పిల్లలు

వికీపీడియా నుండి

సంతానం .ఇంకా యుక్త వయసు రాని అమ్మాయిలను, అబ్బాయిలను పిల్లలు అంటారు.[1][2] అయితే, తల్లితండ్రులు తమ సంతానాన్ని ఎంతటి వయసు వారైనా పిల్లలు అని అంటారు. యవ్వన లక్షణాలు కొంతమంది పిల్లలలో తొందరగా వస్తాయి.[3][4] ఈ పదం ఒకవిధంగా ఆలోచిస్తే ఏ వయసుకు చెందినవారికైనా వర్తిస్తుంది. ఉదా. పెద్దవాళ్ళు కూడా వారి తల్లిదండ్రులకు పిల్లలే కదా. ఇది పిల్ల మొక్కలకు కూడా వాడవచ్చును. ఒకేసారి పుట్టిన పిల్లలను కవలలు అంటారు.

విషయ సూచిక

[మార్చు] చట్టపరమైన నిర్వచనం

వివిధ దేశాలలో పిల్లలను చట్టపరంగా 'మైనర్' అని నిర్వచిస్తారు.

The Convention on the Rights of the Child నిర్వచనం ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మానవుల్ని పిల్లలుగా భావిస్తారు.[5]

పిల్లల్ని చదువుకోనీకుండా పనిలో ఉపయోగించి కార్మికులుగా చేయడం సరైనది కాదు. పేదవారైన తల్లిదండ్రులు దీనిని ప్రోత్సహిస్తున్నా, ఇళ్ళలో, కర్మాగారాలు, హోటల్లు మొదలైన వాటిలో వీరితో పనిచేయించుకోవడం బాల కార్మిక చట్టం ప్రకారం ఇది నేరం.

[మార్చు] పాపాయి మీద గేయాలు

నవమాసములు భోజనము నీరమెరుగక, పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో, నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన, ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార లన్నంబుగా తెచ్చుకొన్న యతిధి
బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,ధారుణీ పాఠశాలలో చేరినాడు
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత కరపి యున్నది వీని కాకలియు నిద్ర
బొటవ్రేల ముల్లోకములు జూచి లోలోన నానందపడు నోరులేని యోగి
తల్లి తండ్రుల తనూ వల్లరీ ద్వయికి వన్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు విషమను వ్యత్యాస మెరుగక ఆస్వాదింప చను వెర్రిబాగులాడు
అనుభవించు కొలంది నినుమడించుచు మరందము జాలువారు చైతన్య ఫలము
భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు, నిద్రపోవు, లేచి నిలువలేడు .. (చిన్ని నాన్న)
ఎవ్వరెరుంగరితని దేదేశమో గాని, మొన్న మొన్న నిలకు మొలిచినాడు
కౌగిట్లో కదలి గారాలు కురుస్తాడు! ఉయ్యేల్లో, ఉల్లంలో ముద్దులు మురిపిస్తాడు
గానమాలింపక కన్నుమూయని రాజు అమ్మ కౌగిటి పంజరంపు చిలక
కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు, ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊ లు నేర్చిన యొక వింత చదువరి, సతిని ముట్టని నాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి, తన ఇంటి క్రొత్త పెత్తనపుదారి
ఏమి పనిమీద భూమికి నేగినాడొ, నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని, ఇప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు !
ఊయేల తొట్టి ఏముపదేశ మిచ్చునో, కొసరి యొంటరిగ నూ కొట్టుకొనును
అమ్మ తో తనకెంత సంబంధమున్నదో, ఏడ్చి యూడిగము చేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో, బిట్టుగా కేకిసల్ కొట్టుకొనును
మూనాళ్ళలోన ఏప్పుడు నేర్చుకొనియెనో, పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును
ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి, చదువు సంధ్య నేర్చి బ్రతుకునపుడు
నాదు పసిడికొండ, నా రత్నమని, తల్లి పలుకు పలుకులితడు నిలుపుగాక ! -------గుర్రం జాషువా(పాడింది --ఘంటసాల)
  • పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు
పాపాయి నవ్వినా పండగే వచ్చినా పేదల కన్నుల కన్నీరే..నిరు పేదల కన్నుల కన్నీరే
చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు, మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు ...శ్రీశ్రీ
  • పాపాయి కన్నులు కలువ రేకుల్లు పాపాయి జులపాలు పట్టు కుచ్చుల్లు
పాపాయి దంతాలు మంచిముత్యాలు పాపాయి పలుకులు పంచదార చిలకలు --
  • బంగారు పాపాయి బహుమతులు పొందాలి(2)

పాపాయి చదవాలి మా మంచి చదువు(2) పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కళలన్నిచూపించి ఘనకీర్తి తేవాలి ఘన కీర్తి తేవాలి (2) బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు

మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప ఎవ్వరీ పాప అని ఎల్లరడగాలి పాపాయి చదవాలి మా మంచి చదువు(2) బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు(2)

తెనుగు దేశము నాది తెనుగు పాపను నేను(2) అని పాప జగమంత చాటి వెలిగించాలి మా నోములపుడు మాబాగ ఫలియించాలి(2) బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు --మంచాల జగన్నాధరావు (సంగీతం- సాలూరి హనుమంతరావు,పాడింది:రావు బాల సరస్వతీ దేవి)

[మార్చు] బాల్య వివాహాలు

18 ఏళ్ళు నిండని పిల్లలకు వివాహం చేయడాన్ని 'బాల్య వివాహాలు' అంటారు.పది సంవత్సరాలు కూడా నిండని పసిపిల్లలకు పూర్వం పెళ్ళి ల్లు చేసేవారు. పది సంవత్సరాలు నిండని కన్యను నీ చేతుల్లో పెడుతున్నాననే పెళ్ళి మంత్రంతో కన్యాదానం జరుగుతుంది.ఇప్పుడు బాల్య వివాహాలు నేరం.

[మార్చు] బాలభటులు

ప్రధాన వ్యాసం: బాలభటులు

[మార్చు] బాలమేధావులు

ప్రధాన వ్యాసం: బాలమేధావి

18ఏళ్ళ లోపు వయసులోపే ఏదో ఒక రంగంలో తన వయసుకు మించిన మేధస్సు,ప్రతిభ కనబరిచిన వాళ్ళు:

  • చిత్రకారులు: ఫాబ్లో పికాసో,
  • గణితం: కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, శ్రీనివాస రామానుజన్,దమ్మలపాటి విజయకృష్ణ ,
  • సంగీతం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  • చదరంగం:దాసరి శాయిశ్రీనివాస్,కోనేరు హంపి
  • నాట్యం:జె.వి.శాయి తేజస్వి,
  • ఈత:వన్నం జ్యోతిసురేఖ,
  • జ్ఞాపకశక్తి:నిశ్చల్ నారాయణ్,కె.జి.యస్.అపురూప్,

[మార్చు] సాహస బాలలు

ప్ర్రాణాలకు తెగించి దైర్యసాహసాలు చూపి ఇతరులను రక్షించిన 6 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలకు సాహస బాలల అవార్డులు ఇస్తారు:

  1. జాతీయ దైర్యసాహసాల అవార్డు 1957 నుండి
  2. గీతా చోప్రా,సంజయ్ చోప్రా అవార్డులు 1978 నుండి
  3. భారత్ అవార్డు 1987 నుండి
  4. బాపు గయదాని అవార్డు 1988 నుండి

[మార్చు] తెలుగు సాహస బాలలు

  • బోయ గీతాంజలి (12) : అనంతపురం. 7 గురు నక్సలైట్లతో పెనుగులాడి ఒక శాసనసభ్యురాలిని కాపాడింది (2004)
  • వి.తేజశాయి : విజయవాడ మున్నేరు నదిలో తన సహచర విద్యార్ధులను కాపాడి చనిపోయాడు (2006)
  • సి.వి.యస్. దుర్గ దొండేశ్వర్ : విజయవాడ మున్నేరు నదిలో తన సహచర విద్యార్ధులను కాపాడి చనిపోయాడు (2006)
  • రాయపల్లి వంశీ : నాగావళి నదిలోదూకి 5 గురు బాలికలను రక్షించాడు (2007 )
  • కవంపల్లి రాజకుమార్ 2007
  • పింజారి చినిగిసాహెబ్ 2007
  • తోటకూర మహేష్2002
  • జి. క్రాంతికుమార్ 2002
  • బి. శాయి కుశాల్ 2004: అడవి ఎలుగుబంటిపై అదే పనిగా రాళ్ళురువ్వి ఒక ముసలమ్మను కాపాడాడు.
  • చనిగళ్ళ సుశీల 2005: ఆలూరు, చేవెళ్ళ.బాల్య వివాహానికి వ్యతిరేకించి పోరాడింది
  • నాగరాణి వెంకటేశ్వరరావు 2005 :పెడన.

[మార్చు] బాలభక్తులు

[మార్చు] పండుగలు

  • నవంబరు 14: ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం (Children's day) పండుగ జరుపుకుంటాం.జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.దైర్యసాహసాలు చూపిన 16 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ రోజున అవార్డులు ప్రకటించి ప్రతి ఏటా రిపబ్లిక్ దినోత్సవం నాడు ఇస్తారు.
  • అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం ప్రతి సంవత్సరం హైదరాబాదులో జరుగుతుంది..

[మార్చు] సంతానలేమి

మన దేశంలో 20% సంతానానికి నోచుకోని జంటలున్నాయి. దీనిని వంధ్యత్వం లేదా సంతానలేమి అంటారు. ఇలాంటి 60 శాతం బాధితుల్లో వీర్యంలోనే లోపాలున్నాయి. శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవడానికి మానసిక, శారీరక ఒత్తిడి ప్రధాన కారణం. మద్యపానం, ధూమపానం, బిగుతైన లోదుస్తులు, ప్యాంట్లు ధరించడం, ఎక్కువగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం, ఎక్కువ గంటలు కూర్చుని ఉండడం, అధిక బరువు, ల్యాప్‌ టాప్‌లను అధికంగా వినియోగించడం కూడా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన కారణాలే .

[మార్చు] సంతాన సాఫల్యం

రజస్వల అయిన తర్వాత నుంచీ మహిళల్లో అండాల విడుదల తీరుతెన్నులు... ఆ వ్యక్తి ఏ వయసు వరకూ గర్భం దాల్చవచ్చు అనే అంశాన్ని అంచనా వేసి ముందే చెప్పేయగల విధానాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. స్త్రీలలో అండాల విడుదల ప్రక్రియ వేగాన్ని... ఎప్పటిదాకా ఆ సామర్థ్యం కొనసాగుతుందన్న అంశాన్ని చెప్పేయగల 'ఫ్రెజైల్‌-ఎక్స్‌' అనే జన్యువును పరిశోధకులు కనుగొన్నారు. 18 ఏళ్ల నుంచే ఈ పరీక్షద్వారా ఆ మహిళలో ఎంతకాలం పాటు అండోత్పత్తి చురుగ్గా సాగుతుంది అనే విషయాన్ని ఈ జన్యువు సూచిస్తుంది. దాన్నిబట్టి ఆయా మహిళలు బిడ్డకోసం ప్లాన్‌ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వివాహమైన వెంటనే...లేదంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గర్భం ధరించేలా ఆ అండాలను భద్రపరచుకునేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో దోహదపడుతుంది. (ఈనాడు7.11.2009)

[మార్చు] పిల్లలే మనకు పాఠాలు

మీ ఇంట్లోనే ఓ వ్యక్తిత్వవికాస గురువు ఉన్నాడు. బోసినవ్వులతో కర్తవ్యం బోధిస్తాడు. తీపి మాటలతో అనుగ్రహభాషణం చేస్తాడు. బుడిబుడి నడకలతో మీ దారెటో చెబుతాడు. ఆ పసివాడి బాల్యమే మీకు సందేశం.ఆ మాటలు, ఆ ఆటలు, ఆ నవ్వులు, ఆ చేష్టలు...బాల్యమంతా విజ్ఞాన సర్వస్వమే. బుడిబుడి అడుగులు...పడతారు, లేస్తారు, నడుస్తారు...మళ్లీ పడతారు, మళ్లీ లేస్తారు, మళ్లీ నడుస్తారు.ఎన్నిసార్లు పడతారో, ఎన్నిసార్లు లేస్తారో, ఎన్నిమైళ్లు నడుస్తారో లెక్కేలేదు. నడక వచ్చేదాకా ఆ దెబ్బలు భరిస్తూనే ఉంటారు. ఆ నొప్పులు అనుభవిస్తూనే ఉంటారు.అడుగులేసే దశలో పసివాళ్లు రోజుకు ఆరేడుగంటలు నడక నేర్చుకోడానికే కేటాయిస్తారట. బాగా నడవడం వచ్చేసరికి, ఇరవైతొమ్మిది ఫుట్‌బాల్‌ మైదానాలు చుట్టొచ్చినంత దూరం నడుస్తారట . దాదాపు పదివేల మెట్లు ఎక్కిదిగుతారట. నడక రాగానే...'హమ్మయ్య! సాధించేశాం' అని చంకలుగుద్దుకోరు. విశ్రాంతి తీసుకోరు. పరుగెత్తడం నేర్చుకుంటారు. గెంతడం నేర్చుకుంటారు. ఎక్కడం నేర్చుకుంటారు. జారడం నేర్చుకుంటారు. సైకిలు తొక్కడం నేర్చుకుంటారు. ఈతకొట్టడం నేర్చుకుంటారు. ఆ ప్రయత్నాల్లో చేతులు గీసుకుపోతాయి.మోకాలి చిప్పలు పగిలిపోతాయి.అయినా వెనుకడుగు వేయరు. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు.పెద్దలూ పసిపిల్లలే మీకు పడిలేచే పాఠాలు. మాటల్లోతప్పులు దొర్లితే, అంతా నవ్వుతారని తెలుసు. అయినా, ధైర్యంగా మాట్లాడతారు. మాటలన్నీ వచ్చేదాకా మాట్లాడుతూనే ఉంటారు. ఇంట్లో ఒక భాష, వీధిలో ఒక భాష, బళ్లో ఒక భాష. తొలిదశలో కాస్త తికమకపడ్డా, తొందర్లోనే అన్నీ ఒంటబట్టించుకుంటారు. పసిపిల్లలు రెండేళ్ల వయసు నుంచి పొద్దున్న నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేలోపు సగటున గంటకో కొత్తపదం నేర్చుకుంటారని అంచనా. పదిహేనేళ్లు వచ్చేసరికి పెద్ద పదకోశమే తయారవుతుంది. ఆ తర్వాత తొంభై ఏళ్లు బతికినా వందేళ్లు బతికినా... ఆ పదకోశంలో చేరేది ఏ వేయిపదాలో రెండువేల పదాలో!పెద్దయ్యాక కష్టపడి కొత్త భాషలు నేర్చుకున్నా, అంతంత పరిజ్ఞానమే.పసిపిల్లల్లా తమకేమీ తెలియదనుకునేవారే ఏమైనా నేర్చుకోగలరు. పసివాడికి అమ్మానాన్నలమీదో గురువుమీదో ఉన్న నమ్మకం, భార్యకు భర్తమీదో భర్తకు భార్యమీదో ఉంటే కాపురాల్లో గొడవలుండవు. అనుబంధాల్లో బీటలుండవు. ఆత్మహత్యలుండవు. హత్యలుండవు.ముందు మీరంతా మార్పుచెంది పిల్లల్లాగా అవకపోతే స్వర్గంలో ప్రవేశించలేరు అంటుంది బైబిలు (మత్తయి 18.3). పురాణాల్లోని సనకసనందాదులు కూడా నిత్యబాల్యాన్ని వరంగా పొందారు.పసిపిల్లలంత స్వచ్ఛంగా ఉండేవారే మంచి నాయకులు అవుతారు. బాలల్లోని జిజ్ఞాస, నిజాయతీ, చొరవ...మనకు అనుసరణీయం.(ఈనాడు8.11.2009)

[మార్చు] మూలాలు

  1. yourdictionary.com: Child
  2. dict.die.net: Child
  3. Edwards, Jonathan (2007-05-17). Helping my son improve his game. allexperts.com. తీసుకొన్న తేదీ: 2007-10-16.
  4. Yearbook of the National Society for the Study of Education
  5. Convention on the Rights of the Child. Office of the United Nations High Commissioner for Human Rights ([[]]). Ratified by 192 of 194 member countries.

పేజీకి సంభందించిన లింకులు