ఐ.కె.గుజ్రాల్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ఇందర్ కుమార్ గుజ్రాల్ | |
![]() |
|
|
|
|
|---|---|
| పదవిలో ఏప్రిల్ 21 1997 – మార్చి 19 1998 |
|
| ఇంతకు ముందు ఉన్నవారు | హెచ్.డి.దేవెగౌడ |
| తరువాత వచ్చినవారు | అటల్ బిహారీ వాజపేయి |
|
|
|
| జననం | డిసెంబరు 4 1919 (వయసు 93) జీలం, పంజాబ్, బ్రిటీషు ఇండియా |
| మరణం | నవంబరు 30, 2012 |
| రాజకీయ పార్టీ | జనతా దళ్ |
| భార్య/భర్త | షీలా గుజ్రాల్ |
ఇందర్ కుమార్ గుజ్రాల్ (హిందీ: इन्द्र कुमार गुजराल) (జ. డిసెంబర్ 4 1919, మ నవంబరు 30, 2012) 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త.
అవిభాజిత పంజాబ్ లోని జీలం (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది)లో ఒక గౌరవనీయమైన పంజాబీ ఖత్రీ (వర్తక కులం) కుటుంబములో పుట్టిన గుజ్రాల్ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళాడు.
భారత రాజకీయాలలో సంచలనాత్మక సమయమైన జూన్ 1975లో గుజ్రాల్ ఇందిరా గాంధీ మంత్రివర్గములో సమాచార మరియు ప్రసరణ శాఖా మంత్రిగా పనిచేశాడు. జూన్ 12, 1975న అలహాబాదు ఉన్నత న్యాయస్థానం 1971 ఎన్నికలలో ఇందిరాగాంధీ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని నిర్ణయించి ఆమె ఎన్నికను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇందిరాగాంధీకి మద్దతుగా ఆమె కుమారుడు సంజయ్ గాంధీ పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము నుండి ప్రజలను లారీలలో రాజధానికి తరలించి, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను ఏర్పాటు చేశాడు. ఈ నిరసన ప్రదర్శనలకు ప్రభుత్వాధీనములో ఉన్న రేడియో మరియు టీవీలలో చూపించాలని గుజ్రాల్ ను సంజయ్ గాంధీ ఆజ్ఞాపించినట్టు వెల్లడైంది. అయితే రాజ్యంగబద్ధ అధికారమేదీ లేని సంజయ్ ఆజ్ఞను గుజ్రాల్ అంగీకరించలేదు. ఆ వెనువెంటనే సమాచార శాఖా మంత్రిగా గుజ్రాల్‌ను తొలగించి విద్యాచరణ్ శుక్లాను నియమించడం వెనుక ఇదే కారణమని పలువులు భావిస్తున్నారు.
ఆ తరువాత, గుజ్రాల్ రష్యాలో భారతీయ రాయబారిగా నియమితుడయ్యాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారము చేపట్టేసరికి, మాస్కోలో భారతీయ దౌత్యవేత్తగా గుజ్రాల్, 1979లో సోవియట్ సమాఖ్య యొక్క ఆఫ్ఘానిస్తాన్ దురాక్రమణను ఖండించేందుకు ఆమెను ఒప్పించాడు. అప్పటివరకు హంగేరీ మరియు చెకోస్లవేకియాలలో సోవియట్ యొక్క సైనికచర్యలను సమర్ధించిన భారతదేశానికి ఇది మునుపటి దౌత్య వైఖరి కంటే భిన్నమైనది. దీని పర్వవసానముగానే ఇందిరాగాంధీ ఏకాంత సమావేశములో సోవియట్ నాయకుడైన లియొనిడ్ బ్రెజ్నేవ్‌కు ఆఫ్ఘానిస్తాన్ విషయంలో మాస్కో పొరపాటు చేసిందని తెలియజేసింది.
| ఇంతకు ముందు ఉన్నవారు: దేవెగౌడ |
భారత ప్రధానమంత్రి ఏప్రిల్ 21, 1997—మార్చి 19, 1998 |
తరువాత వచ్చినవారు: అటల్ బిహారీ వాజపేయి |
|
|||||||
