నరేంద్ర మోడి

వికీపీడియా నుండి
నరేంద్ర మోడి
నరేంద్ర మోడి

పదవీ కాలము
2007, డిసెంబర్ 25 నుంచి
ముందు కేశూభాయి పటేల్
నియోజకవర్గము మణినగర్ అసెంబ్లీ నియోజకవర్గం

జననం సెప్టెంబర్ 17 1950 (1950-09-17) (వయసు 61)
వాద్‌నగర్, మెహ్సానాజిల్లా, గుజరాత్
రాజకీయ పార్టీ BJP-flag.svg భారతీయ జనతా పార్టీ
భార్య/భర్త అవివాహితుడు
సంతానము -
నివాసము గాంధీనగర్
జూన్ 7, 2008

1950 సెప్టెంబర్ 17న జన్మించిన [1] నరేంద్ర మోడి (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 2007 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా మూడవ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేరువైనారు. 1990లలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఆర్గనైజర్‌గా ఉంటూ రాష్త్రంలో పార్టీ అభివృద్ధికై విశేష కృషి సల్పినాడు. దాని పలితమే 1995లో గుజరాత్‌లో భాజపా అనూహ్యమైన విజయం సాధించింది. పార్టీ అధికారంలోకి రావడాన్కి కృషి చేసిననూ వెంటనే అధికార పీఠం దక్కలేదు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భాజపా ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేకుండా పోయింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా అతనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీసులై ఉన్నాడు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగిస్తున్నాడు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది.[2]

విషయ సూచిక

[మార్చు] బాల్యం

1950, సెప్టెంబర్ 15న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మద్యరతగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడి పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశాడు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశాడు. 1970లలో విశ్వ హిందూ పరిషత్తులో చేరినాడు. గుజరాత్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఛాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన జీవితం అనేక మలుపులు తిప్పింది[3].

[మార్చు] రాజకీయ జీవితం

1987లో నరేంద్ర మోడి భారతీయ జనతా పార్టీలో ప్రవేశించినాడు. కొద్దికాలంలోనే రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాడు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-లాశ్మీర్ రథయాత్రకు ఇంచార్జీగా పనిచేశాడు[4]. 1998లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భాజపా విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భాజపా నాయకత్వం 2001 అక్టోబర్లో నరేంద్ర మోడిని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీనే కొనసాగుతున్నారు.

[మార్చు] ముఖ్యమంత్రిగా మోడీ

ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించాడు [5]. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినాడు. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కల్గించాయి. దేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యాడు.

2002 ఎన్నికలు :2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకుర్చి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాడు. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికినీ [6] సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి .[7][8] మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరుతెచ్చుకున్నాడు.

2007 ఎన్నికలు : 2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఈ మధ్యకాలంలో ఏ ఎన్నికలకూ లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు [9]. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం ఇది జర్గబోయే లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే. అంతేకాకుండా భాజపా తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్ కృష్ణ అద్వానీది గుజరాతే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్‌కే చెందినవాడు. ఇటీవల కాలంలో అధికారంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సందర్భాలు తక్కువే. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకుగాను 117 స్థానాలు పొందటం విషేశం. ఆయన స్వయంగా మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. గుజరాత్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పడటం ఇది 4 వ సారి కాగా నరేంద్ర మోడి సర్కారు ఏర్పడటం 3 వ పర్యాయం[10]. గుజరాత్‌లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్‌ అన్నంటిలోనే భాజపా స్పష్టమైన మెజారిటీ సాధించింది. భాజపా కేంద్ర కార్యాలయం మాత్రం భాజపా జట్టు విజయమని, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' మాత్రం నరేంద్ర మోడీని క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది [11]. తాను 2001 నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్‌ సీఎం నేనని, సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని నరేంద్ర మోడి సరి కొత్త భాష్యం చెప్పాడు [12].

[మార్చు] చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు

2002లో ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత మోడి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాడు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడినాడు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోనికి తెచ్చినాడు. తాగునీటి సరఫరా మరియు జల విద్యుత్‌పై కూడా శ్రద్ధ చూపినాడు. అనేక మహిళా పథకాలను చేపట్టినాడు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోడి అగ్రస్థానంలో కొనసాగిస్తున్నాడు. సెప్టెంబరు 14, 2011న నరేంద్రమోడి పరిపాలన సామర్థ్యాన్ని అమెరికా శ్లాఘించింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పరిపాలన విభాగం "భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్‌లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని, అలసత్వాన్ని తొలిగించి ఆర్థికరథ చక్రాలను గాడిలో పెట్టారు" అని అభివర్ణించింది.

[మార్చు] వ్యక్తిగత జీవితం

నరేంద్ర మోడికి నలుగులు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడు. వెంట ఎప్పుడు లాప్‌టాప్ను ఉంచు కుంటాడు. ఖరీదైన దుస్తులు ధరిస్తాడు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించాడు. అవివాహితుడు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు.

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

  1. [1]Birth date as per personal website
  2. ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011
  3. http://www.andhrabhoomi.net/nationalnews.html తీసుకున్న తేది 24 డిసెంబర్, 2007
  4. http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel12.htm
  5. http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel12.htm
  6. "Don't mention the massacre", The Economist, December 8, 2007, pp. 47.
  7. Cover story: Narendra Modi - Face of Discord (HTML). Swapan Dasgupta. తీసుకొన్న తేదీ: 2007-11-16.
  8. Riots+economic growth=? Indian Express - October 15, 2007
  9. http://in.telugu.yahoo.com/News/National/0712/24/1071224054_1.htm
  10. http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223011_1.htm
  11. http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223010_1.htm
  12. http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223002_1.htm


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు