ధొండొ కేశవ కార్వే
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మహర్షి ధొండొ కేశవ కార్వే (ఏప్రిల్ 18, 1858 - నవంబర్ 9, 1962) తన జీవితాంతము మహిళా ఉద్ధరణకై పాటుపడినాడు. ఈయన మహిళలకై ఒక కళాశాల ప్రారంభించాడు. భారత దేశములో ప్రప్రధమ మహిళా విశ్వవిద్యాలయమైన ఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయమును 1916 లో ముంబైలో స్థాపించాడు. 1958 లో ఈయనను భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నతో సత్కరించారు. అభిమానులు ఈయన్ను అన్నా లేదా అన్నాసాహెబ్ అని పిలిచేవారు.
తొలి జీవితం [మార్చు]
కార్వే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా, ఖేడ్ తాలూకాకు చెందిన షేరావళిలో ఏప్రిల్ 18, 1858న ఒక చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈయన స్వస్థలం కొంకణ్ ప్రాంతములోని మురుద్ (రత్నగిరి జిల్లా). ఈయన తండ్రి పేరు కేశవ్ బాపున్న కార్వే.
కార్వే ముంబాయిలోని విల్సన్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. [1] ఆ తరువాత ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలనుండి గణిత శాస్త్రములో బి.ఎ. పట్టా పొందాడు. [2].
కార్వేకు 14 యేళ్ళ వయసులో 8 సంవత్సరాల బాలిక అయిన రాధాబాయినిచ్చి పెళ్ళిచేశారు. కానీ వైవాహిక జీవితము 20యేళ్ళు నిండిన తర్వాతనే ప్రారంభించాడు. రాధాబాయి చిన్నవయసులోనే 1891లో మరణించింది. మొదటి వివాహములో కార్వేకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ రోజుల్లో సమాజంలో వితంతువుల కష్టాలు చూసి, వితంతు పునర్వివావాహాల గురించి ఆలోచించాడు. 1893లో 8వ యేటనే వితంతువైన 23యేళ్ళ గోదూబాయి కార్వేను వివాహమాడి సాంప్రాదాయ మహారాష్ట్ర సమాజములో ఒక ఉదాహరణగా నిలిచాడు.[3][4] .
కార్వే 1962 నవంబర్ 9 న పూణే లో మరణించాడు.
మూలాలు [మార్చు]
- ↑ "Vikram Karve's Notes on his great-grand father". Retrieved 2006-08-01.
- ↑ "Notes on Asia Times". Retrieved 2006-08-04.
- ↑ "NCTE - Comparison of Tilak with other reformers including Karve". Retrieved 2006-08-01.
- ↑ "Maharshi Karve Stree Shikshan Samstha". Retrieved 2006-08-01.