మంగళూరు

వికీపీడియా నుండి
  ?మంగళూరు
కర్ణాటక • భారతదేశం
మంగళూరు పణంబూర్ బీచ్‌లో సూర్యాస్తమయం
మంగళూరు పణంబూర్ బీచ్‌లో సూర్యాస్తమయం
అక్షాంశరేఖాంశాలు: 12°51′N 74°50′E / 12.85, 74.833
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
111.18 కి.మీ² (43 sq mi)
• 8.83 మీ (29 అడుగులు)
జిల్లా(లు) దక్షిణ కన్నడ జిల్లా
జనాభా
జనసాంద్రత
398 (2001)
• 3,586.5/కి.మీ² (9,289/చ.మై)
మేయరు విజయ అరున్
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 575001
• +0824
• KA-19
వెబ్‌సైటు: www.mangalorecity.gov.in



మంగళూరు (తుళు:కుడ్ల, ఆంగ్లము:Mangalore, కన్నడ: ಮಂಗಳೂರು, కొంకణి: కుడియాల్‌), పలకడం , నగరము కర్ణాటక రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరము కర్ణాటక రాష్ట్రానికి , భారత దేశానికి ఒక నౌకాశ్రయము ఇచ్చినది. ఈ నగరము భారత దేశ పశ్చిమమున అరేబియా సముద్రముతీరములో పశ్చిమ కనుమలకు పశ్చిమాన కలదు.

మంగళూరు దక్షిణ కన్నడ జిల్లా రాజధాని మరియు అధికార మరియు పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి మరియు దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైఋతి దిక్కులో ఉన్నది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి మరియు గుర్‌పుర్‌ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్‌ తీరంలో మంగళూరు ఒక భాగము.

మంగళూరు దేవాలయాలకు, బీచ్‌ లకు, పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, విద్యాసంస్థలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంగళూరు పట్టణంలో బహు భాషలు వాడుకలో ఉంటాయి. రాష్ట్ర భాషైన కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాషైన తుళు, కేరళకు సరిహద్దులో ఉండడం వల్ల మళయాళం, కొంకణి జనాభా కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంకణి భాషలు వాడూకలో ఉంటాయి. ఈ ప్రాంతీయ భాషలే కాకుండా, దేశ భాష హిందీ, ఆంగ్లము కూడా సుమారుగా నగర ప్రజలకు వస్తాయి.

నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో ఉన్నది.

విషయ సూచిక

[మార్చు] మంగళూరు పేరు ఉన్న కథ

మంగళూరు నగరం పేరు, నగర దేవత మంగళాదేవి పేరు మీద పెట్టబడిందని చెబుతారు.[1]

[మార్చు] ఇతర పేర్లు

మంగళూరు వివిధ సంస్కృతులకు అనేక శతాబ్దాలుగా నివాస స్థానం కావటం వల్ల ఆ నగరంలో నివసించే భిన్న భాషలవారు తమ తమ మాతృభాషల్లో పేరు ఇవ్వడంవల్ల మంగళూరుకు అనేకమైన పేర్లు వచ్చాయి. స్థానిక తుళు భాషలో మంగళూరునును 'కుడ్ల' అని పిలుస్తారు. అంటే కూడలి అని అర్థం. మంగళూరు నగరం నేత్రావతి, ఫల్గుణి నదుల సంగమ స్థానం కావటం ఈ పేరుకు కారణం. కొంకణి భాషలో మంగళూరును "కొడియల్" అని పిలిస్తారు. ముస్లింలలోని ఒక వర్గం వారు దీనిని మైకల అని వారి భాషలో పిలుస్తారు. దక్షిణ కేరళ ప్రాతంలోని ప్రజలు దీనిని "మంగళాపురం" గా సంభోదిస్తారు.

2006 సంవత్సరములో "సువర్ణ కర్ణాటక" ప్రణాళిక పేరుతో మంగళూరు నగరం పేరుని మంగలూరు గా కర్ణాటక ప్రభుత్వం మార్పు చేసింది దాని ప్రకారం ఆంగ్లంలో Mangalooru రాయాలి.

[1]


[మార్చు] భౌగోళిక ఉనికి

మంగళూరు 12.87° ఆక్షాంశము 74.88° రేఖాంశము[2]. సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తులొ ఉన్నది. ఈ పట్టణం అరేబియా సముద్రం కొంకణ తీరములో గోవా కి దగ్గరలొ ఉన్నది. మంగళూరు 3 జాతీయ రహదారుల ద్వారా దేశానికి కలుపబడుతోంది. NH-17 (1567 కి.మి.) మహారాష్ట్రలోని పణవెల్ (ఎద్దపల్లి సమీపములో)నుండి ప్రారంభమై కేరళలోని క్రణగాణురు జంక్షన్ వరకు వెళ్ళుతుంది, మంగళూరు మార్గమధ్యంలో (ఉత్తర-దక్షిణ) వస్తుంది. NH-48 మంగళూరు నుండి బయలు దేరి కర్ణాటక రాజధాని తూర్పు వైపుకు బెంగళూరు వైపుకు వెళ్ళుతుంది.NH-13 ఈశాన్య మార్గంలో షోలాపుర్కు చేరుకొంటు మార్గమధ్యంలో మడికరి మరియు మైసూర్ పట్టణాల మీదుగా పోతుంది. మంగళూరుకి బెంగుళూరుకి మధ్య ప్రతి దినము 300 బస్సులు నడుస్తుంటాయి.

[మార్చు] నగర పరిపాలన వ్యవస్థ

మంగళూరు నగర పాలిక చిత్రం

మంగళూరు నగర పరిపాలన మంగళూరు సిటి కార్పోరేషన్(కన్నడలో మంగలూరు మహానగరపాలికగా పిలుస్తారు) ద్వారా జరుగుతుంది. ఈ నగర పురపాలక సంఘ పరిధులు దక్షిణాన ముక్కా(నేత్రావతి వంతెనకు ఉత్తర భాగం), కుడుపు తూర్పు ఉత్తరానకి .

మంగళూరు నగర పాలికకు 60 మంది ప్రజాప్రతినిధులను కార్పొరేటర్లు అనే పేరుతో ఎన్నుకొంటారు. నగరంలో ఉన్న 60 వార్డులనుండి 60 మంది ప్రజా ప్రతినిధులు ఎన్నికౌతారు. నగరములో ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మెజారిటి సంపాదించిన ఉన్న పార్టిలోనే ఒక కార్పొరేటరర్‌ను నగర మేయర్ గా ఎన్నిక చేయబడతాడు.

మంగళూరు నగరపాలికా కార్యాలయం లాల్ బాగగ్‌లో కలదు (చిత్రం ప్రక్కన ఉన్నది). ఈ నగరపాలికా కార్యాలయానికి సంబంధించిన ఉపకార్యాలయాలు సురత్కల్ మరియు బికరనకట్టెలో ఉన్నాయి.

మంగళూరు నగరము పార్లమెంటులోని లోక్ సభకు ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటుంది. ఒక స్థానం దక్షిణ నగరనుండి మరో స్థానం ఉత్తర మంగళూరు మరియు ఉడిపి లోక్ సభా స్థానం నుండి.కర్ణాటక శాసనసభకు (కన్నడ భాషలో విధాన సౌధ) ముగ్గురు ప్రతినిధులను ఎన్నుకొంటుంది. ( మంగళూరు, ఉల్లాల్, సురత్కల్ అనే మూడు స్థానాలు)

మంగళూరు విద్యుత్తు సదుపాయం నిర్వహణా భాద్యతలు కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ లెమిటెడ్ (KPTCL)ద్వారా జరుగుతుంది. విద్యుత్తు సరఫరా బాధ్యతలు మంగళూరు ఎలక్ట్రిసిటి సప్లయి కంపెనీ(MESCOM)ద్వారా జరుగుతుంది. భారత దేశంలోని మిగతా నగరల వలే వేసవి కాలములో మంగళూరు నగరం విద్యుత్తు కోతకు గురి అవుతుంది. మంగళురు రిఫైనరి అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (MRPL)మరియు మంగళురు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(MCF) వంటి పరిశ్రమలు తమకు కావలసిన విద్యుత్తు ని తామే తయారు చేసుకుంటున్నాయి

పారిశుద్ధ్య నీరు నగర కార్పోరేషన్ ద్వారా ఇంటి ఇంటికి సరఫరా చేయబడుతుంది. నీటిని నేత్రావతి నది నుండి సంగ్రహించి శుద్ధి చేసి సరఫరా చేస్తుంది.

[మార్చు] జనాభా మరియు అక్షరాస్యత

2001 జనాభా లెక్క ల ప్రకారం మంగళూరు జనాభా 398,745. అందు పురుషులు 50% స్త్రీలు 50%. మంగళూరు అక్షరాస్యత జాతీయ సగటు(59.5%) కంటే చాలా ఎక్కువగా 83% వద్ద ఉన్నది. స్త్రీల అక్షరాస్యత 79% పురుషుల అక్షరాస్యత 86% గా నమోదైంది. మంగళూరు జనాభాలో 9% మంది పిల్లలు ఆరు సంవత్సరల కంటే తక్కువ వయస్సు కలవారు. ఇప్పటి జనాభా సుమారుగా 538,560 ఉండవచ్చని అంచనా.

[మార్చు] పరిసర ప్రాంతాలు

మంగళూరు నగరం చుట్టుపక్కల అనేక దర్శనీయస్థలాలు ఉన్నాయి.

  • మంగళాదేవి దేవాలయం: మంగళూరు నగరం మధ్యలో ఉన్న మంగళాదేవి దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. మంగళాదేవి అమ్మవారు ఈ నగరంలో వెలియడం వల్ల ఈ నగరానికి మంగళూరు అని పేరు వచ్చింది
  • కద్రి దేవాలయం: నగర నడి బొడ్డుకు 5 కి.మి. దూరంలో ఉన్న ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం, ఈ దేవాలయంలో వెలసినది మంజునాథ స్వామి. ఈ దేవాలయం చాలా పెద్ద విస్తీర్ణములో ఉన్నది.
  • సెయింట్ అలోసియస్ చర్చి మరియు కళాశాల: సెయింట్ అలోసియస్ చర్చి మంగుళూరులో కెళ్లా చాలా అందమైన చర్చి. దీనికి అనుబంధంగా ఉన్న సెయింట్ అలోసియస్ కళాశాల నగరములో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ. ఇక్కడ ప్రసిద్ధ చిత్రకారులు గీసిన చిత్రాలు యేసుక్రీస్తు జీవితములోని ప్రధాన ఘట్టాలను ప్రతిఫలిస్తున్నాయి.
  • కొత్త మంగుళూరు రేవు: కొత్త మంగుళూరు కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం. దేశంలోనే ఇది ೯వ పెద్ద రేవు. ಕಚ್ಚಾ ತೈಲ, సహజ వాయువు (LPG), చమురు, గ్రానైటు రాళ్ళు ఇక్కడ నుండి రవాణా అయ్యే ప్రధాన వస్తువులు.


  • గోకర్ణనాథేశ్వర: నగర కేంద్రము నుండి ೨ కి.మీ దూరములో కుద్రళి అనే ప్రదేశంలో శ్రీ గోకర్ణనాథేశ్వర దేవాలయము కలదు. ఈ దేవాలయ నిర్మాణం ఈ మధ్యనే జరిగింది. ఈ దేవాలయాన్ని హిందియప్ప నిర్మించారు. ఆలయాన్ని రాజీవ్‌ గాంధీ ప్రారాంభించారు.
  • సూరత్కల్ ద్వీపస్థంబము
  • శరవు మహా గణపతి దేవాలయము నగరం నడిబొడ్దులో ఉన్న శరవు మహాగణపతి దేవాలయం చాలా ప్రాచీనమైనది, దేవాలయంలో ప్రధాన దైవం మంజునాధేశ్వర స్వామి మరియు మహాగణపతి.

[మార్చు] దర్శనీయ స్థలాలు

  • పణంబూర్ బీచ్‌
  • ఉల్లాల్ బీచ్‌
  • నేత్రావతి బ్రిడ్జి - కంకనాడి నుండి తొక్కట్టు వెళ్ళుతుంటే వస్తుంది.
  • కద్రి ఉద్యానవనం
  • లాల్‌ బాగ్
  • సుల్తాన్‌ బత్తెరీ


[మార్చు] భాషలు మరియు సంస్కృతి

మంగళూరు నగరం తులు, కన్నడ, కొంకణి, బేరి బాషె మొదలగు భాషలలో మంగళూరు ప్రజలు సంభాషించగలరు, ఆంగ్ల భాషలో కూడా వారు సంభాషించగలరు. మంగళూరులోని అధికారికంగా గుర్తింపబడిన భాష కన్నడ.

[మార్చు] రవాణా సౌకర్యాలు

[మార్చు] మంగళూరు నగర బస్సు రవాణా వ్యవస్థ

మంగళూరు నగర రవాణా వ్యవస్థ అంతా పైవేటు బస్సుల రూపంలో చాలా వరకు పైవేటు రంగంలో ఉన్నది. నగరములోను, నగర పొలి మేరలలో చాలా గమ్యస్థాలలకు పైవేటు బస్సులు నగర నడి బొడ్డైన టౌన్‌ హాలు వద్ద నున్న స్టేట్ బ్యాంక్ నుండి నడుస్తాయి. నగరము దాటి బయటి ఊళ్ళలకు కూడా బస్సులు ఇక్కడ నుండే బయలు దేరుతాయి. నగరాన్ని దాటి దక్షిణ కన్నడ జిల్లాలోని, మరియు పొరుగు జిల్లాలోని గమ్యస్థానలకు వెళ్ళే బస్సులు రెండు రకాలు ప్యాసింజర్ బస్సులు, ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సులు. ప్యాసింజర్ సర్వీసు ప్రైవేటు బస్సులు సాధారణంగా మార్గమధ్యంలో వచ్చే అన్ని గ్రామాలలోని ప్రధాన కూడళ్ళలో నిలుస్తాయి. రెండు పట్టణాలు లేదా నగరాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు షాధారణంగా రెండు లేదా మూడు మార్గమధ్య పట్టణాలలో నిలుస్తాయి( ఉదాహరణకు మంగళూరు నుండి ఉడిపి వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌‌ బస్సు మంగళూరు విడిచి పెట్టాక ఉడిపి చేరే ముందు సూరత్కల్‌, పడుబిద్రి, కాపు అనే గ్రామాలలో మాత్రమే నిలుస్తుంది.

ఆటో రిక్షా ఇంకో రకమైన పబ్లిక్‌ రవాణా వ్యవస్థ. ఇక్కడ ఆటో లకు ఇంజన్లు వెనుక భాగంలో అమర్చబడి, తక్కువ శబ్ధం చేస్తాయి. రెండు కి.మి. వెళ్ళడానికి సుమారుగా 11 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆటో రిక్షాలన్నింటిలో బిల్లింగ్ మీటర్లు అమర్చారు, అందువల్ల ఎంత పైకం చెల్లించాలో ఆ మీటరు తెలియజేస్తుంది. కాని రాత్రి పూట (రాత్రి 9 గంటలనుండి తెల్లవారు జాము 6 గంటలవరకు) 1.5 శాతం మీటరు రీడింగ్‌ పై పైకం వసూలు చేస్తారు.

[మార్చు] రాష్ట్రములోని దూర ప్రదేశాలకు బస్సు సౌకర్యాలు

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) మంగళూరు నుండి కర్ణాటకా రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుంది. మంగళురు బెంగళూరు మధ్య ప్యాసింజరు రైల్వే సౌకర్యం లేకపోవడం వల్ల కె.యస్‌.ఆర్‌.టి.సి. బస్సు ఈ రెండు నగర మధ్య చాలా బస్సులు నడుపుతుంది. అతిపెద్ద దూరమైన మార్గం మంగళూరు- అంకోలా-హుబ్లీ-బెల్గాం-పూణె-ముంబాయి ప్రైవేటు బస్సులు కె.యస్‌.ఆర్‌.టి.సి. కూడా నడుపుతున్నాయి. మాములు బస్సులైతే 22 గంటలు, వోల్వో బస్సులైతే 16 గంటలు తీసుకొంటుంది గమ్యస్థానానికి వెళ్ళడానికి.

[మార్చు] రైలు రవాణా సౌకర్యము

కొంకణ్‌ రైల్వే నిర్మాణానికి మునుపు దక్షిణం నుండి(కేరళ) వచ్చే రైలు బండ్లకు మంగళూరు రైల్వే స్టేషనే చివరి గమ్యస్థానం. బ్రిటీష్ వారు దేశం నలుమూలల రైల్వేలను విస్తరించిన మంగళూరు ముంబాయి మధ్య, మంగళూరు హాసన్‌ మధ్య రైల్వే వ్యవస్థ అభివృద్ధికి పెద్దగా చేయలేదు.

స్వాతంత్ర్యం వచ్చాక మంగళూరు హాసన్‌ పట్టణాల మధ్య మీటర్ గేజ్‌ రైల్వే లైను పశ్చిమ కనుమలల్లో వేశారు. ఈ రైల్వే లైను పశ్చిమ కనుమల మధ్య ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య ఉన్న ఈ రైల్వే లైను ఎక్కువకాలం సర్వీసుకి నోచు కోలేదు. మీటర్ గేజ్ పట్టీలు నిర్ములించి బ్రాడ్‌ గేజ్‌ వేయడానికి ప్రారంభం జరిగిన రైల్వే లైను నిర్మాణం ఆదిలోనే నిలిచిపోయింది. ప్రాజెక్టు నడపడానికి సరైన నిధులకు లేకపోవడం, రాజకీయ నాయకుల నేతృత్వం ఈ ప్రాజెక్టు మీద సరిగ్గా లేకపోవడడం వంటివి ముఖ్యమైన కారణాలు. ( చివరకు ప్రాజెక్టు 2006లో పూర్తి అయ్యాక ప్యాసింజర్‌ సర్వీసు దిసెంబర్‌ 2006 నుండి ప్రారంభించవలసి ఉన్నది. వార్తాపత్రికలలో వచ్చే వార్తలు బట్టి మే2007 నుండి హాసన్‌ మంగళూరు మధ్య పూర్తి సర్వీసులు నిలకొల్పబడాలి.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా కూడా మంగళూరు ముంబాయి రైల్వే సర్వీసులు అభివృద్ధి నోచులేదు. చివరకి 1990-98 సంవత్సరాల మధ్య మంగళురు మొంబాయి మధ్య కొంకణ్‌ రైల్వే నిర్మాణం పూర్తి అయి, 1998 సంవత్సరంలో రైలు సర్వీసులు ప్రారంభించబడ్డాయి. ఈ సర్వీసులు మెదలు పెట్టాక ఉత్తర భారత దేశానికి కేరళ మధ్య ప్రయాణ సమయం 12 గంటల వరకు తగ్గుపోయింది. అయితే ఈ కేరళ నుండి ముంబాయి, ఉత్తర భారత దేశానికి వెళ్ళే రైలు బళ్ళు మంగళూరు రైల్వే స్టేషన్ నుండి కాక మంగళురు పొలిమేరలో ఉన్న కంకనాడి రైల్వే స్టేషన్‌ గుండా పోతాయి. ‍


[మార్చు] విమాన రవాణా సౌకర్యము

మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము మంగళూరు నగర నడిబొడ్డుకు ఈశాన్య దిశగా 20 కి.మి. దూరంలో ఊరి పొలిమేరలలైన బజ్‌పేలో ఉన్నది. 2005 సంవత్సరము వరకు విమాశ్రయ రన్‌ వే 1.6 కి.మి మాత్రమే ఉంది బోయింగ్ 737 మాత్రమే ఎగర డానికి దిగ డానికి అనువుగా ఉన్నది. జనవరి 10, 2006 న అనే రకాలైన పెద్ద విమానాలు కూడ రావడానికి వీలుగా రన్‌వే సామర్జయం పెంచడం జరిగింది. ఆరోజు మెదటిగా కింగ్‌ ఫిషర్‌ ఎయిర్ లైన్స్ వారి విమానం ఎయిర్ బస్‌ 319,320 మంగళూరు విమానశ్రయంలో నిలిచింది..[3] సరికొత్త 2.9 కి.మి. సామర్ధ్యం ఉన్న అంతర్జాతీయ రన్‌వే ని 10 మే 2006 వరకు పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు. ఈ ప్రణాళిక పూర్తి జరిగితే మంగళూరు విమానాశ్రయం కర్ణాటక రాష్ట్రంలో రెండు రన్‌వేలు ఉన్న విమానశ్రయంగా నిలుస్తుంది. [4] మరియు రన్‌వే అంతా కాంక్రీటుతో నిర్మితమై ఉంటుంది.[5]

[మార్చు] ఆర్థిక వ్యవస్థ - బ్యాంకింగ్‌ రంగం

ఇందిరా గాంధీ జాతీయం చేసిన 19 బ్యాంకలులో రెండు బ్యాంకుల స్థాపన 20వ శతాబ్ధం మెదటి భాగంలో మంగళూరు నగరములోనె జరిగింది. ఆ రెండు బ్యాంకులు ఏమనగా:-

మంగళూరులో స్థాపించబడిన ఇంకో బ్యాంక్‌ (జాతీయం చేయబడనిది)

  • కర్ణాటక బ్యాంక్‌, (1924 సంవత్సరములో స్థాపించబడి జాతీయం చేసే ప్రక్రియ నుండి తప్పించుకొన్న ప్రైవేటు బ్యాంకులలో ఈ బ్యాంకు ఒకటీ)

[మార్చు] విద్యాసంస్థలు

మంగళూరు పట్టణంలో జనాభా మిడీల్ క్లాసు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. 20 వ శతాబ్ధము మెదట్లో బ్యాంకింగు రంగం బాగా అభివృద్ధి చెందడం నగర అభివృద్ధికి తోడ్పడింది. మంగళూరు ప్రజలు విద్యారంగంపై ఎప్పుడు చాలా శ్రద్ధ చూపించేవారు అందువలన అనేక రంగాలలో విద్యాసంస్థలు మంగళూరులో ఉన్నాయి.

కస్తుర్బా మెడికల్‌ కాలేజి
కస్తుర్బా డెంటల్‌ కాలేజి
ఏనోపాయా మెడికల్‌ కాలేజి
ఏనోపాయా డెంటల్‌ కాలేజి
ఏ.బి.షెట్టి డెంటల్‌ కాలేజి
కె.యస్‌.హెగ్డే మెడికల్‌ కాలేజి
కర్ణాటక పాలటెక్నిక్‌ కాలేజి (కద్రి ఉద్యానవనం ఎదురుగా ఉన్నది)
సెయింట్‌ అలోషియస్‌ డిగ్రీ కాలేజి
అనేక ఫిజియౌతెరపీ కాలేజిలు
నిప్టి(NIFT)


1980 సంవత్సరము నుండి మొదలుగా అనేక ప్రొఫెషనల్ కాలేజిలు వివిధ రంగాలో( వైద్య కళాశాల, దంత వైద్య కశాళాల, ఇంజనీరింగ్ కళాశాల, హొటల్ మ్యానేజిమెంట్) స్థాపించబడ్డాయి. ఈ ప్రొఫెషనల్ కాలేజిలలో చదువకోవడానికి దేశం నలు మూలల నుండి విద్యార్థులు అసంఖ్యాకంగా వస్తారు. మంగళూరు విశ్వవిద్యాలయం 10 సెప్టెంబరు 1980న ఊరి పొలిమేరలలో స్థాపించారు. మంగళూరు విశ్వవిద్యాలయం దక్షిణ కన్నడ, ఉడిపి, కొడగు జిల్లాలలోని విద్యార్థుల ఉన్నత విద్యాసౌకర్యాలను చూస్తుంది. ఈ విశ్వవిద్యాలయం ప్రాసాదంలో అత్యఅధునిక విద్యాభోధన మరియు పరిశోధన అవకాశలు ఉన్నాయి. మంగళూరు విశ్వవిద్యాలయం అధునిక విశ్వవిద్యాలయం అయినా ఈ విశ్వవిద్యాలయానికి అనుసంధానముగా ఉన్న కళాశాలలు చాలా ప్రాచీనమైనవి. ఈ యూనివర్సిటిలో 28 డిపార్టమెంట్లుతో 118 కళాశాలను అనుసంధానిస్తూ, స్నాతకోత్తర ( పోస్ట్ గ్రాడుయేట్) స్నాతక (గ్రాడుయేట్) కళాశాలను పర్యవేక్షిస్తోంది. ముఖ్యమైన విద్యారంగాలు కళలు, వాణిజ్య శాస్త్రం,విజ్ఞానశాస్త్రం,న్యాయ శాస్త్రం.


[మార్చు] శీతోష్ణస్థితి మరియు వాతావరణం

కద్రి పార్కు చిత్రం

డిసెంబరు నుండి ఫిబ్రవరి నెలల మధ్య వాతావరణం చాలా అహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెలలలో మంగళూరు ఉష్ణోగ్రతలు, గాలిలోని తేమ సగటు స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. పగటి అత్యధిక ఉష్ణోగ్రతలు 30 °C రాత్రి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు 20 °C కంటే తక్కువగా ఉంటాయి. వేసవి కాలం మార్చి నుండి మే వరకు ఉంటుంది. వేసవి కాలములో అత్యధిక ఉష్ణోగ్రతలు 38 °C ని దాటుతాయి, గాలిలో తేమ కూడా 90 శాతానికి చేరుకొంటుంది. వేసవి కాలము తరువాత ఋతుపవనాలు మెదలవుతాయి. భారతదేశంలోని పట్టాణ ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం మంగళూరులో పడుతుంది. 4000 మి.మీ. వర్షపాతం జూన్‌-సెప్టంబర్‌ నెలలమధ్య పడుతుంది. సెప్టంబర్‌ నెలతో వర్షాలు తగ్గిపోతాయి. అక్టోబర్‍లో వర్షం పడడం కొద్దిగా అరుదు.


[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=మంగళూరు&oldid=676818" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు