశం | |||
| ప్రావిన్సు | మూస:Country data ఓంటారియో ఓంటారియో | ||
| జిల్లాలు | ఈస్ట్ యార్క్ ఇటోబికోక్ నార్త్ యార్క్ పాత టొరంటొ స్కార్ బరో యార్క్ |
||
| Established | ఆగష్టు 27, 1793 | ||
| పురపాలక సంఘం | మార్చి 6, 1834 | ||
| Amalgamated | జనవరి 1, 1998 | ||
| ప్రభుత్వము | |||
| - మేయర్ | డేవిడ్ మిల్లెర్ | ||
| - Council | టొరంటొ సిటీ కౌన్సిల్ | ||
| - పార్లమెంటు సభ్యుడు (కెనడా) |
పార్లమెంటు సభ్యుల జాబితా
|
||
| - MPPs |
List of MPPs
|
||
| వైశాల్యము [1][2] | |||
| - City | 630 km² (243.2 sq mi) | ||
| - పట్టణ | 1,749 km² (675.3 sq mi) | ||
| - మెట్రో | 7,125 km² (2,751 sq mi) | ||
| ఎత్తు | 76 m (249 ft) | ||
| జనాభా (2006)[1][2] | |||
| - City | 25,03,281 | ||
| - సాంద్రత | 3,972/km2 (10,287.4/sq mi) | ||
| - పట్టణ | 4 | ||
| - మెట్రో | 5 | ||
| - Demonym | |||
| కాలాంశం | EST (UTC-5) | ||
| - Summer (DST) | EDT (UTC-4) | ||
| Postal code span | M | ||
| Area code(s) | (416) and (647) | ||
| NTS Map | 030M11 | ||
| GNBC Code | FEUZB | ||
| వెబ్‌సైటు: toronto.ca | |||
విషయ సూచిక |
విశేషాలు[మార్చు]
ప్రపంచం లోని ఏ ఇతర పట్టణం లో ఉండనటువంటి భిన్న జాతులు సంస్కృతులు కలిగిన వివిధ దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.
చరిత్ర[మార్చు]
కి.పూ 1500 ఇక్కడ ఇరాక్యూ ఆదివాసులు నివసించినట్లు అంచనా.వారే ఈ ప్రదేశానికి ట్కొరంటో అనే పేరుతో పిలిచేవారని వారి భాషలో ట్కొరంటో అంటే వర్షాధార అరణ్యాలు.అవి ప్రస్తుతం సిమ్‌క్యూ సరసు ఉత్తర భాగాన్ని సూచిస్తుంది.తరవాత కాలంలో ఇరాక్యూ తెగలను తరిమికొట్టి ఈ ప్రదేశాన్ని హరాన్ తెగలు ఆక్రమించికున్నారు.వీరు సిమ్‌క్యూ సరసు ఉత్తర భాగంలో కోరల్ చేపలకోసం నాటిన చెట్లు ఉన్న ప్రదేశం నుండి ఒంటారియా సరసు మరియు సిమ్‌క్యూ సరసు లను కలుపుతూ చెట్లతో కూడిన భూమార్గం ఉంది.ఈ ప్రదేశాన్ని టొరంటో క్యారీయింగ్ - ప్లేస్ ట్రైల్ అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.ఇలా రెండు జలాశయాలను కలిపే మార్గాలను ఆంగ్లంలో పోర్టేజ్ రూట్ అంటారు. యురేపియన్లు ఇక్కడ ప్రవేశించే సమయానికి ఈ ప్రదేశం హరాన్ తెగల స్వాధీనంలో ఉంది.
1750 లో ప్రస్తుత ఎగ్జిబిషన్ గ్రాండ్‌లో ఫ్రెంచ్‌దేశ వ్యాపారులు ఒక రేవుని నిర్మించారు కాని 1759 లో ఈ రేవును ఉపయోగించకుండా వదిలి వేసారు.అమెరికన్ రివల్యూషనరీ వార్ కాలంలో అమెరికా విశ్వాసులైన బ్రిటన్‌దేశీయులు అప్పటికి ఎలాంటి ఒప్పందం జరగని ఒంటారియా సరసు ఉత్తర భాగంలో ప్రవాహంలా వచ్చి చేరారు.1987లో న్యూక్రెడిట్ కు చెందిన మసిసాగాస్ తెగల నుండి ఈ ప్రదేశాన్ని కొనుగోలు చేయటానికి సాగించిన బేరాలు 1805 నాటికి ముగింపుకు వచ్చి 2,50,000 ఎకరాల టొరంటో ప్రదేశం బ్రిటన్ స్వాధీనంలోకి వచ్చింది.
1793 లో గవర్నర్ సిమ్‌కోర్ ఇక్కడ నిర్మించిన పట్టణానికి డ్యూక్ ఆఫ్ యోర్క్అండ్ ఆల్బనీ ప్రభువు జ్ఞాపకార్ధం ప్రిన్స్ ఫెడరిక్ (బ్రీటిష్ రాజకుమారుడు)యోర్క్ అని నామకరణం చేసాడు.సిమ్‌కోర్ చే అప్పర్ కెనడా రాజధానిని నెవార్క్ నుండి యోర్క్ కు మార్చబడింది.ఈ ప్రదేశంలో ఉంటే అమెరికన్ల దాడి నుండి కొంచం తగ్గుతుందని విశ్వసించారు.పట్టణ సహజ సిద్దమైన రేవు ప్రదేశంలో ఫోర్ట్ యార్క్ రేవు నిర్మాణం జరిగింది.
వార్ ఆఫ్ 1812 లో భాగంగా బాటిల్ ఆఫ్ యోర్క్ ముగింపులో 1831లో ఈ పట్టణం అమెరికన్ సేనల వశమై వారిచే దోపిడీకి గురైంది.ఈ పట్టణం అమరికన్ సేనలు జాన్ స్ట్రేచర్ నాయకత్వంలో రాయబారం జరిపి స్వాధీనపరచుకున్నారు.ఐదు రోజులపాటు జరిగిన ఆక్రమణలో అమెరికన్ సేనలు ఫోర్ట్ యార్క్ ను ద్వంశం చేసి పార్లమెంట్ భవనాన్ని అగ్నికి ఆహుతి చేశారు.
1834 మార్చ్ 6న టొరంటొ నగరంగా గుర్తింపు పొంది నగరపాలిత సంస్థ పాలనలోకి మారింది.ఈ నగరం పేరు తిరిగి పూర్వపు పేరైన టొరంటొగా మార్చబడింది.ప్రారంభంలో ఈ నగర జనాభా కొన్ని అమెరికన్ రాష్ట్రాల నుండి పారిపోయివచ్చిన బానిసలైన ఆఫ్రికన్ అమెరికన్లతో చేర్చి 9,000. 1834 నుండి అప్పర్ కెనడాలో బానిసత్వం రద్దు చేయబడింది.సంస్కరణలకు రూపకల్పన చేసిన రాజకీయనాయకుడు విలియమ్ లైన్ మెకన్‌జీ నగరానికి మొదటి మేయర్ అయ్యాడు.
19వ శతాబ్ధపు మద్యకాలంలో నగర జనాభా అనూహ్యంగా అభివృద్ధి చెందింది.1846 మరియు 1849లలో ఐరిష్లో ఏర్పడిన దుర్భర క్షామం కారణంగా ఐరిష్ ప్రజావాహిని ఇక్కడకు వచ్చి స్థిరపడసాగారు.వారిలో కాధలిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు.1851 లో నగరంలో పెద్దసంఖ్యలో ఉన్న సంప్రదాయక జాతి ఐరిష్ పూర్వికంగా ఉన్న వాళ్ళే.నగరంలో మిగిలి ఉన్న స్కాటిష్ మరియు ఆంగ్లేయులు ఐరిష్ మరియు స్వల్ప సంఖ్యాకులైన ప్రొటెస్టెంట్ వలస ప్రజలను ఆనందంగా దేశంలోకి ఆహ్వానించారు.
టొరంటొ రెండు సార్లు స్వల్పకాలికంగా కెనడాప్రొవిన్స్‌కు రాజధానిగా ఉంది.అధికారపూర్వకంగా ఒంటారియా ప్రొవిన్స్ ఏర్పడిన తరవాత 1867 నుండి ఒంటారియా ప్రోవిన్స్(రాష్ట్రం)కు రాజధాని అయింది.రాజధాని అంతస్తు కారణంగా క్వీన్స్ పార్క్‌లో అసెంబ్లీ హాల్ ,గవర్నమెంట్ హౌస్,రాజ ప్రతినిధి గృహం వైస్ -రీగల్ ఈ నగరంలో చోటు చేసుకున్నాయి.
19వ శతాబ్ధంలో అధునాతన మురుగునీటి కాల్వల నిర్మాణం జరిగింది.వీధులు గ్యాస్ దీపాల వెలుగులను సంతరించుకున్నాయి.దూరప్రాంతాలకు రైలు మార్గాలు నిర్మించబడ్డాయి.1854లో టొరొంటొ మరియు అప్పర్ గ్రేట్ లేక్‌లను కలుపుతూ రై మార్గం నిర్మించబడింది.యూనియన్ స్టేషన్ నిర్మాణంతో గ్రాండ్ ట్రంక్ రైల్వే మరియు నార్తన్ రైల్వే ఆఫ్ కెనడా రైలు మార్గాలు అనుసంధానించబడ్డాయి.రైలు ప్రయాణాలు సుగమంకావడంతో వలసదారుల సంఖ్య అధికం కావడం వ్యాపారం అభివృద్ధి కావడంతో టొరంటొ కెనడా ముఖద్వారంగా సర్వతోముఖాభివృద్ధి చెందింది.ఒంటారియా స్టీమర్లూ మరియు స్కూనర్లూ రేవుకు రావడంతో లోతట్టు ఊత్తర అమెరికా ఖడంతో ప్రపంచానికి సంబంధాలు మెరుగు పడ్డాయి.1891లో గుర్రాలతో లాగబడే కార్లు మోట్ర్ కార్లకు దారి ఇచ్చాయి.1921టొరంటొ రైల్వే కంపెనీకు కెనడా ప్రభుత్వం నుండి ట్రాన్సిస్ట్ ఫ్రాంచిస్ అనుమతి లభించటంతో ప్రభుత్వ రైల్వే సంస్థ అబివృద్ధి చెందింది.ఇది తరవాత టొరంటొ ట్రాంసిస్ట్ కంపెనీగా నామాంతరం చెందింది.ప్రస్తుతం ఈ సంస్థ ఉత్తర అమెరికా ఖండంలో ప్రయాణీకుల సంఖ్యలో మూడవ స్థానంలో ఉంది.
1954లో టొరంటోకు మహానగర హోదా లభించింది.యుద్ధానంతర మార్పుల వలన నగరపరిసరాలు విపరీత అభివృద్ధి సాధించాయి భూమిని సద్వినియోగం చేయడంలో ఊహాత్మకమైన మార్పులు సేవలందించడంలో సహకారం నగరాన్ని శక్తివంతంగా చేసాయి.మహానగర ప్రభుత్వం సేవలు నగర పరిసరాలను దాటి విస్తరించాయి.1967 6 మున్సిపాలిటీలు టొరంటో కార్పొరేషన్లో కలిశాయి.1968లో అధికారపూర్వకంగా ఒకే పాలనలోకి వచ్చాయి.
1904లో నగరంలోని డౌన్‌టౌన్ తీవ్ర అగ్ని ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో డౌన్‌టౌన్ చాలాభాగం కాలి బూడిదైంది.ఈ ప్రమాదానికిది గ్రేట్ టొరంటో ఫైర్ ఆఫ్ 1904 గా నామకరణం చేసారు.ఈ ప్రమాదం అగ్నిమాపకదళం నాణ్యతాపరంగానూ సిబ్బందిపరంగానూ అభివృద్ధి చెందటానికి దోహద పడింది.నగరం ఈ ప్రమాదం నుండి త్వరగా కోలుకొని పునర్నిర్మించబడింది.
19 మరియు 20 వశతాబ్ధంలో నగరానికి నూతన వలసదారులు వచ్చి స్థిరపడ సాగారు.ప్రత్యేకంగా తూర్పు ఐరోపా దేశాలైన జర్మన్లు,ఈటాలియన్లు మరియు యూదులు నుండి అధికంగా ఉన్నారు.ఆతరవాత వీరిని అనుసరించి చైనీయులు,రష్యన్లు,పోలండ్ దేశీయులు మరియు తూర్పు ఐరోపా వాసులు ఇక్కడ స్థిరపడసాగారు.వీరిలో అధికులు జనసాంద్రత అధికంగా కలిగిన మురికి వాడలలో నివసించసాగారు.ప్రస్తుతం నగరపరిసరాలలో బే స్ట్రీట్ లో మద్యభాగంలో ఉన్న ఈ ప్రదేశం వ్యాపారకూడలిగా అభివృద్ధి చెందింది.1934 నాటికి టొరంటో స్టాక్ ఎక్ష్చేంజ్ దేశంలో ప్రధమ స్థానానికి చేరింది.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం యుద్ధంవలన చిన్నాభిన్నమైన యూరప్ దేశాల నుండి వచ్చే శరణార్ధులు ఉపాధిని అన్వేషిస్తూ వచ్చి చేరే చైనీయులు నగరానికి వచ్చి నిర్మాణ రంగంలో ఉపాధి వెతుక్కున్నారు.ప్రత్యేకంగా ఇటలీ మరియు పోర్చుగల్ వాసులు నిర్మాణరంగంలోధికంగా పనిచేయసాగారు తరవాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలవాసులు ఇక్కడకు వలస వచ్చి చేరడంతో 1951 నాటికి నగర జనాభా 10 లక్షలకు చేరింది.నగరపరిసరాలలో బృహత్తర అబివృద్ధి పధకాలు చేపట్టారు.1971 నాటికంతా జనసంఖ్య 20 లక్షలకు చేరింది.1980 నాటికి టొరంటో జనసంఖ్యలోనూ ఆర్ధికకేంద్రంగానూ మోట్రియల్ నగరాన్ని అధిగమించింది.అదేసమయంలో క్యూబెక్ సావరనిటీ మూవ్‌మెంట్ కారణంగా ఏర్పడిన అనిస్చితి కారణంగా మోంట్రియల్ నుండి జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను టొరంటో మరియు దేశంలోని ఇతర పడమటి నగరాలకు మారుకున్నాయి.
భౌగోళిక స్వరూపం[మార్చు]
టొరంటో నగరం మొత్తం వైశాల్యం 630 చదరపు కిలోమీటర్లు.ఉత్తర మరియు దక్షిణ భాగం 21 కిలోమీటర్ల పొడవు,తూర్పు మరియు పడమర భాగాలు 43 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.ఒంటారియా ఈశాన్య భాగంలో 46 కిలోమీటర్ల పొడవున జలతీరం ఉంది.నగరానికి దక్షిణంలో ఒంటారియా సరసు,పడమట ఎటోబైకోక్ క్రీక్(క్రీక్ అంటే ఆంగ్లంలో జలపాతం) మరియు హైవే 427 రహదారి,ఉత్తరంలో స్టీల్స్ అవెన్యూ తూర్పులో రోగ్ నది సరిహద్దులుగా ఉన్నాయి.
టొరంటో నగరం రెండు నదుల మద్య అందంగా పొదగబడింది.పడమట హంబర్ నది డౌన్‌టౌన్‌కు తూర్పున డాన్ నది .ఒంటారియా సరసులోని చిన్న చిన్న దీవుల మద్య సహసిద్ధంగా ఏర్పడిన రేవు.ఉత్తర భాగం నుండి సరసు వైపు ప్రవహించే నదులు సెలఏళ్ళ జలం వలన సశ్యశ్యామలంగా దట్టంగా పెరిగిన వర్షాధార అరణ్యాలు.ఇవి తయారుచేసిన ఉద్యానవనాలు,విహార ప్రదేశాలు.
జనభా[మార్చు]
2006జనసంఖ్య గణాంకాలననుసరించి నగర జనసంఖ్య 25,03,281.టొరంటో కెనడాలో అతిపెద్ద నగరం అభివృద్ధి చెందింది.జనసంఖ్యలో ఉత్తర అమెరికా నగరాలలోయిదవ స్థానానికి చేరుకుంది.నగర ననాభా 1996 నుండి 2001 వరకు 4%(96,073 నివాసులు),2001నుండి 2006ల (21,787 నివాసులు)వరకు 1% అభివృద్ధి చెందింది.వీరిలో 14 సంవత్సరాలకు లోబడిన వారు 17.5%,65 సంవత్సరాలకు పైబడిన వారు 13.6%.సరాసరి వివాహ వయసు 36.9%.విదేశాలలో జన్మించినవారి సంఖ్య 49.9%.
అల్పసంఖ్య జాతులు అధికంగా నివసిస్తున్న వారి సంఖ్య టొరంటో నగరంలో అధికం విరి సంఖ్య జన సంఖ్యలో 49.9%.యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పరిశీలనలో విదేశీయులు అధికంగా నివసిస్తున్న నగరాలలో ఉత్తర అమెరికాలో టొరంటో నగరం ఫ్లోరిడా ,మైమీ తరవాత రెండవ స్థానంలో ఉంది.మైమీ జనాభాలో విదేశీయులలో క్యూబాకు చెందిన వారు లాటిన్ అమెరికాకు చెందిన వారూ అధికం.కానీ టొరంటో నగరంలో ఏఒక్క దేశానికి చెందిన వారు కానీ జాతికి చెందిన వారు కానీ ఐక్కడ స్థిరపడిన ఐరోపియన్లను అధిగమించలేదు.టొరంటో నగరంలో ప్రపంచంలో అన్ని నగరాలకంటే విబ్భిన్న జాతయత అధికమని అంచనా.
టొరంటో జనసంఖ్యలో క్రిస్టియన్లు సంఖ్య అధిం . వీరిలో కాథలిక్కులు సంఖ్య 31,1%,ప్రొటెస్టెంట్లు సంఖ్య 21.1%,క్రిస్టియన్ ఆర్థడాక్స్ సంఖ్య 4.8% ,కోపిక్ ఆర్థడాక్స్ సంఖ్య 0.2 మరియు ఇతర క్రిస్టియన్ల సంఖ్య 3.9%.నగరంలోని ఇతర మతస్థులు ముస్లిముల సంఖ్య 6.7%,హిందువులు 4.2%,బౌద్ధులు 2.7%,సిక్కులు 0.9%,ఇతర తూర్పు దేశీయ మతస్థులు 0.2%,.ఏ మతానికి చెందని వారుగా చెప్పుకున్న వారు 18.7%.
నగరంలో అత్యధికులు మాట్లాడే భాష ఆంగ్లం.అనేక ఇతర భాషలు ప్రజల మద్యలో వాడుకలో ఉన్నాయి.వాటిలో ఫ్రెంచ్, ఇటాలియన్, చైనీస్, స్పానిష్,పోర్చ్‌గీస్,పంజాబీ తాగ్‌లాగ్ మరియు హిందీ భాషలు వాడుకలో ఉన్నాయి.చైనీస్ రెండవ స్థానంలోనూ ఇటాలియన్ మూడవ స్థానంలోనూ ఉన్నాయి.ఈ కారణంగా నగర అత్యవసర సేవా సంస్థ (9-1-1)150 భాషలు మాట్లాడే వారిని ఉద్యోగాలలో ఉంచి సేవలందిస్తుంది.
ప్రభుత్వము[మార్చు]
టొరంటో నగరం మేయర్-కౌన్సిల్ సిస్టమ్ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్న సింగిల్-టైర్ మున్సిపాలిటీ.నగర మేయర్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.నగర పాలనా 44 కౌనిలర్లచే నిర్వహించబడుతుంది.నగరాన్ని వార్డులుగా విభజించి పాలనా వ్యవహారాలు నడుపుతుంటారు.మేయర్ మరియు సభ్యులు 4 సంవత్సరాలకాలం పాలనా భాద్యతలు స్వీకరిస్తారు.వీరు ఎన్నికలలో పాల్గొనడానికి ఎటువంటి పరిమితులు ఉండవు.
నగర కౌన్సిల్‌ను ఏడు కమిటీలుగా విభజించి ఒక్కో విభాగానికి ఒక చైర్ ఒక వైస్ చైర్ నలుగురు కౌన్సిల్ సభ్యులు ఉంటారు.చైర్ సభ్యులను మేయర్ ప్రతిపాదిస్తాడు.మిగిలిన సభ్యులు సిటీ కౌన్సిల్‌చే నియమించబడతారు.ఒక్కొక్క కమిటీ సభ్యులతో నిర్వహణా కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.
సిటీ కౌన్సిల్ పరిధిలో 40 సబ్‌కమిటీలు,అడ్వైసరీ కమిటీ మరియు రౌండ్ టేబుల్స్ ఉంటాయి.వీటిలో చిటీ కౌన్సిల్ సభ్యులు మరియు స్వచ్చంద సేవకులు పనిచేస్తారు.అదనంగా నగరంలో నాలుగు కమ్యూనిటీ కౌన్సిల్స్ పనిచేస్తుంటాయి.వీరు ప్రాంతీయ విషయాలను సిటీ కౌన్సిల్‌కు చేరవేసి కావలసిన అనధికార ప్రతిపాదనలు చేస్తుంటారు.ఒక్కొక్క సిటీ కౌన్సిల్ కమ్యూనిటీ కౌన్సిల్ సభ్యుడుగా సేవలందిస్తాడు.
2006టొరంటో నిర్వహణా ప్రణాళిక వ్యయం 6 బిలియన్ల కెనడియన్ డాలర్లు.నగరానికి అధికంగా ఒంటారియా ప్రభుత్వం నిధులన మంజూరు చేస్తుంది అదనంగా టొరంటో నగరం ఆదాయపు పన్ను మరి ఇతర ఆదాయం ఉంటాయి.
నేరము[మార్చు]
టొరంటో నగరంలో నేరాల శాతం స్వల్పమే.ఉత్తర అమెరికాలో ఈ నగరం సురక్షితమైనదిగా గుర్తింప బడింది.1999లో గృహాంతర్గత హత్యలు 1,00,000 మందిలో 1.9 గా నమోదైంది.దోపిడీల సంఖ్య 1,00,000 మందికి 115,1 గా నమోదైంది.మొత్తం నేరాలసంఖ్య 1,00,000 మందికి 48.కారు దొంగతనాలు ఎక్కువే అయినా కెనడా నగరాలతో పోల్చినట్లైతే ఈ నగరంలో అధికం కాదు.టొరంటో పోలీస్ తుపాకీ కాల్పులు గ్యాంగ్ మరియు అల్పజాతియుల మద్య వైరాలు నమోదు చేసింది.
టొరంటో నగరం 1991లో అత్యధిక గృహాంతర్గత హత్యలను(89) నమోదు చేసింది.ఇది ఒక 1,00,000 మందికి 3.9.టొరటో మాద్యమం 2005 ను ఇయర్ ఆఫ్ ది గన్ గా వర్ణించింది ఆ సంవత్సరంలో నమోదైన 80 హత్యలలో 52 తుపాకీకి సంబందించినవే కావడం ఇందుకు కారణం.2006 నాటికి గృహాంతర్గత హత్యల సంఖ్య 69కి తగ్గింది.అదే సంవత్సరం తుపాకీ సంబంధిత నేరాల వలన బాధ పడినవారి సంఖ్య 2,000. ఇది దేశంలో జరిగిన వాటిలో నాల్గవభాగం.2007లో 84 హత్యలు నమోదుకాగా వాటిలో షుమారు సగం పైగా తుపాకికి సంబంధించినవే.గ్యాం సంబధిత నేరాలు 1997 మరియు 2005ల మద్య అధికం అయ్యాయి.ఈ సమయంలో 300 పైగానే హత్యలు నమోదైయ్యాయి.ఫలితంగా ఒంటారియా ప్రభుత్వం తుపాకీ ఉపయోగంపై నిషేధించాలని ఉవ్యూహాత్మక ప్రయత్నాలు చేపట్టింది.
విద్య[మార్చు]
టొరంటో అనేక ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి.1827లో ఒంటారియో ప్రభుత్వ విశ్వవిద్యాలయం యూనివర్శిటీ ఆఫ్ టొరంటో ప్రస్థుతం ప్రధమ స్థానంలో ఉన్న పరిశోధనా సంస్థ.ఈ విశ్వవిద్యాలయం బయోమెడికల్ పరిశోధనలలో అంతర్జాతీయ గుర్తింపు పొందింది.ఈ విస్వవిద్యాలయంలో ఉన్న గ్రంధాలయం అమెరికాలో మూడవ స్థానంలో ఉంది.టొరంటో ఉత్తర సరిహద్దులలో హార్వర్డ్ యూనివర్శిటీ,యేల్ యూనివర్శిటీ మరియు యోర్క్ యూనివర్శిటీ లు ఉన్నాయి.ఇవి కాక నగరంలో రియర్‌సన్ యూనివర్శిటీ,ఒంటారియో కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్స్ మరియు ది యూనివర్శిటీ ఆఫ్ గల్ఫ్-హంబర్ లు ఉన్నాయి.
నగరంలో డిప్లొమా చదువులనందించే కాలేజ్‌లు నాలుగు ఉన్నాయి.అవి వరసగా సెనేగా కాలేజ్,హంబర్ కాలేజ్ ,సెంటెనియల్ కాలేజ్ మరియు జార్జ్ బ్రౌన్ కాలేజ్.ఓష్వాలో ఉన్న ఫ్రాంకోఫోన్ కాలేజ్ బోరియల్ సాధారణంగా గ్రేటర్ టొరంటోలోని భావిస్తారు.వీటితో చేరి డర్‌హమ్ కాలేజ్ ,ది న్యూ యూనివర్శిటీ ఆఫ్ ఒంటారియో ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు పీల్ రీజియన్ లో ఉన్న షెరిడన్ కాలేజ్ మరియు యూనివర్శిటీ ఆఫ్ టొరంటో కాంపస్‌లు ఉన్నాయి.
టొరంటో నగర డౌన్ టౌన్‌లో రాయల్ కన్సర్వేటరీ ఆఫ్ మ్యూజిక్ ఉంది.ఇందులో గుర్తింపు పొందిన సంగీత పాఠశాల ది గ్లెన్ గ్లౌడ్ స్కూల్ కూడా ఒక భాగమే.నార్మన్ జ్యూసన్ చే స్థాపించబడిన కెనడియన్ ఫిల్మ్ సెంటర్ లో చలన చిత్ర,దూరదర్శన్ మరియు మీడియా రంగాలలో శిక్షణ ఇస్తారు. టిండేల్ యూనివర్శిటీ కాలేజ్ అండ్ సెమినరీ గుర్తింపు పొందిన క్రిస్టియన్ ఉఉనత కళాశాల.
నగరంలో ది టొరంటో డిస్ట్రిక్ స్కూల్ బోర్డ్ ఆధ్వర్యంలో 558 పాఠశాలలు నడుస్తుంటాయి.వాటిలో 451 ప్రాధమిక పాఠశాలలు 102 మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి.టొరంటో నగర పాఠశాలల సంస్థలలో ఇది ప్రధమ స్థానంలో ఉంది.ది టొరంటో కాథలిక్ డిస్ట్రిక్ స్కూల్ బోర్డ్ ఆధ్వర్యంలో రోమన్ కాథలిక్ పాఠశాలలు నడుస్తాయి.గ్రీన్ వుడ్ కాలేజ్ స్కూల్,అప్పర్ కెనడా కాలేజ్,క్రిసెంట్ స్కూల్'టొరొంటో ఫ్రెంచ్ స్కూల్,హావర్గల్ కాలేజ్,బ్రిటన్ స్ట్రాచన్ స్కూల్,బ్రాంక్‌సమ్ హాల్ మరియు సెయింట్ మైకేల్ కాలేజ్ స్కూల్ ఉన్నాయి.
టొరొటో నగర ప్రభుత్వ గ్రంధాలయం 1.1 కోటి గ్రంధాలు కలిగి 99 శాఖలు కలిగి కెనడాలో ప్రధమ స్థానంలో ఉన్న గ్రంధాలయం.
ఆరోగ్యం[మార్చు]
టొరంటో నగరంలో 20 ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి.
- హాస్పిటల్ ఫర్ సిక్ చిల్డ్రెన్.
- మౌంట్ సినయ్ హాస్పిటల్.
- సెయింట్ మైకేల్స్ హాస్పిటల్.
- నార్త్ యోర్క్ జనరల్ హాస్పిటల్.
- టొరంటో జనరల్ హాస్పిటల్.
- టొరంటో వెస్ట్రన్ హాస్పిటల్.
- సన్నీ బ్రూక్ హెల్త్ సైన్సెస్ సెంటర్.
- సెంటర్ ఫర్ అబ్డిక్షన్ అండ్ మెంటల్ హెల్త్ సెంటర్.
- ప్రిన్సెస్ మార్గరేట్ హాస్పిటల్.
- యూనివర్శిటీ ఆఫ్ టొరొటో ఫాకల్టీ ఆఫ్ మెడిసన్.
టొరంటో డిస్కవరీ డిస్ట్రిక్ట్ బయోమెడిసన్ పరిశోధనలకు కేంద్రం.ఇది 2.5 చదరపు కిలోమీటర్ల (620 చదరపు ఎకరాలు)పరిధిలో విస్తరించి ఉంది.వైద్య సంబంధిత విద్యలనేకం అక్కడ చదువుకునే సదుపాయం ఉంది.ఇది కాక నగరంలో మెక్ సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసన్ విధ్యాసంస్థ ఉంది.
ప్రయాణ వసతులు[మార్చు]
టొరొటో నగరంలో పనిచేస్తున్న టొరంటో ట్రాన్సిస్ట్ కమీషన్ (TTC) అమెరికాలోని న్యూయార్క్ సిటీ ట్రాన్సిస్ట్ మరియు మెక్సికో సిటీ మెట్రో తరతి స్థానంలో ఉంది.టి టి సి నగరంలో ప్రయాణ సౌకర్యాలను సమకూరుస్తుంది.టి టి సి ప్రభుత్వ ట్రాన్స్‌పోర్ట్ సేవలకు సబ్‌వే సిస్టమ్ ాత్యంత సహాయకారిగా ఉంది.టి టి సి విస్తారంగా బస్సులు,స్టీర్ కార్లను నడుపుతూ ఉత్తమ సేవలందిస్తుంది.
ఒంటారియో ప్రభుత్వం కూడా జీ ఓ పేరుతో టొరంటో నగరంలోని ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు బస్సు మరియు రైలు సౌకర్యాలను సమర్ధవంతంగా అందిస్తుంది.జీ ఓ ఏడు రైలు మార్గాలలో 38 రైళ్ళను 179 సార్లు నడుపుతూ అటూ ఇటూ 1,60,000 చేరవేస్తుంది.
కెనడా నిర్విరామ విమానాశ్రయమైన టొరొటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Population and dwelling counts, for Canada, census metropolitan areas, census agglomerations and census subdivisions (municipalities), 2006 and 2001 censuses - 100% data". Statistics Canada, 2006 Census of Population. 2007-03-13. Retrieved 2007-03-19.
- ↑ 2.0 2.1 "Population and dwelling counts, for urban areas, 2006 and 2001 censuses - 100% data". Statistics Canada, 2006 జనాభా లెక్కలు. 2007-03-13. Retrieved 2007-03-19.