ఝాన్సీ లక్ష్మీబాయి
| ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము రాణి లక్ష్మిబాయి తో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) |
| రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి | |
|---|---|
| 1828 – 17 జూన్ 1858 | |
రాణీ లక్ష్మీబాయి విగ్రహం |
|
| ఇతర పేర్లు: | మను, మనికర్ణిక |
| జన్మస్థలం: | కాశీ |
| నిర్యాణ స్థలం: | గ్వాలియర్,భారత్ |
| ఉద్యమము: | భారత స్వాతంత్ర్యోద్యమం |
ఝాన్సీ లక్ష్మీబాయి ( 1828 – 17 జూన్ 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది.
విషయ సూచిక |
బాల్య జీవితం [మార్చు]
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరములో మహారాష్ట్ర కు చెందిన ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసి లో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది.
ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండు గా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన భాద్యత తండ్రి మీద పడింది.
ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావు కు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వండి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానా సాహెబ్ వెంట మనూబాయి దుసుకొని పోయేది.
వివాహం [మార్చు]
లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణించాడు.
ఆక్రమణ [మార్చు]
వీరు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.
1857 స్వాతంత్ర్య పోరాటం [మార్చు]
1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబర్ మరియు అక్టోబర్ 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా మరియు ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొనగలిగింది.
జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.
మరణం [మార్చు]
రాణి 1858, జూన్ 17 వ తేదీన గ్వాలియర్ యుద్ధం లో మరణించింది. [1] ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.
తనతో పాటు ఆమెను తీసుకు వెళ్తానన్న తాంతియా తోపే సహాయాన్ని తిరస్కరిస్తూ ఆమె ఒక నిచ్చెన ను తెమ్మని పురమాయించింది. దాని సహాయంతో దగ్గరే ఉన్న గడ్డి వామి పైకి ఎక్కి దాన్ని తగుల బెట్టమని చెప్పింది. ఆమె అనుచరులు అలాగే చేశారు. ఇది ఫూల్ భాగ్ వద్దనున్న గుసైన్ బాగ్ వద్ద జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూశాను.[2]
తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను చేజిక్కించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబిచ్చాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
ఉపసంహారం [మార్చు]
- ఆమె తండ్రి మోరోపంత్ తాంబేను ఝాన్సీ రాజ్యం పడిపోయిన కొన్ని రోజుల తర్వాత పట్టుకొని ఉరి తీయడం జరిగింది.
- ఆమె దత్త పుత్రుడైన దామోదర్ రావుకు బ్రిటీష్ ప్రభుత్వం అతని వారసత్వ సంపదను ఇవ్వకపోయినా భరణం మాత్రం చెల్లించింది.
- ఝాన్సీలోనూ, గ్వాలియర్లోనూ ఉన్న రాణి కంచు విగ్రహాలు ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ మిగిలి ఉన్నాయి..
ఝన్సీ రజ్యామఅమ్ నాది
సాహిత్యం [మార్చు]
- The Queen of Jhansi is the English translation of Jhansir Rani by Mahashweta Devi. This book is fictional reconstruction of life of Rani LaxmiBai and was originally published in Bengali in 1956, ISBN 81-7046-175-8.
- Jhansi ki Rani, written by Subhadra Kumari Chauhan, is a heroic nationalist poem honouring the Rani, and is very popular in India.
- Flashman in the Great Game - Two meetings between Flashman| and the Rani are described in this historical fiction novel about the Indian Revolt by George MacDonald Fraser.
- "Rani" a novel (2007) in English by Jaishree Misra.
- Nightrunners of Bengal by John Masters provides a fictional account of the relationship between a British officer (Rodney Savage) and a Rani, based on Lakshmibai. It was the American Literary Guild's Book of the Month on publication in January 1951, but faced some criticism for perceived political views. It is part of a series of historical novels about a fictional British family serving in India.
- Maza Pravas: 1857 cya Bandaci Hakikat (marathi "My journey: the truth about the 1857 rebellion") by Vishnu Bhatt Godse.
- Amar Balidani by Janki Sharan Verma
- Zila Vikas Pustika, 1996–97, Jhansi
- Meyer, Karl E. and Shareen Blair Brysac. Tournament of Shadows. Washington D.C.: Counterpoint, 1999.
ఝన్సీ రాణి పై తీసిన చిత్రాలు [మార్చు]
- The Tiger and the Flame (Jhansi Ki Rani) (1953) was the first technicolor film released in India, directed and produced by Indian filmmaker Sohrab Modi.
- The Rebel (Jhansi Ki Rani) is a new film by Ketan Mehta, and is a companion piece to his film Mangal Pandey: The Rising. The screenplay is by Farrukh Dhondy from a story by Chandra Prakash Dwivedi. The film is currently in pre-production.
కాల రేఖ [మార్చు]
- ఝాన్సీరాణి జీవితంలో వివిధ ఘట్టాలను కాలానుగుణంగా ఇక్కడ ఇచ్చారు [1]
వాలు పాఠ్యం==ఇవి కూడా చూడండి==
బయటి లింకులు [మార్చు]
- THe Rani of Jhansi, a brief biography
- Lakshmibai, Rani of Jhansi
- John Lang's account of his meeting with the Rani
- Poetry on Jhansi Ki Rani by Smt Subhadra Kumari Chauhan
- Day by day account of Rani Lakshmibai's role during the First Indian Rebellion
- Queen Lakshmibai of Jhansi by Dr. Jyotsna Kamat
మూలాలు [మార్చు]
- ↑ "The India of the Nawabs". The New York Times. Retrieved 2007-05-15.
- ↑ Extracts from three letters by a Mr Martin to John Venables Sturt