కర్పూరీ ఠాకూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్పూరీ ఠాకూర్
1991 భారతదేశ పోష్టల్ స్టాంపుపై కర్పూరీ ఠాకూర్
11వ బీహార్ ముఖ్యమంత్రి
In office
1970 డిసెంబరు 22 – 1971 జూన్ 2
అంతకు ముందు వారుదరోగ ప్రసాద్ రాయ్
తరువాత వారుభోలా పాశ్వాన్ శాస్త్రి
In office
1977 జూన్ 24 – 1979 ఏప్రిల్ 21
అంతకు ముందు వారుజగన్నాథ్ మిశ్రా
తరువాత వారురామ్ సుందర్ దాస్
2వ బీహార్ ఉపముఖ్యమంత్రి
In office
1967 మార్చి 5 – 1968 జనవరి 31
ముఖ్యమంత్రిమహామాయా ప్రసాద్ సిన్హా
అంతకు ముందు వారుఅనుగ్రహ నారాయణ్ సిన్హా
తరువాత వారుసుశీల్ కుమార్ మోడీ
బీహార్ విద్యా మంత్రి
In office
1967 మార్చి 5 – 1968 జనవరి 31
అంతకు ముందు వారుసత్యేంద్ర నారాయణ్ సిన్హా
తరువాత వారుసతీష్ ప్రసాద్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం(1924-01-24)1924 జనవరి 24
పితౌంజియా, బీహార్, ఒరిస్సా ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
మరణం1988 ఫిబ్రవరి 17(1988-02-17) (వయసు 64)
పాట్నా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీసోషలిస్ట్ పార్టీ (ఇండియా), భారతీయ క్రాంతి దళ్, జనతా పార్టీ, లోక్ దళ్
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, ఉపాధ్యాయుడు, రాజకీయ నాయకుడు
పురస్కారాలు భారతరత్న (2024)

కర్పూరీ ఠాకూర్ (1924 జనవరి 24 - 1988 ఫిబ్రవరి 17) బీహార్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, మొదట డిసెంబరు 1970 నుండి జూన్ 1971 వరకు, ఆపై జూన్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగాడు.

ఆయనకు కేంద్రప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ 2024 జనవరి 23న ఒక ప్రకటన విడుదల చేసింది.[1]

జీవిత చరిత్ర[మార్చు]

కర్పూరీ ఠాకూర్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా పితౌంజియా (ప్రస్తుతం కర్పూరి) గ్రామంలో గోకుల్ ఠాకూర్, రామ్‌దులారి దేవి దంపతులకు జన్మించాడు.[2][3][4] ఆయన మహాత్మా గాంధీ, సత్యనారాయణ సిన్హాచే ప్రభావితమయ్యాడు.[5][6] ఆయన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరి విద్యార్థి నాయకుడిగా[7], క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు, అతను 26 నెలల జైలు జీవితం గడిపాడు.[8]

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతను 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుండి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా బీహార్ విధానసభ సభ్యుడు అయ్యాడు. 1960లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సార్వత్రిక సమ్మె సందర్భంగా పి అండ్ టి ఉద్యోగులకు నాయకత్వం వహించినందుకు అరెస్టయ్యాడు. 1970లో, అతను టెల్కో కార్మికుల ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు.[9]

హిందీ భాషపై తనకున్న విశ్వాసంతో బీహార్ విద్యా మంత్రిగా మెట్రిక్యులేషన్ పాఠ్యాంశాలకు ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్ట్‌గా తొలగించాడు. ఆయన 1970లో బీహార్‌లో మొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ముందు బీహార్‌లో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేశాడు. అతని హయాంలో, బీహార్‌లోని వెనుకబడిన ప్రాంతాలలో అతని పేరు మీద అనేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి.

ఆయన సంయుక్త సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసాడు. లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి ప్రముఖ బీహారీ నాయకులకు అతను గురువుగా కీర్తిపొందాడు.[10]

కర్పూరి ఠాకూర్ 64 సంవత్సరాల వయసులో 1988 ఫిబ్రవరి 17న గుండెపోటుతో మరణించాడు.

రాజకీయం[మార్చు]

కర్పూరీ ఠాకూర్ 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికతో ప్రారంభమైన రాజకీయ జీవితం (1977 పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనప్పుడు, 1984 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సమయం మినహా) 1988లో మరణించే వరకు శాసనసభ్యునిగా ఉన్నాడు. ఠాకూర్ 1967 మార్చి 5 నుంచి 1968 జనవరి 28 వరకు బీహార్ విద్యాశాఖ మంత్రిగా,1970 డిసెంబరులో సంయుక్త సోషలిస్టు పార్టీతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, కాని అతని ప్రభుత్వం ఆరు నెలల తరువాత పడిపోయింది. 1977 జూన్ లో తిరిగి పదవిని చేపట్టినా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేయలేక, దాదాపు రెండేళ్లలో  అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇందుకు ప్రధానకారణం ఆయన అమలు చేసిన రిజర్వేషన్ విధానం వల్ల జరిగిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటారు. కర్పూరీ ఠాకూర్ విధానపరమైన నిర్ణయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, అతని సచ్చీలత (క్లిన్ ఇమేజ్), మచ్చలేని రాజకీయ నాయకుడిగా వ్యక్తిగతంగా గౌరవించబడ్డారు[11].

మూలాలు[మార్చు]

  1. "కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న-Namasthe Telangana". web.archive.org. 2024-01-24. Archived from the original on 2024-01-24. Retrieved 2024-01-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Singh, Aastha (2019-01-24). "Karpoori Thakur, the other Bihar CM who banned alcohol". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 15 June 2020. Retrieved 2020-06-15.
  3. "Karpoori Thakur, former Bihar Chief Minister, conferred Bharat Ratna posthumously". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  4. "How Bihar's caste survey seeks to build on the legacy of Karpoori Thakur". Archived from the original on 12 November 2023. Retrieved 23 January 2024.
  5. Prasāda, R.; Ārya, J.; Kumāra, K. (1991). Karpoori, a Portrait. S.K. Publications. p. 11. Archived from the original on 23 January 2024. Retrieved 2024-01-23.
  6. Singh, S. (2015). Ruled or Misruled: Story and Destiny of Bihar. Bloomsbury Publishing. p. 26. ISBN 978-93-85436-42-0. Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024. Karpoori Thakur, a Gandhian leader from an extremely backward caste of a barber or nai community from Samastipur
  7. "Karpoori Thakur: A Socialist Leader in the Hindi Belt". 15 August 2016. Archived from the original on 23 January 2024. Retrieved 11 February 2021.
  8. "Karpoori Thakur". FreeIndia.Org. Archived from the original on 14 March 2005. Retrieved 14 January 2008.
  9. "Karpoori Thakur". FreeIndia.Org. Archived from the original on 14 March 2005. Retrieved 14 January 2008.
  10. Akshayakumar; Ramanlal Desai, eds. (1986). Agrarian Struggles in India After Independence. Oxford University Press, 1986. p. 87. ISBN 0195616812. Archived from the original on 23 January 2024. Retrieved 2 April 2021.
  11. "Karpoori Thakur gets Bharat Ratna: Why the Jannayak's politics and policies still resonate". The Indian Express (in ఇంగ్లీష్). 2024-01-23. Retrieved 2024-02-10.