తమిళ భాష
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
తమిళం ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతన మైన భాష. దక్షిణ భారతదేశం, శ్రీలంక, సింగపూర్లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిద దేశాల్లో ఈ భాషని మాతృభాష కలిగిన తమిళురు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 18వ స్థానంలో ఉంది.
[మార్చు] చరిత్ర
ద్రవిడ కుటుంబానికి చెందిన మిగిలిన భాషలతో పోలికలున్నప్పటికీ, తమిళం భారతదేశంలో ఉన్న చాల భాషలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మౌలికంగా సంస్కృతంతో ప్రమేయం లేకుండా ఈ భాష ఆవిర్భవించిదన్న భావన ఉంది. ద్రవిడ భాషల్లోకెల్ల సుధీర్ఘ (రెండు వేల సంవత్సరాలకు మించిన) సాహిత్య-చరిత్ర గల భాషగా తమిళం గుర్తించబడింది.
తమిళ భాషకి అత్యంత దగ్గర పోలికలు గల భాష మలయాళం అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దము వరకు తమిళ మలయాళం భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పద్నాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన.
ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ మరియు యెరుకుల మొదలైనవి తమిళభాష కి ఉప భాషలు గా వాడుకలో ఉన్నవి.
మొట్టమొదటి తమిళ గ్రంథం క్రీ.పూ.3వ శతాబ్ధంలో జరిగెనని అధారాలు కలవు. 'సంగ కాలం'గా పిలువబడే క్రీ.పూ.300 - క్రీ.శ.300 మధ్య కాలంలో తమీళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖలు వ్రాయబడ్డాయి. దక్షిన ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లెకపోవటం విశేషం. సంగకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం రక్షించబడుతూ ఇప్పటికి లభ్యంలో ఉన్నా గ్రంథాలు అనేకం ఉన్నాయి.
తమిళ భాష సాహిత్యాన్నీ, వ్యాకరణ పరిణామ క్రమాన్నీ బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:
- సంగకాలం (క్రీ.పూ.300 - క్రీ.శ. 300)
- సంగ తరువాతి కాలం (క్రీ.శ.300 - క్రీ.శ.700)
- భక్తి సాహిత్య కాలం ( క్రీ.శ.700 - క్రీ.శ.1200)
- మధ్య కాలం ( క్రీ.శ.1200 - క్రీ.శ.1800)
- ప్రస్తుత కాలం ( క్రీ.శ.1800 - ఇప్పటి వరకు).
భక్తి సాహిత్య కాలంలో మరియు మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసినవి. తరువాతి కాలంలో 'పరిదిమార్ కళైఞర్' (1870 - 1903) , 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది.
[మార్చు] లోక్ సభలో తమిళం
కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి,కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలని జయలలిత డిమాండ్ చేశారు.అతని ప్రసంగాన్ని హిందీ,ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించేందుకు నిరాకరించటం ధారుణమని విమర్శించారు.http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?CatId=317948&Categoryid=1&subCatId=32
అసలు ఈ కోరికే కడు విడ్డూరముగా నున్నది. ఇది స్వభాషా దురభిమానము.
|
|||||||||||||||||
|
|||||||