వెండి
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
వెండి లేదా రజతం (ఆంగ్లం: Silver) ఒక తెల్లని లోహము మరియు రసాయన మూలకము. దీని సంకేతం Ag (ప్రాచీన గ్రీకు: ἀργήεντος - argēentos - argēeis, "white, shining) మరియు పరమాణు సంఖ్య (Atomic number) 47. ఇది ఒక మెత్తని, తెల్లని మెరిసే పరివర్తన మూలకము (Transition metal). దీనికి విద్యుత్ మరియు ఉష్ణ ప్రవాహ సామర్ద్యం చాలా ఎక్కువ. ఇది ప్రకృతిలో స్వేచ్ఛగాను మరియు ఇతర మూలకాలతో అర్జెంటైట్ (Argentite) మొదలైన ఖనిజాలుగా లభిస్తుంది.
వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. ఇది ఆభరణాలు, నాణేలు మరియు వంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈనాడు వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు మరియు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. వెండి సమ్మేళనాలు ముఖ్యంగా సిల్వర్ నైట్రేట్ (Silver nitrate) ఫోటోగ్రఫీ ఫిల్మ్ తయారీలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నది.
సంస్కృతి [మార్చు]
- వెండికొండ లేదా రజతాచలం అనగా శివుని నివాసమైన కైలాసం.
- రజతోత్సవం: ఏదైనా సంస్థ ఏర్పడి ఇరవై అయిదు సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసుకొనే ఉత్సవం.
|
|||||||||||