సుష్మాస్వరాజ్

వికీపీడియా నుండి
సుష్మాస్వరాజ్
సుష్మాస్వరాజ్

రాజ్యసభ సభ్యురాలు,
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి,
మాజీ కేంద్ర సమాచారశాఖమంత్రి
పదవీ కాలము
2006, ఏప్రిల్ నుంచి
నియోజకవర్గము దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం

జననం ఫిబ్రవరి 14 1952 (1952-02-14) (వయసు 60)
అంబాలా కంటోన్మెంట్, హర్యానా
రాజకీయ పార్టీ BJP-flag.svg భారతీయ జనతా పార్టీ
భార్య/భర్త స్వరాజ్ కౌశల్
సంతానము ఒక కూతురు
నివాసము ఢిల్లీ
జూన్ 6, 2008

భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ (Sushma Swaraj) 1952, ఫిబ్రవరి 14న హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించింది. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విధ్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టింది. 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టింది. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించింది. 1996, 98లలో వాజపేయి మంత్రివర్గంలలో కూడా ఈమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.

విషయ సూచిక

[మార్చు] బాల్యం, విద్యాభ్యాసం

1952, ఫిబ్రవరి 14న అంబాలాలో జన్మించిన సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు స్థానికంగా అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినది. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపింది.

[మార్చు] రాజకీయ జీవితం

హర్యానా రాజకీయాలు

1977లో జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హర్యానా విధానసభకు ఎన్నికైంది.[1] 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించింది. 1984లో సుష్మాస్వరాజ్ భాజపాలో చేరింది. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భాజపా సంయుక్త ప్రభుత్వంలో ఈమె విద్య, ఆరోగ్యం మరియు సివిల్ సప్లై శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించింది.

జాతీయ రాజకీయాలు

1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించింది.[2] అంతకు ముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందింది. 1996లో ఈమె దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికైంది. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. 1998లో 12వ లోక్‌సభకు మళ్ళీ రెండో పర్యాయం దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి [3] ఎన్నికై వాజపేయి రెండో మంత్రివర్గంలో మళ్ళీ అదే శాఖను చేపట్టింది. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించినది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి 1998 అక్టోబర్ లో సుష్మాస్వరాజ్‌ను భాజపా అధిష్టానం కేంద్రమంత్రిమండలి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడానికి పంపబడినది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించిననూ ఎన్నికలలో భాజపా పరాజయం పొందుటతో డిసెంబర్ లో మళ్ళీ జాతీయ రాజకీయాలలోకి వచ్చింది.

బళ్ళారిలో సోనియాగాంధీపై పోటీ

1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయుసమయంలో భాజపా తరఫున బలమైన మహిళా నాయకురాలిని నియమించుటకై సుష్మాస్వరాజ్‌ను బరిలోకి దించారు. దేశ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఇక్కడినుంచి విజయం సాధించలేకపోవడంతో సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొంది. ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయిననూ [4]సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.

రాజ్యసభ సభ్యురాలిగా

2004 ఏప్రిల్ లో సుష్మాస్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసింది. జనవరి 2003 నుంచి మే 2004 వరకు మరో రెండూ శాఖలు (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు) అదనంగా చేపట్టింది. 2006 ఏప్రిల్ లో మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతోంది.

[మార్చు] వ్యక్తిగత జీవితం

1975లో సుష్మాస్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్‌ను వివాహంచేసుకున్నది. వారి సంతానం ఒక కూతురు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నరుగా పనిచేశాడు. బరోడా బాంబు పేలుళ్ళ కేసులో జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదించి గెలిపించాడు.

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు