వజ్రం

వికీపీడియా నుండి

వజ్రం
Brillanten.jpg
వివిధ ఉపరితలాలు కలిగి కాంతులు విరజిమ్ముతున్న ఒక వజ్రం
సాధారణ సమాచారం
వర్గము Native Minerals
రసాయన ఫార్ములా C
ధృవీకరణ
పరమాణు భారం 12.01 u
రంగు సాధారణంగా పసుపు పచ్చ, కపిల వర్ణం, లేదా వర్ణరహితం. అక్కడక్కడా నీలం, ఆకుపచ్చ, నలుపు, తెలుపు, గులాబీ రంగు, మరియు ఎరుపు.
Crystal habit అష్ట ముఖి
Crystal system Isometric-Hexoctahedral (Cubic)
Cleavage 111 (perfect in four directions)
Fracture Conchoidal - step like
Mohs Scale hardness 10

వజ్రం (ఆంగ్లం: Diamond) ఒక ఖరీదైన నవరత్నాలలో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఘనీభవించిన కార్బన్ అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమే. ఈ కాఠిన్యం దీనీలో కల కర్బన పరమాణువుల ప్రత్యేక అమరిక వల్ల సంక్రమిస్తుంది. దీని తరువాత అత్యంత కఠినమైన పదార్థమైన కోరండం కన్నా ఇది నాలుగు రెట్లు గట్టిదైనది.[1]. కొద్దిపాటి మలినాలైన బోరాన్ మరియు నత్రజని లను మినహాయిస్తే వజ్రం మొత్తం కర్బన పరమాణువులచే నిర్మితమై ఉంటుంది. [2]. మొట్ట మొదటి వజ్రాలు భారతదేశంలో, మరియు బోర్నియాలో లభ్యమైనట్లు చరిత్ర చెపుతోంది. [3].చారిత్రక ప్రసిద్ధి గాంచిన వజ్రాలన్నీ భారతదేశానికి చెందినవే. వీటిలో కోహినూర్ వజ్రం అత్యంత ప్రాధాన్యత కలిగినది. 1867 లో దక్షిణాఫ్రికా లో కనుగొనబడ్డ ఒక రాయి వజ్రం గా తేలడంతో కొన్ని సంవత్సరాల తర్వాత నదులలోనూ కొన్ని నేలల్లోనూ వీటికోసం వెదుకులాట ప్రారంభమైంది. బోత్స్వానా, నమీబియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాలు వజ్రాలను ఉత్పత్తి చేయడంలో ముందున్నాయి.

[మార్చు] సంస్కృతి

[మార్చు] మూలాలు




"http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు