శ్రీలంక

వికీపీడియా నుండి
SrilankaFont.png
இலங்கை ஜனநாயக சமத்துவ குடியரசு
ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర శ్రీలంక
Flag of శ్రీలంక శ్రీలంక యొక్క చిహ్నం
జాతీయగీతం
"శ్రీలంక మాత"
సంగీతం , [[:Media:|గాత్రం]]
శ్రీలంక యొక్క స్థానం
రాజధాని శ్రీ జయవర్ధనపుర-కొట్టె
6°54′N, 79°54′E
Largest city కొలంబో
అధికార భాషలు సింహళ, తమిళం
ప్రభుత్వం ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర రాజ్యము
 -  అధ్యక్షుడు మహింద రాజపక్ష
 -  ప్రధానమంత్రి రత్నసిరి విక్రమనాయకే
స్వాతంత్ర్యము యునైటెడ్ కింగ్‌డం నుండి 
 -  ప్రకటన ఫిబ్రవరీ 4 1948 
 -  గణతంత్రము మే 22 1972 
విస్తీర్ణం
 -  మొత్తం 65,610 కి.మీ² (122వ)
25,332 చ.మై 
 -  జలాలు (%) 4.4
జనాభా
 -  2005 అంచనా 19,668,000[1] (52వ)
 -  2001 జన గణన 18,732,255 
 -  జన సాంద్రత 310 /కి.మీ² (35వ)
818 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $86.72 బిలియన్ (61వ)
 -  తలసరి $4,600 (111వ)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $26.794 బిలియన్ (78వ)
 -  తలసరి $1,355 (119వ)
Gini? (1999–00) 33.2 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Green Arrow Up Darker.svg0.755 (medium) (93వ)
కరెన్సీ శ్రీలంక రూపాయి (LKR)
కాలాంశం (UTC+5:30)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .lk
కాలింగ్ కోడ్ +94

శ్రీలంక (అధికారికంగా డెమోక్రటిక్ సోషలిష్టు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక)ను 1972కు పూర్వం సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ది చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. ఇది ఉన్న ప్రదేశం మూలంగా పశ్చిమ ఆసియాకు మరియు ఆగ్నేయ ఆసియాకు నౌకాయాన కేంద్రంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచి బౌద్ధ మతంనకు మరియు సాంప్రదాయానికి కేంద్ర బిందువు. కానీ నేడు ఇతర మతాలైన హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రజలు మరియు ఇతర జాతుల వారు 25% శాతం వరకూ ఉన్నారు. జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తమిళులు మైనారిటీలో అధిక ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొన్ని ముస్లిం తెగల వారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. టీ, కాఫీ, రబ్బరు, మరియు కొబ్బరి కాయల ఎగుమతులకు శ్రీలంక ప్రసిద్ధి గాంచింది. అభివృద్ధి చెందుతున్న ఆధునిక వాణిజ్య వ్యవస్థ, ప్రకృతి అందాలు సముద్ర తీర ప్రాంతాలు, మరియు అడవులు ఘనమైన సంస్కృతి మరియు నాగరికతలు దీనిని పర్యాటక కేంద్రంగా నిలుపుతున్నాయి. రెండు వేల సంవత్సరాలపాటు చిన్న రాజ్యాలుగా పాలింపబడిన శ్రీలంకకు 16వ శతాబ్దం మొదటి భాగంలో పోర్చుగీసు వారి రాకతో విదేశీయుల రాక ఆరంభమైంది. 1815వ సంవత్సరంకల్లా బ్రిటిష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై దాడిచేసేందుకు సంకీర్ణ దళాలకు శ్రీలంక ప్రధాన స్థానంగా ఉపయోగపడింది. జాతీయ రాజకీయ ఉద్యమం మూలంగా 20వ శతాబ్దం మొదటి భాగంలో 1948లో స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి శ్రీలంక గణతంత్ర రాజ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈశాన్య ప్రాంతంలో పొంచిఉన్న తమిళ్ టైగర్సు.

విషయ సూచిక

పేరు [మార్చు]

పురాతన కాలంలో శ్రీలంకకు వివిధ పేర్లు వ్యవహారంలో ఉండేవి. పురాతన గ్రీకులు టాప్రొబేన్ అని, అరబ్బులు సేరేండిబ్ అని పిలిచేవారు. శ్రీలంకకు శిలయో అని 1505 లో ఈ ద్వీపానికి వచ్చిన పోర్చుగీసు వారు నామకరణం చేశారు. అదే ఆంగ్లం లో 'సిలొన్' గా అనువాదింపబడింది. 1972 లో శ్రీలంక అధికారిక నామం 'ఫ్రీ, సోవరిన్ అండ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' అయింది. 1978లో, శ్రీలంక ను అధికారికంగా 'డెమాక్రెటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' గా ప్రకటించారు.

ప్రస్తుత పేరులోని 'లంక' సంస్కృతం నుండి వచ్చింది. లంక అంటే 'తేజస్సుగల భూమి' లేదా 'ద్వీపం' అని అర్థం. ఇదే పేరు రామాయణం మహాభారతం లలో కూడా కనిపిస్తుంది. సంస్కృతం లో 'శ్రీ' అంటే భవ్యమైనది అని అర్ధం.

చరిత్ర [మార్చు]

పడమర పీఠ భూముల లోనూ సెంట్రల్ హిల్స్ యొక్క నైరుతి వైపూ ఉన్న పలు గుహ స్థలాలలో జరిగిన త్రవ్వకాల్లో పురాతన రాతి యుగపు మానవ స్థిరావాసాలు కనుగొనబడినవి. బయట పడిన కొన్ని పాతి పెట్టబడిన, మరియు అలంకరణ సామగ్రిని బట్టి ఈ ద్వీపపు మొదటి inhabitants కీ దక్షిణ భారత దేశపు తొలి inhabitants కీ సారూప్యత ఉన్నదని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

మిలటరీ [మార్చు]

భౌగోళికం మరియు వాతావరణం [మార్చు]

శ్రీలంక ద్వీపం హిందూ మహాసముద్రంలో, బంగాళాఖాతానికి ఈశాన్య దిక్కులో ఉంది. భారత ఉపఖండాన్ని, శ్రీలంక ని పాక్ జల సంధి (గల్ఫ్ ఆఫ్ మన్నార్) వేరు చేస్తుంది. హిందూ పురాణాల ప్రకారం రాముని కాలంలో ఒక రాళ్ళ వంతెన కట్టబడిందని ప్రసిద్ది.


పాక్ జల సంధి యొక్క వెడల్పు చాలా తక్కువ అయినందువల్ల రామేశ్వరం నుంచి చూస్తే శ్రీలంక తీరం కనిపిస్తుంది. కన్నీటి చుక్క ఆకారం ఉన్న ఈ ద్వీపపు భూవృత్తాంతము ఎక్కువగా చదునుగా ఉంటుంది. పర్వతాలు దక్షిణ మధ్య ప్రాంతంలోనే కనిపిస్తాయి. పర్వతశ్రేణుల్లో చెప్పుకో దగ్గవి శ్రీ పద (ఆడమ్స్ పీక్), దేశంలోనే ఎత్తైన పర్వతం పిధురుతాలంగళ (2,524 mts). మహావేలీ నది అధిక శాతం నీటిని సరఫరా చేస్తుంది.

మూలాలు [మార్చు]


"http://te.wikipedia.org/w/index.php?title=శ్రీలంక&oldid=809328" నుండి వెలికితీశారు