శృంగేరి
వికీపీడియా నుండి
| ?శృంగేరి కర్ణాటక • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 672 మీ (2,205 అడుగులు) |
| జిల్లా(లు) | చిక్‌మగులూరు జిల్లా |
| శాసనసభ సభ్యుడు | డి.ఎన్.జీవరాజ్ |
| కోడులు • పిన్‌కోడు • టెలీఫోను • వాహనం |
• 577139 • +08265 • KA-18 |
అక్షాంశరేఖాంశాలు: శృంగేరి (కన్నడ: ಶೃಂಗೇರಿ) కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున కలదు. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు రోమపాదుడి [1]పాలిస్తున్న అంగ రాజ్యాములొ అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామము నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. ఈ కథ బాల కాండములో వస్తుంది. ఈ గ్రామములోనే ఉన్న శృంగేరి శంకర మఠమును దక్షిణామ్నాయ మఠం అని అంటారు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఇతిహాసం ప్రకారం శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో, శంకరుడు ఇక్కడకు వచ్చినప్పుడు ఒక కప్ప ప్రసవిస్తున్నప్పుడు సర్పము నీడ కలిపించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ఇంతే కాకుందా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఊదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది. ఈ రెండు సంఘటనలు చూసాక శంకరులు ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపిస్తారు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరిలో, కంచిలో, బదరిలో ,ద్వారకలో మఠాలను స్థాపించారు.
[మార్చు] జనాభా-డేమోగ్రఫీ
శృంగేరి 13.42°అక్షాంశం పై 75.25°రేఖాంశం పై ఉన్నది[2].సముద్ర మట్టానికి సుమారుగా 672 (2204 అడుగులు).మీటర్ల ఎత్తులో ఉంది .
2001 జనాభా లెక్కల ప్రకారం శృంగేరి జనాభా 4253 (52 శాతం పురుషులు 48 శాతం స్త్రీలు). శృంగేరి అక్షరాస్యత 83 శాతము. ఇది జాతీయ సగటు అక్షరాస్యత కంటే (59.5%) ఎక్కువ. ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న జనాభా 8 శాతం.
[మార్చు] దర్శించవలసిన ప్రదేశాలు
శృంగేరిలో ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి.
శృంగేరిలో ముఖ్యమైన దర్శనీయ విశేషాలు
-
- శారదాంబ దేవాలయం
- విద్యాశంకర దేవాలయం
- ఆది శంకురల దేవాలయం
- నరసింహవనం
- తుంగ నది
[మార్చు] శారదాంబ దేవాలయం
శారదాదేవి జ్ఞానానికి విజ్ఞాన సర్వసానికి తల్లి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు శంకరాచార్యుల సమయమునుండి ఉన్నదని చెబుతారు. మండన మిశ్రుడి భార్య అయిన ఉదయ భారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని కూడా చెబుతారు. మెదలు ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14 వ శతాబ్ధములొ విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి మరియు బంగార విగ్రహ ప్రతిష్ఠ చేసారని చరిత్ర బట్టి తెలుస్తోంది. ఆలయ పరిసరాలు 20 వ శతాబ్ధం వరకు చెక్క తో నిర్మించబడినది. అగ్నిప్రమాదము జరగడంతో పాత దేవాలయపు స్తానములో కొత్తదేవాలయము నిర్మించారు. జీర్ణోద్ధారణ జరిగిన ఆ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో [3] జరిగింది.
[మార్చు] విద్యాశంకర దేవాలయం
శారదా శృంగేరి మఠానికి పదవ పీఠాధిపతైన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత పీఠాధిపతి భారతి కృష్ణ తీర్థుల ఆధ్వర్యంలో 1357-58 మిగిలిన నిర్మాణం జరిగింది. విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు, బుక్క రాయలకు గురువు. ఈ ఆలయం నిర్మాణం హొయసల శైలలో జరిగింది. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంగా ఉంటారు. స్వామికి ఇరుప్రక్కల వినాయకుడు, అమ్మవారు ఉంటారు. ఈ దేవాలయం లోపలి మండపంలోని స్థంబాలపై 12 రాశులు చెక్కి ఉంటాయి. ఆలయ నిర్మాణం, గవాక్షాల ఏర్పాటు (కిటికీ ఏర్పాటు) సూర్య కిరణాలు నెలల ప్రకారం ఆయా రాశుల మీద పడేటట్లు చేయబడింది. ఇంకో విశేషం ఏమంటే మండపంలోని స్థంభాలపై ఉన్న గుండ్రపు రాళ్ళు గోళాకారంగా సింహపు నోటి నుండి బయటకు జారునట్లుగా చెక్కారు. ఇవి సింహం నోటిలో ఉన్నట్లు ఉంటాయి కాని గోళం అంచులు సింహం నోటికి తగిలి తగలనట్లు ఉండి జారిపడతాయి అనిపించేటట్లుగా అత్యద్భుతంగా చెక్కారు.[4][5][6]
[మార్చు] శృంగేరి శారదా పీఠం
ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన నాలుగు మఠాలలో శృంగేరి శారద మఠం మెదటిది. దీనినే దక్షిణామ్నాయ మఠం గా చెబుతారు. దక్షిణ భారతదేశం లో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదము ఈ మఠానికి ప్రధాన వేదం. ఈ మఠానికి పీఠాధిపతి ని స్వయంగా శంకరాచార్యులతో సమానం గా భావిస్తారు. ఆయన సన్యాస్యాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని చేర్చబడుతుంది. ఇప్పటి శృంగేరి శారద మఠం పీఠాధిపతి భారతి తీర్థులు.
[మార్చు] తుంగ నది
శృంగేరి తుంగ భద్ర నది ఒడ్డున ఉన్నది. తుంగ నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం, దాని ప్రక్కన ఆ ఆలయానికి అనుసంధానం ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి పూజా మూర్తులకు అవసరమైన జలాలన్ని ఇక్కడ నుండే తెస్తారు. తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంది. అభినవ విద్యాతీర్థ స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపై విద్యాశంకర సేతువును నిర్మించారు. తుంగానదిలో అసంఖ్యాకంగా చేపలు నది ఒడ్డుకు వస్తుంటాయి, భక్తులు చేపలకు అటుకులు మున్నగునవి అహారంగా వేస్తారు. తుంగానది ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది, అందువలన ఇక్కడ ఈత కొట్టవద్దని హెచ్చరికలు ఉంటాయి.
[మార్చు] నరసింహ వనం
నరసింహవనంలొ శృంగేరి శారదా మఠానికి చెందిన పీఠం ఉంటుంది. పీఠాధిపతి ప్రతి రోజు ఆ పీఠాన్ని అర్చిస్తారు. నరసింహ వనంలోనే విదేహముక్తి పొందిన పూర్వ పీఠాధిపతుల స్మారక స్థూపాలు కూడా ఉన్నాయి. అభినవ విద్యాతీర్థ స్వామి, చంద్రశేఖర భారతి స్వామి స్థూపాల తో పాటు వారి విగ్రహాలు ఉంటాయి.
[మార్చు] వసతి సౌకర్యాలు
శృంగేరి మఠాన్ని సంప్రదిస్తే వసతి దొరుకుతుంది.
[మార్చు] ప్రయాణ సౌకర్యాలు
మంగళూరు నుండి తరచు బస్సు సౌకర్యం ఉంది. షిమోగా నుండి కూడా తరచు బస్సు సౌకర్యం ఉంది. శృంగేరి నుండి ఉడిపి కి బస్సు ఆగుంబె అనే ఊరి మీదుగామలనాడు పర్వతశ్రేణుల మధ్య నుండి వెళ్తుంది. 24 సన్నటి హైర్ పిన్ ఘాట్ రోడ్డులో ఉడిపి చేరు కోవచ్చు.
[మార్చు] ఇవికూడా చూడండి
- ఆది శంకరాచార్యుడు
- పూరీ మఠం
- ద్వారక మఠం
- శృంగేరి
- బదరీనాథ్ మఠం
- త్రిమతాలు
- అద్వైతం
- హిందూ మతం
- హిందూ ధర్మశాస్త్రాలు
[మార్చు] మూలాలు
- ↑ The legend of Rishyasringa. Sringeri Sharada Peeta. తీసుకొన్న తేదీ: 2006-11-07.
- ↑ Falling Rain Genomics, Inc - Sringeri
- ↑ Sri Sharadamba Temple. Sringeri Sharada Peeta. తీసుకొన్న తేదీ: 2006-11-07.
- ↑ Sri Vidyashankara Temple. Sringeri Sharada Peeta. తీసుకొన్న తేదీ: 2006-11-07.
- ↑ Zodiacal pillars of Sringeri. Current Science. Indian Academy of Sciences. తీసుకొన్న తేదీ: 2006-03-25.
- ↑ Vidyashankara Temple. Indiantemples.com. తీసుకొన్న తేదీ: 2006-11-07.
[మార్చు] బయటి లింకులు
|
|||||||