మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| అబుల్ కలాం ఆజాద్ ابو الکلام آزاد | |
|---|---|
| నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958 | |
| జన్మస్థలం: | మక్కా, ఉస్మానియా సామ్రాజ్యము (ప్రస్తుత సౌదీ అరేబియా) |
| నిర్యాణ స్థలం: | ఢిల్లీ, భారతదేశం |
| ఉద్యమము: | భారత స్వాతంత్ర్య ఉద్యమము |
| ప్రధాన సంస్థలు: | భారత జాతీయ కాంగ్రెస్ |
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (ఉర్దూ : ابو الکلام آزاد ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 జనవరి 11 న మక్కాలో జన్మించాడు.
ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు.
1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది.
[మార్చు] సాహిత్యం
- తర్జుమానుల్ ఖురాన్ (ఖురాన్ అనువాదం)
- "అల్-హిలాల్" మరియు "అల్-బలాగ్" అనే పత్రికలు స్థాపించాడు.
- గుబార్-ఎ-ఖాతిర్
- ఇండియా విన్స్ ఫ్రీడమ్