పెళ్ళి

వికీపీడియా నుండి

నూతన దంపతులు.

వివాహము లేదా కల్యాణము అని పిలిచే పెళ్ళి (ఆంగ్లం: Marriage) మానవజీవితంలో మరపురానిది. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరక మానసిక ఆనందం పొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశంకోసం పెళ్ళి కావాలి. "క్రమ బద్ధమైన జీవితాన్ని ఆశచూపి పురుషుడినీ, భధ్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్ళి అనే తాడుతో గట్టిగా కట్టి పడేశాక ఇక వారివైపు చూడదు సమాజం. పెళ్ళికున్న పాత ధర్మాలు పాతబడ్డాయి, కొత్తవి రాలేదు" అన్నారు చలం.


విషయ సూచిక

[మార్చు] హిందూ వివాహ సంప్రదాయం

ధ్రమార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్ధం చేటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. ఉదాహరణగా బాలసారె నుండి వివాహం జరిపించటానికి హిందూ ధర్మంలో వివాహం జరగని వారుకాని వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ పురుషులు సంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించటానికి అనర్హులు. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధినిర్వహణకు అర్హులౌతారు కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకలపం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించటానికి గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉంది.

వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్ది తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి.

[మార్చు] హిందూ వివాహ పద్ధతిలో తారసపడే కొన్ని పేర్లు, వాటి వివరణలు

వధువు

హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ, సరస్వతి, పార్వతిల ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్య పరచే ప్రకృతి యొక్క ప్రతిరూపంగా వధువుయొక్క కాళ్ళకు పారాణి పూసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపును రాసి అలంకరిస్తారు.

వరుడు

త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషునిగా వరుడిని తలుస్తారు.

పెళ్ళి చూపులు

తెలుగు వారి పెళ్ళిళ్ళలో ఉండే ఆ సందడి, సంతోషం ఎవరూ మరువలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరువలేని సంఘటన.

పెళ్ళి చూపులతో పెళ్ళి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాంప్రదాయం ప్రకారం అబ్బాయి అమ్మాయి ఇంటికి బంధువర్గ సమేతంగా వెళ్ళి అమ్మాయిని చూస్తారు. కట్న కానుకలు, లాంఛనాలు అన్నీ కుదిరాక నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.

ఆహ్వాన పత్రికలు

నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. వీటిని 'శుభలేఖలు' అంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగువైపులా పసుపు పూస్తారు.

పెళ్ళి పిలుపులు

బంధుగణమును పిలుచుకొనుట అనేది పెళ్ళిళ్ళలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అప్పుడెప్పుడూ కలిసే బంధువులందరూ కలువవగలిగే మంచి సంధర్భాలు, పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు మారిపోతుంది.

సరంజామా

పెళ్ళి సరంజామా కొనటం అనేది పెళ్ళి వారి ఇండ్లలో అన్నిటికంటే పెద్దపని. పెళ్ళి అనగానే పట్టుచీరల రెపరెపలు, బంగారు ఆభరణాల ధగధగలు, కొత్తకొత్త వస్తువులు ఇలా అన్నీ కొత్తగా కొనుక్కుంటారు.

కళ్యాణ మండపము

కొందరు మండపములను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెలలో కొబ్బరి ఆకుల పందిరి వేయుట వలన మండపంయొక్క ఆవశ్యకత తక్కువ. పట్టణాలలో టిప్ టాప్ పందిరి వేయుట వలన మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

నిశ్చితార్ధము

వధూవరులు పరస్పరం నచ్చాక వారి తలిదండ్రులు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కొరకు ఒప్పందం లాంటిదనుకోవచ్చు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు.

స్నాతకము

పెళ్ళి కుమారుని ఇంటిలోగాని, కళ్యాణమండపంలోగాని లేదా విడిదిలోగాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరునిచే గోత్ర ప్రవరలు చేయిస్తారు.

కాశీప్రయాణం

బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలుదేరుతాడు. వధువు సోదరుడు వచ్చి 'అయ్యా, బ్రహ్మచారిగారూ! మీకాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి', అని చెప్పి బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు. కొన్ని కులాల వారికి ఈ సంప్రదాయం లేదు.

వరపూజ (ఎదురుకోలు)

కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యణ మండపానికి వస్తుంటే కన్యాదాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. పానకం వరునికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. తరువాత కన్యాదాత అందరినీ మండపానికి తీసుకెళతాడు.

గౌరీవృతం
మంగళ స్నానాలు
కన్యావరణము

బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందుటకై వచ్చే వరునికి ఎదురేగి 'నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్దిల్లమ'ని కన్యాదాత దీవిస్తాడు.

మధుపర్కం

మధువు అంటే తేనె.కుమార్తెకు భర్తగా వరుని ఎంపిక తరువాత అతను వధువు తల్లి తండ్రికి సంప్రదాయం అనుసరించి పుత్ర సమానుడౌతాడు.వివాహానంతరం మధుపర్కము అంటే తీయని పానీయము అని అర్ధము. ఇంతకు ముందు దీనిని ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతము దీనికి బదులుగా వరునికి పంచదార రుచి చూపిస్తున్నారు.

యజ్ఞోపవీతధారణ
మహాసంకల్పం
కాళ్ళు కడుగుట


సుముహూర్తం (జీలకర్ర, బెల్లం)

పెళ్ళిచూపులతో ఒక కార్యక్రమం పూర్తి అయిన పిదప వారిరువురి జాతకాల ననుసరించి జ్యోతిష్యములో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లం పెట్టడం జరుగును. ఈ కార్యక్రమమునందు ఈ మంత్రము పఠిస్తారు.

అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే! ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!! ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!!! జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!!
కాళ్ళు తొక్కించడం
కన్యాదానం

దానము అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో కన్యను వరునికి అప్పగిస్తారు.

కన్యాం కనక సంఫన్నాం'కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం'బ్రహ్మలోక జగీషియా!!

దీని అర్ధం-ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకము వంటి శరీర చాయ కలది. శరీరమంతయు ఆభరణములు కలిగినది. నా పిత్రాదులు సంసారమున విజయము పొంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిపొందినట్టు శృతి వలన విని యున్నాను. నేనూ ఆ శాశ్వత ప్రాప్తి పొందుటకై విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను.

స్వర్ణ జలాభిమంత్రం
యోత్రేభంధనం
మంగళసూత్రధారణ

వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!!
పెళ్ళి సమయంలో ఒక కార్యక్రమం
తలంబ్రాలు

మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. 'క్షత' అంటే విరుగునది- 'అక్షత' అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.

ప్రజాపతి స్త్రియాం యశః'ముష్కరోయధధాద్సపం! కామస్య తృప్తిమానందం'తస్యాగ్నేభాజయేహమా!!
బ్రహ్మముడి


అంగుళీకాలు తీయడం

ఉంగరాలు తీయడాన్నే ప్రధానాంగుళీయకం అంటారు. మూత కురచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోస్తారు. దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు. దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం.

సప్తపది, పాణిగ్రహణం
సన్నికల్లుతోయం
రాజహోమం
స్థాలీపాకం
నాగవల్లి
సదస్యం
నల్లపూసలు
అరుంధతీ నక్షత్రం
అంపకాలు
సత్యనారాయణ వ్రతం
కంకణి విమోచనం
గర్భాధానం
విందువినోదాలు

పెళ్ళిళ్ళలో విందు వినోదములకు పెద్దపీట వేస్తారు. ఎంత గొప్పగా పెళ్ళి చేసారు అనేది వారు నిర్వహించిన విందు వినోదాల వలననే తెలుస్తుందంటారు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా విందు వినోదాలు జరుగుతాయి.

[మార్చు] ఇస్లాంలో వివాహం

  • పెళ్ళి తప్పకచెయ్యాలని అందరు ప్రవక్తలు చెప్పారు. పెళ్ళి సగం విశ్వాసం అన్నారు. వైవాహిక జీవితం, కుటుంబ వ్యవస్థకు పునాది,సమాజాన్ని సక్రమంగా పట్టి ఉంచే వల అన్నారు.వివాహం స్త్రీ పురుషుల మధ్య చట్టపరమైన ఒడంబడిక, సామాజిక కట్టుబాటు.

[మార్చు] తొలి మహిళా ఖాజీ

ప్లానింగ్ కమీషన్ సభ్యురాలు డాక్టర్ సయేదా హమీద్ పెళ్లిళ్లు జరిపే పురోహితమ్మ. స్వంతంగా ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్న షియా తెగకు చెందిన నాయిష్ హసన్ అనే అమ్మాయికి, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో పి.హెచ్‌.డీ. పూర్తిచేసిన సున్నీ తెగకు చెందిన ఇమ్రాన్ అనే అబ్బాయికి లక్నోలోని ఒక హోటల్‌లో సయేదా హమీద్ ఖాజీగా మారి నిఖా జరిపించారు. వధూవరులు తమ పెళ్లి ప్రమాణాలను ఉర్దూ, అరబ్బీలో కాకుండా ఇంగ్లీష్‌లో చెప్పుకుని మరో చరిత్రను సృష్టించారు. ఇప్పటివరకు నిఖానామా కేవలం పురుష ఖాజీలే జరిపేవారు.

[మార్చు] హిందూ ధర్మంలో అంగీకరించబడిన వివాహాలు

మహాభారతంలో భీష్మాచార్యుడు ధర్మరాజుకు ధర్మశాస్త్ర సమ్మతమైన వివాహాలను గురించి ఇలా చెప్పాడు.

  • బ్రాహ్మణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర స్తీలను వివాహమాడవచ్చు.
  • క్షత్రియుడు క్షత్ర్య, వైశ్య, శూద్ర స్త్రీలను వివాహమాడవచ్చు.
  • వైశ్యుడు వైశ్య, శూద్ర స్త్రీలను వివాహమాడవచ్చు.
  • శూద్రుడు శూద్ర స్త్రీలను మాత్రమే వివాహమాడవలెను.
  • తక్కువ జాతి పురుషులు ఎక్కువ జాతి స్త్రీలను వివాహమాడిన వారి వివాహం వర్ణ సంకరం అని వారి సంతానం సంకరులు అని పిలవబడుతుంది.
  • బ్రాహ్మణ స్త్రీయందు శూద్రునకు పుట్టిన బిడ్డ చండాలుడు అని పిలవబడతాడు.
  • సామాన్యులలో ఎక్కువజాతి పురుషునకు తక్కువ జాతి స్త్రీకి జన్మించిన సంతానం స్త్రీ జాతికి చెందుతుంది.
  • మునుల వలన ఏ జాతి స్ర్తీకి జన్మించిన వారైనను బ్రాహ్మణులుగా గుర్తించబడతారు.
  • క్షత్రియు పురుషుని వలన ఏ జాతి స్త్రీ కి జన్మించిన సంతానమైనా వారు క్షత్రియులౌతారు.
  • మహా తపోజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణ క్షత్రియుల వలన పుట్టిన వారు బీజ ప్రధానులై అధికులు ఔతారు.

[మార్చు] తెలుగు పెళ్ళి

  • http://www.telugujaathi.org/samajamkosam.aspx సంస్కృత మంత్రాలు లేకుండా అచ్చంగా తెలుగులోనే 2007 ఫిబ్రవరి 18నజరిగింది.

[మార్చు] రెండోపెళ్ళి

రెండవవ్యక్తిని జీవితభాగస్వామిగా స్వీకరించటం.కుటుంబానికి చెడ్డపేరు తెచ్చామన్న బాధ ఉన్నా,జీవితం భద్రంగా ఉంటుందని కొందరు ప్రసిద్ధ సినీతారలు పెళ్ళయిన మగాళ్ళను చేసుకున్నారు.కొంతమంది జీవితాలు బాగున్నాయి కొందరు విడిపోయారు.రెండో పెళ్ళినాటికి వీరిలో కొందరికి పిల్లలు కూడా ఉన్నారు.మొదటి భార్యతో విడాకులు తీసుకుంటేనే రెండో భార్యగా కొందరు ఇష్టపడితే,రెండవ కుటుంబం ఉన్నాసరే అని కొందరు ముందుకొచ్చారు:

  • హేమమాలిని-ధర్మేంద్ర,శ్రీదేవి-బోనీ కపూర్,శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా,షబానా ఆజ్మీ--జావేద్ అక్తర్,హెలెన్-సలీంఖాన్,రవీనా టాండన్--అనిల్ తాండానీ,కరిష్మా కపూర్--సంజయ్ కపూర్,కరీనా కపూర్-సైఫ్ అలిఖాన్.http://www.sakshi.com/main/weeklydetails.aspx?newsId=40020&subcatid=27&Categoryid=2

[మార్చు] ఇవి కూడా చూడండి

"http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు