హెచ్.డి.దేవెగౌడ
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| దేవెగౌడ ದೇವೇಗೌಡ |
|
|
|
|
|---|---|
| పదవిలో జూన్ 1 1996 – ఏప్రిల్ 21 1997 |
|
| ఇంతకు ముందు ఉన్నవారు | అటల్ బిహారీ వాజపేయి |
| తరువాత వచ్చినవారు | ఐ.కె.గుజ్రాల్ |
|
|
|
| జననం | మే 18 1933 (వయసు 80) హరదనహళ్ళి, మైసూరు రాజ్యం, బ్రిటీషు ఇండియా |
| రాజకీయ పార్టీ | జనతాదళ్ |
| వృత్తి | ఇంజనీరు (సివిల్) |
హరదనహళ్ళి దొడ్డేగౌడ దేవేగౌడ (Haradanahalli Doddegowda Deve Gowda) (కన్నడ: ಹರದನಹಳ್ಳಿ ದೊಡ್ಡೇಗೌಡ ದೇವೇಗೌಡ) (జ. మే 18 1933)[1] భారతదేశ 12వ ప్రధానమంత్రి (1996–1997) మరియు కర్ణాటక రాష్ట్ర 14వ ముఖ్యమంత్రి (1994–1996).
రైతు కుటుంబములో పుట్టిన దేవేగౌడ[2], రైతుగా శిక్షణ పొందాడు. 1962లో తొలిసారిగా కర్ణాటక శాసనసభకు ఎన్నికై కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎదిగాడు. 1970వ దశకము చివరలో జనతా పార్టీలో ఎదిగిన దేవేగౌడ, 1980లో పార్టీ చీలీపోయినప్పుడు దాని వారసపార్టీ అయిన జనతాదళ్ ను తిరిగి సమైఖ్య పరచటంలో ప్రధానపాత్ర పోషించాడు. దేవేగౌడ పార్టీలోకి విభిన్న కులాలకు చెందిన వ్యక్తులను ఆకర్షించడంలో కీలకమయ్యాడు. 1996 సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రేసు ఓడిపోయి, అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామా చేసిన తర్వాత, జాతీయవాద పార్టీలు ప్రభుత్వము నెలకొల్పలేకపోవడంతో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి దేవేగౌడ ప్రధానమంత్రి అయ్యాడు.
మూలాలు [మార్చు]
- ↑ "Profile on website of Prime Minister's Office".
- ↑ "Asiaweek article". Retrieved 2007-09-30.
సంతకము [మార్చు]
| ఇంతకు ముందు ఉన్నవారు: అటల్ బిహారీ వాజపేయి |
భారత ప్రధానమంత్రి జూన్ 1, 1996—ఏప్రిల్ 21, 1997 |
తరువాత వచ్చినవారు: ఐ.కె.గుజ్రాల్ |
|
|||||||
|
|||||