శంకర దయాళ్ శర్మ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Shankar Dayal Sharma
शंकर दयाल शर्मा
శంకర దయాళ్ శర్మ

పదవీ కాలము
25 July 1992 – 25 July 1997
ప్రధాన మంత్రి P. V. Narasimha Rao
Atal Bihari Vajpayee
H. D. Deve Gowda
I. K. Gujral
[[Vice 9th President of India|Vice President(s)]] K. R. Narayanan
ముందు R. Venkataraman
తరువాత K. R. Narayanan

పదవీ కాలము
3 September 1987 – 25 July 1992
President R. Venkataraman
ముందు R. Venkataraman
తరువాత K. R. Narayanan

పదవీ కాలము
3 April 1986 – 2 September 1987
ముందు Kona Prabhakar Rao
తరువాత Kasu Brahmananda Reddy

పదవీ కాలము
26 November 1985 – 2 April 1986
ముందు Hokishe Sema
తరువాత Siddhartha Shankar Ray

పదవీ కాలము
29 August 1984 – 26 November 1985
ముందు Thakur Ram Lal
తరువాత Kumudben Manishankar Joshi

జననం (1918-08-19)19 ఆగష్టు 1918
Bhopal, Central Provinces, British India
(now in Madhya Pradesh, India)
మరణం డిసెంబరు 26, 1999(1999-12-26) (వయసు 81)
New Delhi, Delhi, India
రాజకీయ పార్టీ Indian National Congress
భార్య/భర్త Vimala Sharma
సంతానము Two sons
One daughter
విధ్యాభ్యాసం Allahabad University
Agra College
Panjab University, Chandigarh
University of Lucknow
Fitzwilliam College, Cambridge
Harvard University
మతం Hinduism
సంతకం శంకర దయాళ్ శర్మ's signature

శంకర్ దయాళ్ శర్మ (ఆగస్ట్ 19, 1918డిసెంబర్ 26, 1999) ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోదుడు మరియు పండితుడు. భోపాల్ నగరంలో 1918, ఆగస్టు 19న జన్మించిన శర్మ 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ పనిచేసాడు. అంతకు పూర్వం 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ, న్యాయ శాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. 1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పనిచేశాడు.

విద్యాభ్యాసం[మార్చు]

శర్మ సెయింట్ జాన్ కళాశాల, ఆగ్రా కళాశాల, అలహాబాద్ విశ్వవిద్యాలయం, లక్నో విశ్వవిద్యాలయం, ఫిట్జ్ విలియం కళాశాల, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, లింకన్స్ ఇన్, హార్వర్డ్ న్యాయ పాఠశాల మొదలైన అనేక విద్యా సంస్థల్లో విద్య నభ్యసించడం జరిగింది.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1940 వ దశకంలో శర్మ భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. అదే దశకంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకూ అదే పార్టీకి విధేయులుగా ఉన్నాడు. 1952 లో అప్పటి భోపాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 1956లో భోపాల్ మిగతా చిన్న రాష్ట్రాలతో కలిసి మధ్యప్రదేశ్ ఏర్పడేవరకూ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

1960లలో ఇందిరా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడాన్ని సమర్థించాడు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక మంత్రి పదవులు నిర్వహించాడు. 1974-77 మధ్యలో కమ్యూనికేషన్ల శాఖా మంత్రిగా పని చేశాడు.

మరణం[మార్చు]

తన చివరి ఐదు సంవత్సరాల్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అక్టోబర్ 9, 1999 న విపరీతమైన గుండెపోటుతో ఢిల్లో ని ఒక వైద్యశాలలో అడ్మిట్ చేశారు. కొద్ది సేపటికే ఆయన తుదిశ్వాస విడిచాడు. ఆయన భౌతిక కాయాన్ని విజయ్ ఘాట్ వద్ద ఖననం చేశారు.

విశేషాలు[మార్చు]

  • ఆయన చనిపోయే వరకు విధిగా ప్రతి యేటా తిరుమల కు వచ్చి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేవాడు.