భగత్ సింగ్
| భగత్ సింగ్ ਭਗਤ ਸਿੰਘ بھگت سنگھ |
|
|---|---|
| {{{lived}}} | |
| పుట్టిన తేదీ: | సెప్టెంబరు 27, 1907 |
| జన్మస్థలం: | ఫైసలాబాద్, పంజాబ్, బ్రిటిషు ఇండియా |
| మరణించిన తేదీ: | మార్చి 23, 1931 |
| నిర్యాణ స్థలం: | లాహోర్, పంజాబ్, బ్రిటిషు ఇండియా |
| ఉద్యమము: | భారత స్వాతంత్ర్య ఉద్యమం |
| ప్రధాన సంస్థలు: | నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ మరియు హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ |
భగత్ సింగ్ (పంజాబీ: ਭਗਤ ਸਿੰਘ بھگت سنگھ, (సెప్టెంబరు 27, 1907[1] –మార్చి 23, 1931) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్. పనిక్కర్ ప్రకారం భగత్ సింగ్,భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. [2] భగత్ సింగ్ హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యుల్లో ఒకడు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించాడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యం, జీవితం
భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలివి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంధాలను ఆయన అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు. మేరా రంగ్ దే బసంతీ చోలా ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా మేరా రంగ్ దే బసంతీ చోలా యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా నవ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా మేరా రంగ్ దే బసంతీ చోలా గంభీరమైన గొంతుతో భగత్ సింగ్ పాడుతున్న ఈ పాటను విని జైలు వార్డర్లు కూడా ముగ్ధులయ్యేవారు.
[మార్చు] ఆదర్శాలు-అభిప్రాయాలు
అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."
[మార్చు] వారసత్వం
[మార్చు] విమర్శలు
[మార్చు] ఉల్లేఖనాలు
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
Years of Vision , Padmabhushan P.P.Rao-nov' 2008 -- వీరేంద్ర సింధు, మేరా రంగ్ దే బసంతీ చోలా వ్యాసం.
- ↑ He left a rich legacy for the youth. The Tribune (2006-03-19). తీసుకొన్న తేదీ: 2008-01-01.
- ↑ Bhagat Singh an early Marxist, says Panikkar. The Hindu (2007-10-14). తీసుకొన్న తేదీ: 2008-01-01.
|
|||||||||||||||||