బ్రాహ్మణులు
వికీపీడియా నుండి
బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో అంటున్నారు. కాని బ్రాహ్మణులు అని అనాలి. చతుర్వర్ణాలలో మొదటి వర్ణం 'బ్రాహ్మణులు'.
యజనం యాజనం దానం బ్రాహ్మణస్యప్రతిగ్రహః
అధ్యాపనం చాధ్యయనం షట్కకర్మాణి ద్విజోత్తమాః
బ్రాహ్మణులలో చాలా శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని (ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినవి.
- ద్రావిడులు - పూర్వం ద్రవిడ దేశం (తమిళనాడు) నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు.
- వైదికులు - వీరు అసలైన స్థానికులు. వైదికులు అనగా వైదిక విద్యనభ్యసించి, వైదిక వృత్తినే తమ కులవృత్తిగా చేసుకొని జీవించేవారు. సాధారణంగా పురోహితులు, గుళ్ళల్లో పూజారులు మొదలగు వారు. మరలా పురోహితులలో రెండు రకాలవారు ఉంటారు. శుభ కార్యాలు చేయించే వారు (పెళ్ళిళ్ళు, వ్రతాలు, పూజలు మొదలగునవి చేయించే వారు), తరవాత అపరం చేయించే వారు (శ్రాద్ధ కర్మలు, తద్దినాలు చేయించేవారు).
- నియోగులు - నియోగులలో మరలా రెండు రకాలు - ఆరు వేల నియోగులు(కరణాలు), ప్రధమ శాఖ వారు. ఇక ఆరువేల నియోగుల విషయానికి వస్తే, శ్రీ కృష్ణ దేవరాయల(?) కాలంలో వారి రాజ్య పరిపాలన సులభం అవడం కొరకు ఒక రాత్రి కి రాత్రే ఆరు వేల మందిని గ్రామాధికారులుగా నియమింఛడం జరిగింది. అప్పుడు అలా గ్రామాధికారులుగా నియోగించబడిన వారు ఆరు వేల నియోగులుగాను, ఇంకా మిగిలిపోయిన ఆ శాఖలోని వారందరూ ప్రధమ శాఖ గానూ పిలువబడుతున్నారని వినికిడి.
- వీరేగాక బ్రాహ్మణులలో ఇంకా ఆంధ్రులు, తెలగాణ్యులు, వెలనాట్లు, వేగినాట్లు,కాసనాట్లు మొదలగు ఉప శాఖలు చాలా ఉన్నాయి.వైష్ణవులు, శైవులు, లింగధారులు కూడా బ్రాహ్మణులలో శాఖలే.