బదరీనాథ్ మఠం
వికీపీడియా నుండి
జ్యోతిర్మఠము అని పిలిచే బదరీనాధ్ ఆశ్రమం ఆది శంకరులు స్థాపించిన నాలుగు మఠాలలో ఒకటి. దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమం అని కూడా అంటారు.
[మార్చు] మఠ విశేషాలు
- ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం.
- పీఠ దేవత నారాయణుడు
- పీఠ శక్తి పూర్ణగిరి.
- పీఠ తీర్థం అలకనంద(గంగానది).
వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి","పర్వత","సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.